Skip to main content

TS Police: పోలీసు అభ్యర్థులూ పార్ట్‌–2లో అలసత్వం వద్దు.. ఈవెంట్స్ కొట్టాలంటే.. ఇవి పాటించాల్సిందే..!

సాక్షి, హైదరాబాద్‌: పోలీసు ఉద్యోగాలకు సంబంధించి ప్రిలిమ్స్‌లో ఎంపికైన అభ్యర్థులు పార్ట్‌–2 దరఖాస్తు ప్రక్రియను త్వరితంగా పూర్తి చేయాలని తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామకాల బోర్డు చైర్మన్‌ వీవీ శ్రీనివాసరావు సూచించారు.
TS Police
తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామకాల బోర్డు చైర్మన్‌ వీవీ శ్రీనివాసరావు

నవంబర్‌ 10న రాత్రి 10 గంటలవరకు గడువు నిర్దేశించినప్పటికీ అభ్యర్థులు గడువు తేదీ కంటే ముందే ధ్రువపత్రాల అప్‌లోడ్‌ తదితరాలను పూర్తి చేసుకోవాలని, చివరి నిమిషంలో హడావిడి వద్దని పేర్కొన్నారు. గడువు తేదీని ఎట్టిపరిస్థితుల్లో పెంచబోమని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటివరకు 40 వేల దరఖాస్తులు ఆన్‌లైన్‌ పద్ధతిలో అందాయని, ఇందులో మహిళా అభ్యర్థులు 9 వేల మంది, పురుషులు 31 వేల మంది ఉన్నట్లు వెల్లడించారు. మరోవైపు ప్రిలిమినరీ పరీక్ష తుది ‘కీ’ని బోర్డు ఇప్పటికే విడుదల చేసిందని, బోర్డు నిబంధనలకు అనుగుణంగా ముందుగా ప్రాథమిక ‘కీ’విడుదల చేసిన తర్వాత అభ్యంతరాలను స్వీకరించి తుది ‘కీ’జారీ చేసిందన్నారు. బోర్డు ఇచ్చిన తుది ‘కీ’మాత్రమే బోర్డు పరిగణలోకి తీసుకుంటామని స్పష్టంచేశారు. జవాబు పత్రాల మూల్యాంకనం కూడా బోర్డు నిబంధనలకు అనుగుణంగా పూర్తి చేశామని శ్రీనివాసరావు చెప్పారు. కొందరు సామాజిక మాధ్యమాల్లో 22 ప్రశ్నలు తొలగించి అందుకు మార్కులు కలుపుతున్నారనే ప్రచారం చేస్తున్నారని అందులో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టంచేశారు. 

చదవండి: ఇవి ఫాలో అయితే.. పోలీసు ఉద్యోగం మీదే || Telangana Police Jobs 2022|| SI, Constable Jobs||Events

ఈవెంట్స్ కొట్టాలంటే.. ఇవి పాటించాల్సిందే..!

ఉమ్మడిగా ఒకేసారి ఈవెంట్స్ నిర్వహిస్తారు. కాబట్టి అభ్యర్థులు ఈవెంట్స్‌కు ప్రాధాన్యమివ్వాలి. దేహదారుఢ్య పరీక్షల్లో ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (పీఎంటీ), తర్వాత ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్ (పీఈటీ) నిర్వహిస్తారు. ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్లకు ఈవెంట్స్ ఒకేవిధంగా ఉంటాయి. పీఈటీ దశ దాటడం చాలా కీలకం. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులకు తుదిదశలో రాత పరీక్ష నిర్వహిస్తారు.

  • 800 మీటర్ల రన్నింగ్లో తప్పనిసరిగా అర్హత సాధించాలి.
  • సివిల్ ఎస్ఐ, స్టేషన్ ఫైర్ ఆఫీసర్, డిప్యూటీ జైలర్, సివిల్ కానిస్టేబుల్స్, ఫైర్మెన్, వార్డర్స్ పోస్టులకు మిగతా 4 (100 మీటర్ల రన్నింగ్, లాంగ్జంప్, షాట్పుట్, హైజంప్) ఈవెంట్స్లో.. రెండు ఈవెంట్స్లో అర్హత సాధిస్తే సరిపోతుంది.
  • టీఎస్ఎస్పీ, ఏఆర్, ఎస్ఏఆర్ సీపీఎల్ కేటగిరీ ఎస్ఐ, కానిస్టేబుల్స్ పోస్టులకు అన్ని ఈవెంట్స్లో అర్హత తప్పనిసరి. తుది జాబితా రూపకల్పనలో వీటికి వెయిటేజీ ఉంటుంది. ఈవెంట్స్ మెరిట్ ఆధారంగా మార్కులు కేటాయిస్తారు. ఈ పోస్టులకు ఫిజికల్ టెస్ట్లోని మెరిట్, రాత పరీక్షలోని మార్కులు.. రెండింటి ఆధారంగా ఎంపిక ఉంటుంది.
  • 100 మీటర్ల పరుగు తప్పనిసరి. మిగతా రెండు (లాంగ్జంప్, షాట్పుట్) ఈవెంట్లలో ఒకదాంట్లో అర్హత సాధించినా సరిపోతుంది.
  • ఏఆర్ పోస్టులకు ఒక్కో ఈవెంట్కు 25 మార్కులు చొప్పున మూడు ఈవెంట్స్కు 75 మార్కులు ఉండే అవకాశం ఉంది. ఏఆర్ పోస్టులకు అన్ని ఈవెంట్లలో తప్పనిసరిగా అర్హత సాధించాలి.
  • సివిల్ ఎస్ఐ, కానిస్టేబుల్స్ పోస్టులకు రాత పరీక్షలో మార్కుల అధారంగా ఎంపిక ఉంటుంది. ఏఆర్, టీఎస్ఎస్పీ, ఎస్ఏఆర్ సీపీఎల్ పోస్టులకు ఫిజికల్ టెస్ట్లోని మెరిట్, రాత పరీక్షలోని మార్కులు రెండింటి ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
  • ఈసారి సివిల్తోపాటు ఏఆర్, టీఎస్ఎస్పీ, ఎస్ఏఆర్ సీపీఎల్ పోస్టుల ఖాళీలు ఎక్కువగా ఉండటం వల్ల ఫిజికల్ ఈవెంట్స్లో మెరిట్ సాధించిన అభ్యర్థులు కొంత సులువుగానే ఉద్యోగం సొంతం చేసుకోవచ్చు.
Published date : 03 Nov 2022 12:56PM

Photo Stories