Skip to main content

‘పోలీస్‌ ఉద్యోగాలకు వయోపరిమితి పెంచాలి’

Age limit for police jobs should be raised
‘పోలీస్‌ ఉద్యోగాలకు వయోపరిమితి పెంచాలి’

పోలీస్‌ ఉద్యోగాల నోటిఫికేషన్ కు మూడు నుంచి ఐదేళ్ల వరకు వయో సడలింపు ఇవ్వాలని ఓయూ జేఏసీ అధ్యక్షుడు బైరు నాగరాజు మే 15న ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. నాలుగేళ్లుగా ఎలాంటి నోటిఫికేషన్ విడుదల కాలేదన్నారు. ఈ నేపథ్యంలో ఒకట్రెండు నెలల వ్యవధిలోనే సుమారు లక్ష మంది అభ్యర్థులు వయోపరి మితి కోల్పోయినట్లు ఆందోళన వ్యక్తంచేశారు. కరోనా కాలాన్ని పరిగణలోకి తీసుకుని నిరుద్యోగుల కోసం మరో మూడు లేదా ఐదేళ్ల వయోసడలింపు కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 

చదవండి: 

TS Police Jobs Events: ఈవెంట్స్ కొట్టాలంటే.. ఇవి పాటించాల్సిందే..!

TS Police Exams Best Preparation Tips: పక్కా వ్యూహంతో.. ఇలా చ‌దివితే పోలీస్ ఉద్యోగం మీదే..!

​​​​​​​TS Police Jobs: 16,614 పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌.. దరఖాస్తుకు వయోపరిమితి ఇదే..

Sakshi Education Mobile App
Published date : 16 May 2022 12:58PM

Photo Stories