మార్చి 4 నుంచి మూడో విడత సర్టిఫికెట్ వెరిఫికేషన్
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: గ్రూప్-4లో జూనియర్ అసిస్టెంట్, టైపిస్టు, జూనియర్ స్టెనో, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్టు పోస్టుల భర్తీకి సంబంధించి అర్హులైన అభ్యర్థులకు వచ్చే నెల 4 నుంచి 7 వరకు మూడో విడత సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది.
వెరిఫికేషన్ హైదరాబాద్‌లోని టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు ఉంటుందని పేర్కొంది. అలాగే సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరైన అభ్యర్థులకు మార్చి 8న కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్టు నిర్వహిస్తామని తెలిపింది. అభ్యర్థులు పోస్టులు, జోన్ల ప్రాధాన్యతలను బట్టి వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలని సూచించింది. వెబ్ ఆప్షన్ల ఆధారంగానే తుది ఎంపిక ఉంటుందని పేర్కొంది. పూర్తి వివరాలకు www.tspsc.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించింది.
Published date : 29 Feb 2020 02:15PM