స్వాతంత్య్రానంతరం మొదటి మూడు దశకాల్లో జరిగిన వృద్ధిని హిందూ వృద్ధి రేటుగా అభివర్ణించినవారు?
Sakshi Education
- 1931-32లో డాక్టర్ వి.కె.ఆర్.వి.రావు భారతదేశ తలసరి ఆదాయాన్ని ఎంతగా అంచనా వేశారు?
- రూ.65 - స్వాతంత్య్రానంతరం మొదటి మూడు దశకాల్లో జరిగిన వృద్ధిని హిందూ వృద్ధి రేటుగా అభివర్ణించినవారు?
- ప్రొఫెసర్ రాజ్‌కృష్ణ - జాతీయాదాయ లెక్కింపులో భాగంగా సేవారంగంలోని ఉప రంగాల భాగస్వామ్యాన్ని లెక్కించేందుకు వినియోగించే పద్ధతి?
- ఆదాయ మదింపు పద్ధతి - 2014-15లో పారిశ్రామిక రంగ స్థూల మూలధన కల్పనలో వృద్ధి?
-3.6% - 2015-16లో ముందస్తు అంచనాల ప్రకారం తయారీ రంగంలో వృద్ధి?
- 9.5% - 2015-16లో స్థిర ధరల వద్ద భారతదేశ తలసరి స్థూల దేశీయోత్పత్తి?
-రూ.88,472 - జాతీయాదాయ లెక్కింపులో డిఫ్లేటర్‌ను ఎందుకు వినియోగిస్తారు?
- ధరల ప్రభావాన్ని తొలగించేందుకు - మార్కెట్ ధరల వద్ద నికర జాతీయోత్పత్తిలో కలిసి ఉండేవి? - పరోక్ష పన్నులు, సబ్సిడీలు
- గ్రీన్ జి.ఎన్.పి. అంటే?
- జాతీయాదాయ గణనలో పర్యావరణ నష్టాన్ని పరిగణనలోకి తీసుకోవడం - ఆదాయ చక్రీయ ప్రవాహంలో తగ్గుదలకు కారణమయ్యేది?
- పొదుపు - నిజ జాతీయాదాయంగా పరిగణించే భావన?
- ఉత్పత్తి కారకాల దృష్ట్యా నికర జాతీయోత్పత్తి - జాతీయాదాయాన్ని లెక్కించేటప్పుడు ఏర్పడే సమస్యలు?
- ఒక వస్తువు విలువను రెండుసార్లు లెక్కించడం, లావాదేవీలు ద్రవ్య రూపంలో జరగకపోవడం - భారతదేశంలో పొదుపు రేటు తక్కువగా ఉండటానికి కారణం?
- తలసరి ఆదాయం తక్కువ - ఉత్పత్తి కారకాల దృష్ట్యా జీడీపీ, బేసిక్ ధరల వద్ద జీవీఏకు మధ్య ఉన్న తేడా?
-జీవీఏ బేసిక్ ధరలకు ఉత్పత్తి పన్నులను కలిపి, ఉత్పత్తి సబ్సిడీలను తీసివేయాలి - 2014-15లో జీడీపీలో స్థూల మూలధన కల్పన (పెట్టుబడి రేటు)?
-34.2% - ఆర్థిక పరిభాషలో శ్రామికుని ఉపాంత ఉత్పాదకత శక్తి సున్నా అయితే దాన్ని ఏ నిరుద్యోగంగా పిలుస్తారు?
- ప్రచ్ఛన్న నిరుద్యోగం - జాతీయ పనికి ఆహార పథకాన్ని 2004, నవంబర్ 14న అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఎక్కడ ప్రారంభించారు?
- రంగారెడ్డి జిల్లా ఆలూరు - ప్రధానమంత్రి రోజ్‌గార్ యోజన స్థానంలో 2008 నుంచి ఏ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు? - ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం
- సంపూర్ణ గ్రామీణ రోజ్‌గార్ యోజనలో విలీనమైన పథకాలు?
- జవహర్ గ్రామ్ సమృద్ధి యోజన, ఉపాధి హామీ పథకం - నిరుద్యోగ నిర్మూలనకు ప్రణాళిక సంఘం 11 అంశాల కార్యక్రమాన్ని ఎప్పుడు రూపొందించింది? - 1953
- పేదరిక అంచనాలో భాగంగా పేదరిక అంతరం, స్క్వేర్‌డ పేదరిక అంతరం, తలల లెక్కింపు సూచీని ఉపయోగించినవారు?
- గౌరవ్ దత్తా - రాగ్నర్ నర్‌క్స అభిప్రాయంలో ప్రచ్ఛన్న నిరుద్యోగితను అభివృద్ధికి సాధనంగా ఏ దేశాలు ఉపయోగించుకోవచ్చు?
- అభివృద్ధి చెందుతున్న దేశాలు - పేదరిక అంతరం అంటే?
- దారిద్య్ర రేఖ, సగటు పేదరిక రేఖ దిగువన ఉన్న జనాభా - భారతదేశంలో పేదరికాన్ని లెక్కించడంలో విశేష కృషి చేసినవారు?
- దండేకర్, రధ్ - భారతదేశంలో ఆదాయ అసమానతల పెరుగుదలకు కారణం?
- అభివృద్ధి ప్రక్రియలో భాగంగా వివిధ వర్గాల ప్రజల ఆదాయాల్లో తేడా, ప్రాంతీయ వృద్ధిలో తేడా, ఉపాధి కల్పన సరిపోయినంతగా లేకపోవడం, ఆస్తుల పంపిణీలో అధిక అసమానతలు - 2011-12లో పేదరిక అంచనాలో భాగంగా టెండూల్కర్ మెథడాలజీ ప్రకారం తలసరి వినియోగ వ్యయాన్ని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో రోజుకు ఎంతగా తీసుకున్నారు?
- గ్రామీణ ప్రాంతాల్లో రూ.27, పట్టణ ప్రాంతాల్లో రూ.33 - గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పేదరిక అంచనాకు రంగరాజన్ ప్యానల్ తలసరి వినియోగ వ్యయాన్ని రోజుకు ఎంతగా తీసుకుంది?
- గ్రామీణ ప్రాంతాల్లో రూ.32, పట్టణ ప్రాంతాల్లో రూ.47 - స్వల్ప వ్యవధిలో విస్తృత ప్రాంతంలో సామాజిక అభివృద్ధే లక్ష్యంగా 1953లో ప్రారంభించిన కార్యక్రమం?
- జాతీయ విస్తరణ సేవా కార్యక్రమం - ఆదాయ వాస్తవ పంపిణీని సూచించే రేఖ?
- లారెంజ్ వక్ర రేఖ - బ్రిటిష్ పాలనలో భారతదేశంలో జరిగిన ఆర్థిక దోపిడీని ఏ గ్రంథం ద్వారా తెలుసుకోవచ్చు?
- డ్రెయిన్ ఆఫ్ వెల్త్ - 2015-16లో వినియోగ ధరల సూచీ (ఉమ్మడి) సగటు?
- 4.9% - 2011లో దేశంలో మొత్తం గ్రామీణ కుటుంబాల సంఖ్య?
- 17.91 కోట్లు - ఉపాధి కల్పనకు ప్రత్యేక పథకాలు ఏ ప్రణాళిక నుంచి ప్రారంభమయ్యాయి?
- ఐదో పంచవర్ష ప్రణాళిక - పనిలో పాల్గొనే శ్రామిక శక్త్తి అంటే?
- శ్రామిక శక్తిలో భాగంగా ఉండి వాస్తవంగా ఉపాధి పొందే శ్రామిక శక్తి - National Rural Livelihood Missionను ప్రస్తుతం ఏమని పిలుస్తున్నారు?
- అజీవికా - పదకొండో ప్రణాళికలో 58 మిలియన్ల ఉపాధి అవకాశాలను ఎన్ని అధిక వృద్ధి రంగాల్లో కల్పించాలని నిర్ణయించారు?
- 21 - గున్నార్ మిర్డాల్ రాసిన గ్రంథం?
- ది చాలెంజ్ ఆఫ్ వరల్డ్ పావర్టీ - గ్రామీణాభివృద్ధికి ఆర్థిక సాంకేతిక సహాయాన్ని అందించేందుకు 1986లో న్యూఢిల్లీ కేంద్రంగా ఏర్పాటైంది?
- కపార్‌ట - వ్యవసాయం, వినియోగదారు వస్తు ఉత్పత్తి పరిశ్రమలకు ప్రాధాన్యమిచ్చిన ప్రణాళిక?
- ప్రజా ప్రణాళిక - వివిధ పెట్టుబడి మార్గాంతరాలకు ఆర్థిక వనరుల కేటాయింపునకు సంబంధించిన ప్రణాళిక?
- ఆర్థిక ప్రణాళిక - వికేంద్రీకృత ఆర్థిక వ్యవస్థకు ప్రాధాన్యమిచ్చిన ప్రణాళిక?
- గాంధేయ ప్రణాళిక - ఏ ప్రణాళికలో విదేశీ వ్యాపార చెల్లింపుల శేషంలో తీవ్ర లోటు ఏర్పడింది?
ఏడో పంచవర్ష ప్రణాళిక - ఎన్నో ప్రణాళిక నుంచి సూచనాత్మక ప్రణాళిక అమలు చేశారు?
- ఎనిమిదో ప్రణాళిక - కుటీర జ్యోతి పథకాన్ని ఎప్పుడు ప్రారంభిం చారు?
- 1988-89 - మహిళా సమృద్ధి యోజనను 2001 నుంచి ఏ పేరుతో పిలుస్తున్నారు?
-మహిళా స్వయంసిద్ధ యోజన - సాంఘిక న్యాయంతో కూడిన వృద్ధి - సమానత్వం ఏ ప్రణాళిక లక్ష్యం?
-తొమ్మిదో ప్రణాళిక - ఆహారం-పని-ఉత్పాదకతకు ప్రాధాన్యమిచ్చిన ప్రణాళిక?
- ఏడో ప్రణాళిక - గ్లోబల్ జెండర్ గ్యాప్ 2016లో భారతదేశ స్థానం?
- 87 - ఇటీవల రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా సర్వే ప్రకారం ఆయుఃప్రమాణం అధికంగా నమోదైన రాష్ర్టం ?
- జమ్మూకశ్మీర్ - Ease of Doing Business Index-2017లో భారత్ స్థానం?
- 130 - జాతీయ పెట్టుబడి నిధిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఎప్పుడు నిర్ణయించింది?
- 2005, జనవరి 27 - భారీ పరిశ్రమలకు తక్కువ ప్రాధాన్యమిస్తూ అవస్థాపనా సౌకర్యాలపై దృష్టి పెట్టడం ఏ ప్రణాళికలో ప్రారంభమైంది?
-ఎనిమిదో ప్రణాళిక - నెలవారీ తలసరి వినియోగాన్ని 1960- 61 ధరల వద్ద గ్రామీణ ప్రాంతాల్లో రూ.15, పట్టణ ప్రాంతాల్లో రూ.22.5గా తీసుకొని, 1956-57లో దేశంలో పేదరికాన్ని అంచనా వేసినవారు?
- ఎం.అహ్లూవాలియా - జాతీయ సామాజిక సహాయ కార్యక్రమంలో భాగమైన పథకాలు?
- జాతీయ వృద్ధాప్య పెన్షన్ పథకం, జాతీయ ప్రసూతి ప్రయోజన పథకం, జాతీయ కుటుంబ ప్రయోజన పథకం - 1973లో నిరుద్యోగంపై ఏర్పాటైన నిపుణుల కమిటీ అభిప్రాయంలో 1971లో దేశంలో నిరుద్యోగుల సంఖ్య?
- 18.7 మిలియన్లు - సింద్రీ ఎరువుల కర్మాగారం ఏ రాష్ర్టంలో ఉంది?
- జార్ఖండ్ - రెండో ప్రణాళికను ధైర్యంతో కూడుకున్న ప్రణాళికగా వర్ణించడానికి కారణం?
-భారీ పెట్టుబడులకు ప్రాధాన్యమివ్వడం - రష్యా సహకారంతో బొకారో ఇనుము-ఉక్కు కర్మాగారాన్ని ఎక్కడ స్థాపించారు?
- జార్ఖండ్ - వార్షిక ప్రణాళికల కాలంలో ఎప్పుడు రూపాయి మూల్యహీనీకరణ జరిగింది?
-1966, జూన్ - జిల్లా పారిశ్రామిక కేంద్రాలను ఎప్పుడు ప్రారంభించారు?
- 1978 - నిరంతర ప్రణాళికలతో ముడిపడి ఉన్న భారత ఆర్థికవేత్త?
- లక్డావాలా - పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన, సాంకేతిక స్వావలంబనకు ప్రాధాన్యమిచ్చిన ప్రణాళిక?
- ఆరో ప్రణాళిక - ఏ కమిటీ సిఫార్సులను అనుసరించి 1982లో నాబార్‌డను ఏర్పాటు చేశారు?
-శివరామన్ కమిటీ - ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర కేబినెట్‌ఎప్పుడు తీర్మానించింది?
- 1950, మార్చి 15 - నెహ్రూ ప్రోత్సాహంతో ఇండియన్ ఎకనమిక్ సర్వీస్ ఎప్పుడు ప్రారంభమైంది?
- 1961 - నీతి ఆయోగ్ మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది?
- 2015, ఫిబ్రవరి 8 - టాస్క్‌ఫోర్‌స ఆన్ అగ్రికల్చర్ డెవలప్‌మెంట్‌ను నీతి ఆయోగ్ ఎప్పుడు ఏర్పాటు చేసింది?
- 2015, మార్చి 16 - ఆమ్‌ఆద్మీ బీమా యోజన లక్ష్యం ?
- కుటుంబ పెద్ద లేదా కుటుంబంలో ఆదాయం సమకూర్చే సభ్యుడు ప్రమాదవశాత్తూ మరణించినా, వికలాంగుడైనా ఈ పథకం కింద కుటుంబానికి ప్రయోజనం కల్పించడం - జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (2006)ను ఎప్పటి నుంచి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంగా పిలుస్తున్నారు?
- 2009, అక్టోబర్ - పదకొండో పంచవర్ష ప్రణాళికలో పొందుపరిచిన లక్ష్యాలు ఎన్ని?
- 27 - పదకొండో ప్రణాళికలో వనరుల కేటాయింపులో ఏ రంగానికి ప్రాధాన్యత ఇచ్చారు?
- సాంఘిక సేవలు - పేదరిక రేఖకు దిగువున ఉండి, అవ్యవస్థీకృత రంగంలో పనిచేస్తున్న వారికోసం 2007, అక్టోబర్ 1న ప్రారంభించిన పథకం?
- రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన
Published date : 01 Mar 2017 04:10PM