Skip to main content

TSPSC: గ్రూప్‌–1 దరఖాస్తుల గడువు పొడిగింపు.. చివ‌రి తేదీ ఇదే..

గ్రూప్‌–1 దరఖాస్తుల గడువును జూన్‌ 4వ తేదీ వరకు పొడిగించారు.
tspsc
గ్రూప్‌–1 దరఖాస్తుల గడువు పొడిగింపు.. చివ‌రి తేదీ ఇదే..

ఫీజు చెల్లింపు సంబంధిత సమస్యల వల్ల దరఖాస్తు చేసుకోలేకపోయిన పలువురు అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు గడువు పొడిగించినట్టు టీఎస్‌పీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది. మే 31 నాటికి 3,48,095 దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించింది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 503 గ్రూప్‌–1 ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఏప్రిల్‌ 26న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇందులో భాగంగా మే 2వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరించిన టీఎస్‌పీఎస్సీ.. మే 31 అర్ధరాత్రి 11.59 గంటల వరకు దరఖాస్తుకు గడువును విధించింది. ఈక్రమంలో దరఖాస్తుల స్వీకరణ మొదలైన తొలి వారంలో ఆశించిన మేర స్పందన లేదు. ఓటీఆర్‌ సవరణ, స్థానికతకు సంబంధించి బోనఫైడ్‌ అప్‌లోడ్‌ తదితర అంశాల నేపథ్యంలో దరఖాస్తు ప్రక్రియ నెమ్మదిగా సాగింది. స్థానికత ధ్రువీకరణకు కీలకమైన బోనఫైడ్‌లు అందుబాటులో లేని పలువురు అభ్యర్థులు పాఠశాలల చుట్టూ తిరుగుతుండడం మరోవైపు పరీక్షకు సన్నద్ధం కావాలనే తాపత్రయంతో కొందరు అభ్యర్థులు ఆందోళన చెందారు. ఈక్రమంలో బోనఫైడ్‌ అప్‌లోడ్‌ నిబంధనకు బ్రేక్‌ ఇచ్చిన టీఎస్‌పీఎస్సీ.. చదువుకున్న వివరాలను సరిగ్గా ఎంట్రీ చేస్తే చాలని సూచించింది. దీంతో దరఖాస్తు నమోదు వేగం పుంజుకుంది. గత రెండ్రోజుల్లో ఏకంగా 60 వేల దరఖాస్తులు వచ్చినట్లు అంచనా. 

చదవండి: 

టీఎస్‌పీఎస్సీ ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

TSPSC& APPSC Groups: గ్రూప్స్‌లో గెలుపు బాట‌ కోసం.. ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణుల సూచ‌న‌లు- సలహాలు ..

Competitive Exam Preparation Tips: పోటీపరీక్షల్లో విజయానికి కరెంట్‌ అఫైర్స్‌

Published date : 01 Jun 2022 12:41PM

Photo Stories