Skip to main content

Telangana Government Jobs: ఈ శాఖ‌లోని 1,433 ఉద్యోగల భ‌ర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఇంకా..

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ మున్సిపల్, పంచాయతీ రాజ్ రూరల్ డెవలప్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌లో ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.
telangana government jobs 2022
Telangana Government Jobs 2022

ఈ రెండు శాఖల్లోని 1,433 వివిధ క్యాడర్ పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఆర్థిక శాఖ జూన్ 7వ తేదీన(మంగళవారం) ఉత్తర్వులు జారీ చేసింది.

టీఎస్‌పీఎస్సీ ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

ఖాళీల వివ‌రాలు..
పురపాలకశాఖ విభాగాధిపతి కార్యాలయంలో 196 పోస్టులు, పబ్లిక్‌ హెల్త్‌లో236, చీఫ్‌ ఇంజనీర్‌ రూరల్‌ వాటర్‌ సప్లైలో 420 పోస్టులు, 350 ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ పంచాయతీ రాజ్‌ జనరల్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. త్వరలో ఈ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి.

TSPSC తెలంగాణ చరిత్ర ఆన్‌లైన్ పరీక్షలు; 19 టాపిక్స్ నుండి 1200+ ప్రశ్నలు

35220 పోస్టుల భర్తీకి..
ఇప్పటి వరకు 35220 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. ఇంకా మిగిలిన ఆయా శాఖాల్లోని ఖాళీల భర్తీకి ఉత్తర్వులు జారీ చేసేందుకు ఆర్థిక శాఖ కరసత్తు చేస్తోంది. 

Groups Books: గ్రూప్-1&2కు కచ్చితంగా చదవాల్సిన పుస్తకాలు.. వీటి జోలికి అసలు వెళ్లోద్దు..!

91,142 ఉద్యోగాలు ఉండ‌గా.. వీటిలో..
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నియామ‌క ఖాళీలు 91,142 ఉండ‌గా, ఇందులో 11,103 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల‌ను క్ర‌మ‌బద్దీక‌ర‌ణ చేయ‌గా, మిగిలిన 80,039 ఉద్యోగాల భ‌ర్తీ చేస్తామని శాసన సభ వేదికగా  సీఎం కేసీఆర్  ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గ్రూప్-1 పోస్టులు 503, పోలీసు, ట్రాన్స్‌పోర్టు,  ఫారెస్ట్, ఎక్సైజ్, బ్రెవరేజెస్ కార్పొరేషన్ వంటి వివిధ శాఖల్లో 33,787 పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది.

గ్రూప్స్‌ ప‌రీక్ష‌ల్లో నెగ్గాలంటే..ఇవి త‌ప్ప‌క చ‌ద‌వాల్సిందే..

ఈ డిపార్ట్‌మెంట్‌లోని 10,028 ఉద్యోగాలను..
మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో 12,775  ఉద్యోగాలను విడతలవారీగా భర్తీ చేయాలని, అందులో 10,028 ఉద్యోగాలను మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేయాలని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఆదేశించిన విషయం తెలిసిందే.  ఇందులో తొలి విడతగా 1326 ఎంబీబీఎస్ అర్హత కలిగిన ఉద్యోగాలకు నోటిఫికేష్ ఇవ్వాలని ఆదేశించారు. ఇప్పటికే  గ్రూప్ వన్, పోలీసు నియామకాలకు నోటిఫికేషన్లు ఇవ్వడం తెలిసిందే. తాజాగా  జూన్ 7వ తేదీన(మంగళవారం) మున్సిపల్, పంచాయతీ రాజ్ రూరల్ డెవలప్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌లోని మరో 1433 ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ  ఉత్తర్వులు జారీ చేసింది.

Telangana: భారీగా ప్ర‌భుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు.. ఇక్క‌డి నుంచి చదవాల్సిందే..

 

టీఎస్‌పీఎస్సీ గ్రూప్స్ ఉద్యోగాలు..

➤ గ్రూప్‌-1 పోస్టులు:  503

 గ్రూప్‌-2 పోస్టులు : 582

➤ గ్రూప్‌-3 పోస్టులు: 1,373

గ్రూప్‌-4 పోస్టులు : 9,168

తెలంగాణలో భర్తీ చేయనున్న పోలీసు ఉద్యోగాలు ఇవే..
కానిస్టేబుల్‌ పోస్టుల వివరాలు ఇలా..
➤ కానిస్టేబుల్‌(సివిల్‌): 4965
➤ కానిస్టేబుల్‌(ఏఆర్‌): 4423
➤ కానిస్టేబుల్‌(ఎస్‌ఏఆర్‌సీపీఎల్‌)(పురుషులు): 100
➤ కానిస్టేబుల్‌(టీఎస్‌ఎస్పీ)(పురుషులు): 5010
➤ కానిస్టేబుల్‌ (స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌): 390
➤ ఫైర్‌మన్‌ (డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ ఫైర్‌ సర్వీసెస్‌): 610
➤ వార్డర్‌(పురుషులు)(జైళ్లు): 136
➤ వార్డర్‌(మహిళలు)(జైళ్లు): 10
➤ కానిస్టేబుల్‌(ఐటీ అండ్‌ కమ్యూనికేషన్స్‌): 262
➤ కానిస్టేబుల్‌(మెకానిక్స్‌)(పురుషులు): 21
➤ కానిస్టేబుల్‌(డ్రైవర్స్‌)(పురుషులు): 100

మొత్తం కానిస్టేబుల్‌ పోస్టులు: 16,027 

తెలంగాణ పోలీసు ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి 

ఎస్సై పోస్టుల వివరాలు ఇవే..

TS SI Posts


☛ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(సివిల్‌): 414
☛ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(ఏఆర్‌): 66
☛ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(ఎస్‌ఏఆర్‌ సీపీఎల్‌)(పురుషులు): 5
☛ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(టీఎస్‌ఎస్పీ)(పురుషులు): 23
☛ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌)(పురుషులు): 12
☛ స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్‌(డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ ఫైర్‌ సర్వీసెస్‌): 26
☛ డిప్యూటీ జైలర్‌(పురుషులు): 8
☛ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(ఐటీ అండ్‌ కమ్యూనికేషన్స్‌): 22
☛ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(పోలీస్‌ ట్రాన్స్‌పోర్ట్‌)(పురుషులు): 3
☛ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(ఫింగర్‌ ప్రింట్‌ బ్యూరో): 8
మొత్తం ఎస్సై పోస్టులు: 587

Police Jobs: తెలంగాణ పోలీసు ఉద్యోగాలకు సిలబస్‌ ఇదే.. ఇలా చదివితే..

Published date : 07 Jun 2022 03:11PM

Photo Stories