ఆర్‌ఐఎంసీలో ప్రవేశాలకు నోటిఫికేషన్
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: డెహ్రాడూన్‌లోని రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీలో (ఆర్‌ఐఎంసీ) ప్రవేశాల కోసం నోటిఫికేషన్ జారీ అయింది.
ఆసక్తి ఉన్న వారు మార్చి 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని టీఎస్‌పీఎస్సీ తెలిపింది. దరఖాస్తు ఫారాన్ని ఆర్‌ఐఎంసీ నుంచి పొందవచ్చని, పూర్తి చేసిన దరఖాస్తులను తమకు అందజేయాలని పేర్కొంది. పోస్టు ద్వారా దరఖాస్తు ఫారాన్ని పొందవచ్చని, పూర్తి వివరాలు ఆర్‌ఐఎంసీ వెబ్‌సైట్‌లో ఉన్నాయని వివరించింది.
Published date : 24 Jan 2020 01:44PM