Skip to main content

Madhu Krishna Inspirational Story: నాన్న కోరిక నెరవేర్చిన విజయగాధ.. బీట్ ఆఫీసర్‌ నుంచి ఎస్‌ఐ వరకు ప్రయాణం!!

success story of fulfilling my father wish

కుటుంబ నేపథ్యం:
నా పేరు యనకి మధుకృష్ణ..  అమ్మ సరస్వతి గృహిణి, నాన్న ఉదయాద్రి కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నారు. తమ్ముడు మనోన్‌ చదువుకుంటున్నాడు. చెల్లి వివాహం పూర్తైంది.

విద్యాభ్యాసం:
 ఇంటర్ వరకు ఆర్మూర్‌లోనే చదివాను. అనంతరం బీటెక్‌ను హైదరాబాద్‌లో పూర్తి చేశాను.

లక్ష్య సాధనలో తొలి అడుగులు:
నాన్నకు ప్రభుత్వ ఉద్యోగం నా ద్వారా రావాలన్న కోరిక ఉంది. అదే నా కర్తవ్యంగా భావించి బీటెక్ తర్వాత వెంటనే ప్రిపరేషన్ ప్రారంభించాను. మొదట బీట్‌ ఆఫీసర్‌గా ఉద్యోగం వచ్చి, 2019 నుంచి 2023 వరకూ ఉద్యోగం చేస్తూనే ఎస్సై కోసం కృషి కొనసాగించాను. చివరికి లక్ష్యాన్ని చేరుకున్నాను.

చదవండి: SI Manimala Sucess Story: ఇద్దరు పిల్లల తల్లి.. ఈవెంట్స్‌ కోసం కష్టనష్టాలకోర్చి విజయం సాధించారు

సమాజం కోసం నా ఆకాంక్ష:
ప్రతి ఒక్కరూ లా అండ్‌ ఆర్డర్‌కు కట్టుబడి, బాధ్యతాయుతంగా ఉండాలి. సమాజంలో శాంతి, భద్రత నిలుపుకోవడమే మనందరి బాధ్యత.

నిరుద్యోగ యువతకు సలహా:
లక్ష్యం స్పష్టంగా ఉంటే దానివైపు అడుగులు వేయడం సులభం అవుతుంది. నమ్మకంగా, కృషితో ముందుకెళితే విజయాన్ని సాధించడం ఖాయం.
 

Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 08 May 2025 08:36AM

Photo Stories