Tarun Joshi, SP : రోజుకు ఇన్ని గంటలు.. ఇలా చదివితే ఉద్యోగం ఖాయమే..
Sakshi Education
యువత పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే రోజుకు పది నుంచి పన్నెండు గంటలు కష్టపడి చదవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి సూచించారు.
వరంగల్ కమిషనరేట్ శిక్షణ కేంద్రంలో పోలీస్ ఉద్యోగాల కోసం కోచింగ్ శిక్షణ పూర్తిచేసుకున్న యువతకు ఏప్రిల్ 9వ తేదీన(శనివారం) హనుమకొండలోని అంబేడ్కర్ భవన్‌లో స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు.
TS Police Jobs: పోలీస్ ఉద్యోగాలకు ఉచిత కోచింగ్.. అర్హతలు ఇవే..
ప్రతి విద్యార్థికి రూ.2 వేల విలువైన స్టడీ మెటీరియల్..
ఈ సందర్భంగా తరుణ్ జోషి మాట్లాడుతూ కమిషనరేట్ పరిధిలో తొమ్మిది సెంటర్లలో శిక్షణ తరగతులు నిర్వహించినట్లు తెలిపారు. పీజేఆర్ కోచింగ్ సెంటర్‌కు చెందిన నిపుణులైన అధ్యాపకులతో కోచింగ్ ఇచ్చా మని, ప్రతి విద్యార్థికి రూ.2 వేల విలువైన స్టడీ మెటీరియల్ అందజేస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా యువత శిక్షణ కాలం అనుభవాలను అధికారులతో పంచుకున్నారు.
Published date : 10 Apr 2022 08:14PM