ఫిబ్రవరి 16న టీఎస్‌పీఎస్సీ కంప్యూటర్ నైపుణ్య పరీక్ష
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ప్రాథమికంగా ఎంపికై నాలుగో విడతలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 16న ‘ఆఫీస్ ఆటోమేషన్, కంప్యూటర్ సంబంధ సాఫ్ట్‌వేర్’ నైపుణ్య పరీక్ష ఉంటుందని టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి ఓ ప్రకటనలో తెలిపారు.
బేవరేజెస్ కార్పొరేషన్‌లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎంపికై నాలుగు, ఐదో విడతల్లో సర్టిఫికెట్ల పరిశీలిన పూర్తి చేసుకున్న అభ్యర్థులకూ ఇది వర్తిస్తుందన్నారు. లా అండ్ ఫైనాన్స్ శాఖలోని అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (కోడ్ నంబరు 12, 13) ఉద్యోగాలకు గ్రూప్-2 ద్వారా ఎంపికైన వారూ ఈ పరీక్షకు హాజరు కావాలన్నారు. నైపుణ్య పరీక్ష హాల్ టికెట్లను ఈ నెల 12 సాయంత్రం 5 గంటల నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి తెలిపారు. వీరికి అకౌంట్స్ నైపుణ్య పరీక్షను ఈనెల 17వ తేదీన నిర్వహిస్తామని చెప్పారు.
Published date : 10 Feb 2020 03:45PM