దివాన్-ఇ-రియాసత్, షహనా-ఇ-మండి అనేవి ఢిల్లీ సుల్తాన్ల కాలంలో వేటికి సంబంధించినవి?
1. దివాన్-ఇ-రియాసత్, షహనా-ఇ-మండి అనేవి ఢిల్లీ సుల్తాన్ల కాలంలో వేటికి సంబంధించినవి?
1) భూమి శిస్తు
2) ఉన్నత ఉద్యోగులు
3) ఆదాయపు పన్ను
4) వాణిజ్యం
- View Answer
- సమాధానం:2
2. 1923లో ఫిస్కల్ కమిషన్ సిఫార్సు మేరకు ఏర్పాటైంది?
1) టారిఫ్ బోర్డ్
2) వ్యవసాయ కమిషన్
3) పారిశ్రామిక కమిషన్
4) నేషనల్ టెక్స్టైల్ బోర్డ్
- View Answer
- సమాధానం: 1
3. దక్షిణ భారతదేశంలో గ్రామ దానాలు చేసినవారు?
ఎ) చాళుక్యులు
బి) చోళులు
సి) పల్లవులు
డి) కాకతీయులు
1) ఎ మాత్రమే
2) బి, డి
3) ఎ, బి, సి
4) డి మాత్రమే
- View Answer
- సమాధానం: 3
4. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలోని ఏ ప్రాంతం కత్తుల పరిశ్రమకు ప్రసిద్ధి చెందింది?
1) కూనసముద్రం
2) సూర్యాపేట
3) కడ్తల్
4) నిజామాబాద్
- View Answer
- సమాధానం: 1
5. దివాన్-ఇ-అలా లేదా వజీర్ అంటే?
1) విజయనగర సామ్రాజ్య ఆదాయ శాఖాధిపతి
2) భూమిపై యాజమాన్య హక్కు ఉన్నవారు
3) మొగల్ రాజ్య ఆదాయ శాఖాధిపతి
4) పైవేవీ కాదు
- View Answer
- సమాధానం: 3
6. పరిపాలనా సౌలభ్యం కోసం తన సామ్రాజ్యాన్ని సుభాలు, సర్కార్లు, పరగణాలుగా విభజించినవారు?
1) షాజహాన్
2) జహంగీర్
3) షేర్షా
4) అక్బర్
- View Answer
- సమాధానం: 4
7. జహంగీర్, షాజహాన్ల కాలంలో భారత దేశంలో వాడుకలో ఉన్న నాణేలు?
ఎ) రియాల్
బి) ఫ్లోరిన్
సి) పాతపగోడా
డి) పౌండ్ స్టెర్లింగ్
1) ఎ మాత్రమే
2) బి, సి
3) సి, డి
4) ఎ, బి, సి, డి
- View Answer
- సమాధానం: 4
8. కాకతీయుల కాలంలో బయ్యారం చెరువును నిర్మించినవారు?
1) గంగాధరుడు
2) మైలమదేవి
3) రేచర్ల రుద్రుడు
4) రెండో బేతరాజు
- View Answer
- సమాధానం: 2
9. బ్రాహ్మణులపై జిజియా పన్ను విధించిన మొదటి పాలకుడు?
1) అల్లా ఉద్దీన్
2) మహమ్మద్ బిన్ తుగ్లక్
3) ఫిరోజ్ తుగ్లక్
4) రాజపుత్రులు
- View Answer
- సమాధానం: 3
10. దివాన్-ఇ-కోహీ అనే వ్యవసాయశాఖను ఏర్పాటు చేసినవారు?
1) మహమ్మద్-బిన్-తుగ్లక్
2) అక్బర్
3) షాజహాన్
4) షేర్షా
- View Answer
- సమాధానం: 1
11. మెదటిసారిగా మార్కెట్ స్నేహపూర్వక, సూచనాత్మక ప్రణాళికను ఏ ప్రణాళికలో అమలుపర్చారు?
1) 7
2) 8
3) 9
4) 10
- View Answer
- సమాధానం: 2
12. లార్డ్ కర్జన్ కమిషన్ బ్రిటిష్ కాలంలో కింది వాటిలో దేనికి సంబంధించింది?
1) భూమి శిస్తు
2) వాణిజ్యం
3) పారిశ్రామిక రంగం
4) క్షామ నివారణ
- View Answer
- సమాధానం: 4
13.1855లో కింది ఏ ప్రాంతంలో మొదటి జనపనార మిల్లు స్థాపించారు?
1) రిష్రా
2) కోల్‌కతా
3) సలిగురి
4) మంగళూరు
- View Answer
- సమాధానం: 1
14. షేర్షా కాలంలో ప్రభుత్వానికి ఆదాయం కింది వాటిలో దేని ద్వారా లభించేది?
ఎ) భూమిశిస్తు
బి) ఖామ్స్
సి) వ్యాపారంపై పన్ను
డి) జిజియా
1) ఎ, బి
2) బి, సి
3) ఎ, బి, సి
4) డి మాత్రమే
- View Answer
- సమాధానం: 3
15. శాశ్వతశిస్తు నిర్ణయ పద్ధతిని లార్డ్ కారన్ వాలీస్ ఎప్పుడు ప్రవేశపెట్టాడు?
1) 1793
2) 1797
3) 1802
4) 1815
- View Answer
- సమాధానం: 1
16. షేర్షా కాలంలో తోడర్మల్ దేని ఆధారంగా భూమిని నాలుగు రకాలుగా విభజించాడు?
1) నీటిపారుదల
2) ఉత్పాదకత
3) భూసారం
4) భూమి శిస్తు
- View Answer
- సమాధానం: 3
17. బ్రిటిష్ పాలనా కాలంలో అధిక మొత్తంలో వేలం పాట పాడినవారికి శిస్తు వసూలు అధికారాన్ని ఇచ్చినవారు?
1) కారన్ వాలీస్
2) సర్ జాన్‌షోర్
3) థామస్ మన్రో
4) వారన్ హేస్టింగ్స
- View Answer
- సమాధానం: 4
18. 1765లో ఆంగ్లేయ కంపెనీ కింది ఏ రాష్ట్రంలో రెవెన్యూ లేదా దివానీ అధికారాన్ని పొందింది?
ఎ) బెంగాల్
బి) బిహార్
సి) ఒడిశా
డి) మధ్యప్రదేశ్
1) ఎ, డి
2) బి మాత్రమే
3) ఎ, బి, సి
4) డి మాత్రమే
- View Answer
- సమాధానం: 3
19. 1853లో బొంబాయిలో మొదటి వస్త్ర మిల్లును ఏర్పాటు చేసినవారు?
1) రతన్‌టాటా
2) ధీరూభాయ్ అంబానీ
3) కవాజి నానాభాయ్
4) పై ఎవరూ కాదు
- View Answer
- సమాధానం: 3
20. గంగా కాలువ పునరుద్ధరణ కోసం కృషి చేసినవారు?
1) లార్డ్ ఆక్లాండ్
2) మౌంట్ బాటన్
3) డల్హౌసీ
4) లార్డ్ కర్జన్
- View Answer
- సమాధానం: 1
21. గోల్కొండ రాజ్యంలో ప్రధాన పరిశ్రమ?
1) ప్లాస్టిక్
2) పొగాకు
3) చేనేత
4) వజ్రాలు
- View Answer
- సమాధానం: 3
22. 1935-40 మధ్య కాలంలో భారత్ ఎగుమతుల్లో బ్రిటిష్ వాటాను ఎంతగా అంచనా వేశారు?
1) 23.1%
2) 25.2%
3) 26.4%
4) 27.2%
- View Answer
- సమాధానం: 2
23. బ్రిటిష్ కాలంలో వ్యవసాయంపై ఆధారపడిన జనాభాకు సంబంధించి సరైంది?
ఎ) 1891లో 61.1%
బి) 1901లో 66.5%
సి) 1911లో 72.2%
డి) 1921లో 73%
1) ఎ మాత్రమే
2) బి, సి
3) ఎ, బి, డి
4) ఎ, బి, సి, డి
- View Answer
- సమాధానం: 4
24. కాకతీయుల కాలంలో హన్మకొండ చెరువును నిర్మించినవారు?
1) గంగాధరుడు
2) మైలమదేవి
3) రేచర్ల రుద్రుడు
4) మొదటి ప్రోలరాజు
- View Answer
- సమాధానం: 1
25. కింది ఎవరి కాలంలో సింధు నది మొదలుకొని తూర్పున బెంగాల్‌లోని సోనార్గావ్ వరకు రహదారి నిర్మితమైంది?
1) అక్బర్
2) షేర్షా
3) ఫిరోజ్ తుగ్లక్
4) మహమ్మద్ బిన్ తుగ్లక్
- View Answer
- సమాధానం: 2
26. 1943లో బెంగాల్లో కరువు కారణంగా అధికారిక అంచనాల ప్రకారం సంభవించిన ఆకలి చావుల సంఖ్య?
1) 5,60,100
2) 8,75,000
3) 9,15,750
4) 10,50,000
- View Answer
- సమాధానం: 4
27. కింది ఎవరి కాలంలో భారతదేశంలో రైల్వే వ్యవస్థను ప్రవేశపెట్టారు?
1) లార్డ్ కర్జన్
2) లార్డ్ డల్హౌసి
3) నానాభాయ్
4) విలియం బెంటిక్
- View Answer
- సమాధానం: 2
28. పంజాబ్ భూ బదిలీ చట్టం తీసుకొచ్చిన సంవత్సరం?
1) 1865
2) 1897
3) 1901
4) 1904
- View Answer
- సమాధానం: 3
29. బ్రిటిష్ కాలంలో రాయలసీమ ప్రాంతంలో వజ్రాల గనులు ఉన్న ప్రదేశం?
1) బళ్లారి
2) అనంతపురం
3) వజ్రకరూరు
4) బద్వేల్
- View Answer
- సమాధానం: 3
30. 1901-39 మధ్యకాలంలో వ్యవసాయ ఉత్పత్తి తక్కువగా ఉండటానికి కారణం?
ఎ) కమతాల పరిమాణం తక్కువగా ఉండటం
బి) సంప్రదాయ వ్యవసాయ పద్ధతులు
సి) భూస్వాముల బాధ్యతారాహిత్యం
డి) రైతుల ఆర్థిక స్థితి క్షీణించడం
1) ఎ, డి
2) బి, డి
3) ఎ, బి, సి, డి
4) డి మాత్రమే
- View Answer
- సమాధానం: 3
31. కింది ఎవరి కాలంలో నిష్క అనే నాణెం అమల్లో ఉండేది?
1) కాకతీయులు
2) రెడ్డిరాజులు
3) విజయనగర రాజులు
4) మొగలులు
- View Answer
- సమాధానం: 1
32. భారతదేశ సమస్యల పరిష్కారానికి స్వరాజ్యం ఒక్కటే శరణ్యమని 1905లో కింది ఏ కాంగ్రెస్ సమావేశంలో నౌరోజీ వ్యాఖ్యానించారు?
1) పుణె
2) బెనారస్
3) గుంటూరు
4) రాజమండ్రి
- View Answer
- సమాధానం: 2
33. బ్రిటిష్ కాలంలో జరిగిన సంపద తరలింపు కారణంగా ప్రపంచంలోనే సంపన్న దేశం అత్యంత పేద దేశంగా మారిందని ‘భారతదేశ ఆర్థిక చరిత్ర’ అనే గ్రంథంలో పేర్కొన్నవారు?
1) ఆర్.సి.దత్
2) నౌరోజీ
3) వి.కె.ఆర్.వి.రావ్
4) జవహర్లాల్ నెహ్రూ
- View Answer
- సమాధానం: 1
34. పరిశ్రమల అభివృద్ధి కోసం 1916లో ఏర్పాటైన కమిషన్?
1) రాయల్ కమిషన్
2) హాలెండ్ కమిషన్
3) ఆక్లాండ్ కమిషన్
4) పైవేవీ కాదు
- View Answer
- సమాధానం: 2
35. 1859లో మొదటి పాసింజర్ రైలును ఉత్తర భారతదేశంలోని కింది ఏ ప్రాంతాల మధ్య ప్రారంభించారు?
1) అలహాబాద్ -కాన్పూర్
2) లక్నో - కాన్పూర్
3) హౌరా- కాన్పూర్
4) భోపాల్-లక్నో
- View Answer
- సమాధానం: 1
36. బ్రిటిష్ కాలంలో ఆధునిక పరిశ్రమలను కింది ఏ ప్రాంతంలో స్థాపించారు?
ఎ) కోల్‌కతా
బి) అహ్మదాబాద్
సి) చెన్నై
డి) బెంగళూరు
1) ఎ, బి
2) సి, డి
3) ఎ, బి, సి
4) డి మాత్రమే
- View Answer
- సమాధానం: 3
37. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసిన సంవత్సరం?
1) 1956
2) 1964
3) 1977
4) 1980
- View Answer
- సమాధానం: 1
38. నాలుగో పంచవర్ష ప్రణాళిక రూపకర్త?
1) మహలనోబిస్
2) ధర్
3) డి.ఆర్.గాడ్గిల్
4) ఇందిరాగాంధీ
- View Answer
- సమాధానం: 3
39. కింది ఏ కమిటీ సూచన మేరకు 1969లో లీడ్ బ్యాంక్ స్కీంను ప్రారంభించారు?
1) కుమారప్ప
2) నారిమన్
3) స్వామినాథన్
4) రంగరాజన్
- View Answer
- సమాధానం: 2
40. వ్యవసాయాధార పరిశ్రమలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం?
1) బీహార్
2) తెలంగాణ
3) ఒడిశా
4) ఉత్తరప్రదేశ్
- View Answer
- సమాధానం: 4
41. 1829-1861 మధ్యకాలంలో హోమ్ చార్జీల రూపంలో భారతదేశం నుంచి బ్రిటన్‌కు ఎంత మొత్తం తరలి వెళ్లిందని నౌరోజీ పేర్కొన్నారు?
1) 9 కోట్ల స్టెర్లిన్లు
2) 10 కోట్ల స్టెర్లిన్లు
3) 11 కోట్ల స్టెర్లిన్లు
4) 11.5 కోట్ల స్టెర్లిన్లు
- View Answer
- సమాధానం: 2
42. వ్యవసాయ ధరల కమిషన్‌ను ఏర్పాటు చేసిన సంవత్సరం?
1) 1961
2) 1963
3) 1965
4) 1969
- View Answer
- సమాధానం: 3
43. మానవ వనరుల అభివృద్ధి ఏ ప్రణాళిక లక్ష్యం?
1) 7వ ప్రణాళిక
2) 8వ ప్రణాళిక
3) 9వ ప్రణాళిక
4) 11వ ప్రణాళిక
- View Answer
- సమాధానం: 2
44. పదో ప్రణాళిక కాలంలో అప్పటి ప్రధాని వాజ్‌పేయి కింది ఏ పథకాన్ని ప్రవేశపెట్టారు?
1) పనికి ఆహార పథకం
2) భారత్ నిర్మాణ్
3) రాజీవ్ ఆవాస్ యోజన
4) షట్సూత్ర
- View Answer
- సమాధానం: 4
45. 12వ ప్రణాళికలో వనరుల కేటాయింపులో ఏ రంగానికి ప్రాధాన్యత దక్కింది?
1) శక్తి
2) సాంఘిక సేవలు
3) రవాణా
4) గ్రామీణాభివృద్ధి
- View Answer
- సమాధానం: 2
46. ఇండియా విజన్-2020లో పొందుపర్చిన అంశాలకు సంబంధించి సరికానిది?
1) 2020 నాటికి ఆయుః ప్రమాణం 69 ఏళ్లు
2) 2020 నాటికి వ్యసాయ రంగం కల్పించే ఉపాధి 40 శాతం
3) 2020 నాటికి జీడీపీలో సేవారంగం వాటా 70 శాతం
4) 2020 నాటికి జీడీపీలో పారిశ్రామిక రంగం వాటా 34 శాతం
- View Answer
- సమాధానం: 3
47. నీతి ఆయోగ్‌కు సంబంధించి సరైన అంశం?
ఎ) భారతదేశ అభివృద్ధి అజెండాను రూపాంతరం చేయడం అనే నినాదంతో ఏర్పాటైంది
బి) ప్రణాళికల ద్వారా సాధించిన ప్రగతికి భిన్నంగా నీతి ఆయోగ్ పనిచేస్తుంది
సి) భారత ప్రజల మనసు తెలుసుకొని వారి అవసరాలు తీర్చే విధంగా పని చేస్తుంది
డి) దేశం అభివృద్ధి పథంలో పయనించడానికి ఉన్న వాతావరణాన్ని గమనించి, అందుకు అనుగుణంగా కృషి చేయాలనే భావనతో ఏర్పాటైంది
1) ఎ, బి
2) బి, సి
3) ఎ, బి, డి
4) ఎ, బి, సి, డి
- View Answer
- సమాధానం: 4
48. ఎం.ఆర్.టి.పి. చట్టం తీరుతెన్నులను అధ్యయనం చేయడానికి ఏర్పాటు చేసిన కమిటీ అధ్యక్షులు?
1) సచార్
2) నారిమన్
3) లక్డావాలా
4) మన్మోహన్ సింగ్
- View Answer
- సమాధానం: 1
49. ప్రసూతి, శిశు మరణాలను తగ్గించడానికి ఉద్దేశించిన పథకం?
1) అన్నపూర్ణ
2) యశోద
3) ధనలక్ష్మి
4) స్వావలంబన్
- View Answer
- సమాధానం: 2
50. నూతనంగా ఎదురయ్యే పరిస్థితులను బట్టి ప్రణాళిక లక్ష్యాలను నిరంతరం మార్చడానికి అవకాశం కల్పించే ప్రణాళిక?
1) నిర్దేశాత్మక ప్రణాళిక
2) స్థిర ప్రణాళిక
3) పిగ్మీ ప్రణాళిక
4) నిరంతర ప్రణాళిక
51. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికలను ఎప్పటి నుంచి రూపొందించారు?
1) 1971
2) 1973
3) 1974
4) 1975
- View Answer
- సమాధానం: 2
52. వ్యవసాయ నష్టభయ నిధిని ఏర్పాటు చేయాలని సూచించిన కమిషన్?
1) ఎం.ఎస్.స్వామినాథన్ కమిషన్
2) జయతీ ఘోష్ కమిషన్
3) రాంచెన్నారెడ్డి కమిషన్
4) వైద్యనాథన్ కమిషన్
- View Answer
- సమాధానం: 1
53. వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన లక్ష్యం?
1) గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత గృహ నిర్మాణం
2) పట్టణ ప్రాంతాల్లోని మురికివాడల్లో నివసించే పేదవారికి ఉచిత గృహ నిర్మాణం
3) పట్టణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 2
54. వ్యవసాయ వ్యయాలు, ధరల కమిషన్‌కు చట్టబద్ధత కల్పించాలని సూచించిన కమిటీ?
1) వై.కె.అలఘ్
2) వై.వి.రెడ్డి
3) రంగరాజన్
4) నారిమన్
- View Answer
- సమాధానం: 1
55. పారిశ్రామిక విధాన తీర్మానం-1948 ద్వారా పరిశ్రమలను ఎన్ని కేటగిరీలుగా విభజించారు?
1) 4
2) 6
3) 7
4) 8
- View Answer
- సమాధానం: 1
56. మార్కెట్ నుంచి రూ.500 కోట్లకు పైగా పెట్టుబడులు సేకరించిన కంపెనీలు తమ వార్షిక లాభాల్లో 2 శాతాన్ని సామాజిక కార్యకలాపాలకు వెచ్చించాలని సూచించే చట్టం?
1) ఫెరా
2) ఫెమా
3) నూతన కాంపిటీషన్ చట్టం-2013
4) ఎం.ఆర్.టి.పి
- View Answer
- సమాధానం: 3
57. హరిత విప్లవాన్ని ధర్మనారాయణ్ ఏ విధంగా అభివర్ణించారు?
1) ఆహార ధాన్యాల పక్షపాతం
2) ప్రాంతీయ సమతౌల్య అభివృద్ధి సాధన
3) వాణిజ్య పంటల పక్షపాతం
4) ఆదాయ, సంపద పంపిణీలో అసమానతల తగ్గుదల
- View Answer
- సమాధానం: 3
58.ధరల స్థిరీకరణ నిధిని ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1) 2002, ఏప్రిల్
2) 2003, ఏప్రిల్
3) 2004, ఏప్రిల్
4) 2005, ఏప్రిల్
- View Answer
- సమాధానం: 2
59. 2011 లెక్కల ప్రకారం దేశంలో షెడ్యూల్డ్ కుల జనాభాలో 50 శాతానికి పైగా కింది ఏ ఏ రాష్ట్రాల్లో ఉన్నారు?
1) ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, గోవా
2) ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, బిహార్
3) ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బిహార్, తమిళనాడు
4) కేరళ, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, హిమాచల్‌ప్రదేశ్
- View Answer
- సమాధానం: 2
60. కింది వాటిలో చిన్న పరిశ్రమలకు రుణాలను అందించేందుకు 1987లో ఏర్పాటయింది?
1) నేషనల్ ఈక్విటీ ఫండ్
2) సిడ్బీ
3) కపార్ట
4) పైవేవీ కాదు
- View Answer
- సమాధానం: 1
61. పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లో, ఉద్యోగాల్లో పనిచేసే శ్రామికులు కింది ఏ వర్గంలోకి వస్తారు?
1) ఆరంజ్ కాలర్
2) ఎల్లో కాలర్
3) గ్రీన్ కాలర్
4) పింక్ కాలర్
- View Answer
- సమాధానం: 3
62. ఎక్కువ తలసరి ఆదాయానికి, వ్యవసాయ రంగంలో పనిచేసే శ్రామికుల శాతానికి మధ్య విలోమానుపాత సంబంధం ఉంటుందని పేర్కొన్నవారు?
1) కోలిన్ క్లార్క
2) రాబిన్సన్
3) అమర్త్యసేన్
4) ఎ.జి.బి.ఫిషర్
- View Answer
- సమాధానం: 4
63. కింది వాటిలో దేని కారణంగా ముంబై, అహ్మదాబాద్, ఢిల్లీ, కాన్పూర్, కోల్‌కతా, బెంగళూరు అధిక పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి?
1) సామర్థ్య కొలమానం
2) భౌగోళికంగా అనుకూల ప్రాంతం
3) అధిక పట్టణ జనాభా
4) అధిక తలసరి ఆదాయం
- View Answer
- సమాధానం: 1
64. పర్యావరణ సమతౌల్యం గురించి మొదటిసారిగా ప్రస్తావించిన పారిశ్రామిక తీర్మానం?
1) 1948
2) 1956
3) 1977
4) 1980
- View Answer
- సమాధానం: 4
65. ప్రపంచంలో ఎక్కువ మంది శ్రామికులు ఉన్న దేశం?
1) ఇండియా
2) చైనా
3) బ్రెజిల్
4) దక్షిణాఫ్రికా
- View Answer
- సమాధానం: 2
ఎ) పారిశ్రామిక సంబంధాలు
బి) పనిచేసే స్థలంలో ఆరోగ్యం, భద్రత
సి) ఉపాధి ప్రమాణాలు
డి) కనీస వేతనాలు
1) ఎ, బి
2) సి, డి
3) ఎ, బి, సి
4) ఎ, బి, సి, డి
- View Answer
- సమాధానం: 4
67. శ్రామిక అంశాలకు సంబంధించి మొదటి సంస్థగా దేన్ని పేర్కొనవచ్చు?
1 ) యూఎన్‌సీటీఏడీ
2) అంతర్జాతీయ శ్రామిక సంస్థ
3) ప్రపంచ వాణజ్య సంస్థ
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 2
68. భారతదేశంలో శ్రామికులు, ఉపాధికి సంబంధించిన చట్టాన్ని కింది ఏ కేటగిరీ చట్టం నుంచి తెలుసుకోవచ్చు?
1) పారిశ్రామిక చట్టం
2) కనీస వేతనాల చట్టం
3) గనుల చట్టం
4) బాలకార్మికుల చట్టం
- View Answer
- సమాధానం: 1
69. అసంఘటిత రంగ శ్రామికుల సాంఘిక భద్రతా చట్టాన్ని తీసుకొచ్చిన సంవత్సరం?
1) 2006
2) 2007
3) 2008
4) 2009
- View Answer
- సమాధానం: 3
70.ఇండియన్ మర్చంట్ షిప్పింగ్ చట్టాన్ని తీసుకొచ్చిన సంవత్సరం?
1) 1829
2) 1859
3) 1870
4) 1875
- View Answer
- సమాధానం: 2
71. ఆర్థికాభివృద్ధి నేపథ్యంలో లభ్యమయ్యే వనరులను వినియోగించుకోవడం ద్వారా ఉత్పత్తిని గరిష్టం చేసే లక్ష్యంతో ఉపాధి అవకాశాలు పెంచేందుకు ప్రాధాన్యత ఇచ్చిన ప్రణాళిక?
1) 1వ ప్రణాళిక
2) 2వ ప్రణాళిక
3) 3వ ప్రణాళిక
4) 4వ ప్రణాళిక
- View Answer
- సమాధానం: 2
72.నేషనల్ ప్రాజెక్ట్ ఆన్ ఆర్గానిక్ ఫార్మింగ్‌ను ప్రవేశపెట్టిన సంవత్సరం?
1) 2000, అక్టోబర్
2) 2001, అక్టోబర్
3) 2003, అక్టోబర్
4) 2004, అక్టోబర్
- View Answer
- సమాధానం: 4
73. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి గ్రాంట్లను పెంచాలని, ఐదేళ్లపాటు పన్ను మినహాయింపు, రవాణా వ్యయంపై సబ్సిడీ ఇవ్వాలని సిఫార్సు చేసింది?
1) పాండే కమిషన్
2) వాంఛూ కమిషన్
3) పి.సి.నాయక్ కమిటీ
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 2
74. వెనుకబడిన ప్రాంతాలకు బదిలీ చేసే కేంద్ర నిధులు.. కింది ఏ పథకాల అమలుకు కేటాయించాలని 11వ ప్రణాళికలో నిర్ణయించారు?
ఎ) సర్వశిక్షా అభియాన్
బి) ఇందిరా ఆవాస్ యోజన
సి) జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్
డి) ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన
1) ఎ, బి
2) బి, సి
3) సి, డి
4) ఎ, బి, సి, డి
- View Answer
- సమాధానం: 4
75.ప్రాంతీయ అసమానతలను తగ్గించేందుకు గ్రామస్థాయి నుంచి ప్రాంతీయ ప్రణాళికలను అమలు చేయాలని పేర్కొన్న వ్యక్తి?
1) చక్రవర్తి
2) పంత్
3) గాడ్గిల్
4) కె.ఎన్.రాజ్
- View Answer
- సమాధానం: 2
76. కింది వాటిలో ప్రాంతీయ అసమానతలకు దారి తీసే అంశం?
ఎ) నీటిపారుదల లభ్యతలో తేడాలు
బి) ప్రభుత్వ విధానం
సి) అవస్థాపనా సౌకర్యాల లభ్యతలో తేడాలు
డి) కొన్ని ప్రాంతాలు ఇతర ప్రాంతాలతో సంఘటితమై ఉండకపోవడం
1) ఎ, డి
2) బి, సి
3) డి మాత్రమే
4) ఎ, బి, సి, డి
- View Answer
- సమాధానం: 4