కరెంట్ అఫైర్స్ గైడెన్స్ వీడియో లెక్చర్
Sakshi Education
పోటీపరీక్షల్లో కరెంట్ అఫైర్స్ ప్రాధాన్యత రోజురోజుకు పెరుగుతోంది. ఏ పరీక్షలోనైనా ఈ విభాగం నుంచి కనీసం 10 ప్రశ్నలు తక్కువ కాకుండా అడుగుతున్నారు. కొన్నిట్లో ఏకంగా ఒక సెక్షన్ వీటికే కేటాయిస్తున్నారు.
ప్రశ్నల సరళి కూడా అభ్యర్థుల విషయ అవగాహనను పరీక్షించేదిగా ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు ప్రిపరేషన్ పంథా మార్చాలి. సమకాలీనంగా జరుగుతున్న అంశాల్ని క్షుణ్నంగా చదవాలి. ఒక అంశానికి చెందిన గత చరిత్ర, వర్తమాన, భవిష్యత్ విషయాలు అధ్యయనం చేయాలి. అప్పుడే ప్రశ్న ఏ కోణంలో అడిగినా సమాధానం గుర్తించగలరు. ఈ తరుణంలో నిపుణులతో రూపొందించిన కరెంట్ అఫైర్స్ వీడియో లెక్చర్స్ మీకందిస్తున్నాం.