Jobs: బ్రేకింగ్ న్యూస్: ఉద్యోగాల భర్తీపై సెప్టెంబర్ 16న ప్రకటన!
ఏయే శాఖల్లో, ఎన్ని పోస్టుల భర్తీ, వాటికి సం బంధించిన నోటిఫికేషన్ల జారీ, ఇతర అంశా లపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన సెప్టెంబర్ 16న మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్ లో కేబినెట్ భేటీ జరగనుంది. అందులో ఉద్యోగాల భర్తీతోపాటు పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకోనున్నట్టు అధికారవర్గాలు చెప్తున్నాయి.
65 వేల పోస్టులతో..
రాష్ట్రంలో సుమారు 50 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపడతామని సీఎం కేసీఆర్ 2020 డిసెంబర్ 13న ప్రకటించిన విషయం తెలిసిందే. అర్హులైన ప్రభుత్వ ఉద్యోగులందరికీ పదోన్నతులు కలి్పంచాలని, తద్వారా ఏర్పడే కొత్త ఖాళీలను సైతం గుర్తించి భర్తీ చేయాలని కూడా నిర్ణయించారు. అయితే.. ఉద్యోగుల పదోన్నతులు, స్థానికతపై రాష్ట్రపతి ఉత్తర్వులు, జిల్లా, జోనల్, మల్టీ జోనల్ కేడర్లుగా పోస్టుల విభజన, ఖాళీల గుర్తింపు ప్రక్రియలు సుదీర్ఘంగా సాగాయి. ఆర్థిక శాఖ ఇటీవలే ఈ అంశాలను కొలిక్కి తెచి్చంది. 65వేలకుపైగా ఖాళీ పోస్టులను గుర్తించింది. ఈ ప్రతిపాదనలపై మంత్రివర్గ భేటీలో చర్చించి ఆమోద ముద్ర వేసే అవకాశం ఉందని ఉన్నతాధికారవర్గాలు తెలిపాయి. 50 వేల నుంచి 65వేల పోస్టుల భర్తీకి ఒకేసారి నోటిఫికేషన్లు జారీ దిశగా నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొన్నాయి. దీనితోపాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, ఆదాయ అవసరాలు, వనరుల సమీకరణ, దళితబంధు పథకానికి చట్టబద్ధత తదితర అంశాలపైనా కేబినెట్ చర్చించనున్నట్టు వెల్లడించాయి. వనరుల సమీకరణలో భాగంగా మైనింగ్ రంగంలో సంస్కరణల అమలు, భూముల వేలానికి సంబంధించిన పలు ప్రతిపాదనలపైనా నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొన్నాయి.