సిలబస్‌ను విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయాలి..
Sakshi Education
అభ్యర్థులు అనుసరించాల్సిన ముఖ్యమైన వ్యూహం.. ఒకే విధమైన సిలబస్ ఉన్న రెండు పేపర్లను ఒకే సమయంలో పూర్తి చేసే విధంగా ప్లాన్ చేసుకోవడం. ముఖ్యంగా గ్రూప్-1 ఆరో పేపర్, రెండో పేపర్ (తెలంగాణ చరిత్ర)లో వివిధ అంశాలు సరిపోలి ఉన్నాయి. ఈవిధంగా సిలబస్‌ను, అందులోని అంశాలను తులనాత్మకంగా, విశ్లేషణాత్మకంగా అధ్యయనంచేస్తే సంపూర్ణ అవగాహన వస్తుంది. తద్వారా విజయావకాశాలు మెరుగవుతాయి.
గ్రూప్-1 స్థాయి పరీక్షల్లో ఒక అంశాన్ని నేరుగా ప్రశ్న-సమాధానం విధానంలో కాకుండా తులనాత్మకంగా, విశ్లేషణాత్మక దృక్పథంతో అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు ఇటీవల ప్రారంభించిన నీతి ఆయోగ్‌ను పరిగణనలోకి తీసుకుంటే.. దాదాపు ఆరున్నర దశాబ్దాలుగా అమలవుతున్న ప్లానింగ్ కమిషన్ స్థానంలో నీతి ఆయోగ్‌ను ప్రవేశపెట్టారు. అభివృద్ధి అనేది కింది స్థాయి నుంచి మొదలై పై స్థాయికి చేరాలనే ఉద్దేశంతో దీన్ని ప్రారంభించారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్లానింగ్ కమిషన్‌కు నీతి ఆయోగ్ సరైన ప్రత్యామ్నాయమా? కాదా? నీతి ఆయోగ్ ద్వారా సమాజంలో మరింత సమ్మిళిత వృద్ధి సాధ్యమవుతుందా? ఈ సమ్మిళిత వృద్ధి ద్వారా నిరుద్యోగం, పేదరికం లాంటివాటిని తగ్గించగలమా?.. ఇలా వివిధ కోణాల్లో విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయాలి. అదేవిధంగా ప్రణాళికా యుగంలో ఆయా ప్లానింగ్ కమిషన్లు చేసిన సిఫార్సులు, వైఫల్యాలకు సంబంధించిన కారణాలపై పూర్తి స్థాయిలో అవగాహన ఏర్పరచుకోవాలి. ఇటీవల బాగా ప్రాచుర్యం పొందిన అన్ని అంశాలను ఇదే రీతిలో లోతుగా అధ్యయనం చేయాలి.
తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ప్రవేశపెట్టిన టీఎస్-ఐపాస్, మిషన్ కాకతీయ లాంటి కార్యక్రమాల గురించి అధ్యయనం చేసేటప్పుడు వీటి ద్వారా భవిష్యత్తులో నమోదయ్యే అభివృద్ధి, లక్షిత వర్గాలు తదితరాలపై అవగాహన పెంచుకోవాలి.
సన్నద్ధతలో భాగంగా అభ్యర్థులు వర్తమాన అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. తద్వారా జనరల్ ఎస్సేతోపాటు మెయిన్స్‌లోని పాలిటీ, గవర్నెన్స్, ఎకానమీ, ఎన్విరాన్‌మెంట్ తదితర విభాగాల్లోని కొన్ని సెక్షన్లకు సంసిద్ధత లభిస్తుంది.
ఇటీవల కేంద్ర, రాష్ట్ర స్థాయిలో ఏర్పాటైన కమిటీలు, వాటి సిఫార్సులు, అవి సమర్థంగా అమలవడానికి తీసుకుంటున్న చర్యల గురించి తెలుసుకోవాలి. తెలంగాణలో ఉద్యమాల గురించి చదివేటప్పుడు ప్రతి ఉద్యమం వెనుక ఉన్న ప్రత్యేక కారణాలను గుర్తించి చదవాలి. గత ప్రశ్నపత్రాలను పరిశీలించడం లాభిస్తుంది. ఎథిక్స్, ఇంటెగ్రిటీ కోసం సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ప్రీవియస్ పేపర్లను ప్రాక్టీస్ చేయడం, కేస్ స్టడీలను విశ్లేషించడం ప్రయోజనకరం. వీటికి సంబంధించి చరిత్రలో ముఖ్యమైన వ్యక్తుల విధానాలు/సిద్ధాంతాలు తెలుసుకోవాలి.

Published date : 21 Sep 2015 11:51AM