లండన్ స్టాక్ ఎక్స్చేంజ్లో భారతదేశ తొలి ‘సర్టిఫైడ్ గ్రీన్ బాండ్’ను ప్రారంభించిన బ్యాంక్ ఏది?
1. జూన్ 2016లో ‘జాతీయ పెట్టుబడి, అవస్థాపనా నిధి’ భారత్‌లో అవస్థాపనా సౌకర్యాలపై పెట్టుబడికి సంబంధించి ఏ సంస్థతో ఒప్పందంపై సంతకం చేసింది?
ఎ) అమెరికా ఇన్వెస్ట్మెంట్ అథారిటీ
బి) ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ
సి) కువైట్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ
డి) అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ
- View Answer
- సమాధానం: బి
2. లండన్ స్టాక్ ఎక్స్చేంజ్లో భారతదేశ తొలి ‘సర్టిఫైడ్ గ్రీన్ బాండ్’ను ప్రారంభించిన బ్యాంక్ ఏది?
ఎ) యాక్సిస్ బ్యాంక్
బి) ఐసీఐసీఐ బ్యాంక్
సి) హెచ్.డి.ఎఫ్.సి. బ్యాంక్
డి) బ్యాంక్ ఆఫ్ బరోడా
- View Answer
- సమాధానం: ఎ
3. 2015లో ప్రపంచ చమురు వినియోగంలో భారత్ వాటా ఎంత?
ఎ) 3.5%
బి) 4.1%
సి) 4.4%
డి) 4.5%
- View Answer
- సమాధానం: డి
4. విత్త రంగంలో పరిశోధన, రిక్రూట్మెంట్కు సంబంధించి ఏర్పాటు చేసిన కమిటీ ఏది?
ఎ) చతుర్వేది కమిటీ
బి) ఆర్.ఎస్. లోథా కమిటీ
సి) పి.కె. సిన్హా కమిటీ
డి) ఎన్.కె. మిట్టల్ కమిటీ
- View Answer
- సమాధానం: సి
5. 2016-17లో కేంద్ర బ్యాంక్ రెండో బై-మంత్లీ ద్రవ్య విధానంలో భాగంగా ప్రస్తుతం రెపో రేటును ఎంతగా నిర్ణయించారు?
ఎ) 6.0%
బి) 6.5%
సి) 7.2%
డి) 7.5%
- View Answer
- సమాధానం: బి
6. భారత్‌లో ట్రాన్స్ జెండర్ (Transgender) కమ్యూనిటీకి పింఛన్లు, ఆహార ప్రయోజనం కల్పించిన మొదటి రాష్ట్రం ఏది?
ఎ) కర్ణాటక
బి) పశ్చిమ బెంగాల్
సి) మహారాష్ట్ర
డి) ఒడిశా
- View Answer
- సమాధానం: డి
7. ఒడిశాలో నీటిపారుదల సౌకర్యాల కల్పనకు ఉద్దేశించి ఆసియా అభివృద్ధి బ్యాంక్‌తో భారత్ ఎంత మొత్తం రుణానికి సంబంధించి ఒప్పందం కుదుర్చుకుంది?
ఎ) 120 మిలియన్ డాలర్లు
బి) 150 మిలియన్ డాలర్లు
సి) 170 మిలియన్ డాలర్లు
డి) 180 మిలియన్ డాలర్లు
- View Answer
- సమాధానం: ఎ
8. భూ విధానానికి సంబంధించి ఇటీవల నీతి ఆయోగ్ ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగం (Cell) అధ్యక్షులు ఎవరు?
ఎ) రంగరాజన్
బి) టి. హక్
సి) వై.వి. రెడ్డి
డి) డి. సుబ్బారావు
- View Answer
- సమాధానం: బి
9. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ ఆదాయ పన్ను రద్దు చేసింది?
ఎ) తెలంగాణ
బి) బిహార్
సి) కర్ణాటక
డి) ఒడిశా
- View Answer
- సమాధానం: సి
10. ‘జననీ సేవ’ కార్యక్రమాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది?
ఎ) వ్యవసాయ మంత్రిత్వ శాఖ
బి) పరిశ్రమలు, ఖనిజాల మంత్రిత్వ శాఖ
సి) మహిళా, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ
డి) రైల్వే మంత్రిత్వ శాఖ
- View Answer
- సమాధానం: డి
11. పారదర్శకతను పెంపొందించడానికి బహిరంగ ప్రభుత్వ డేటా పోర్టల్‌ను ప్రారంభించిన తొలి రాష్ట్రం ఏది?
ఎ) బిహార్
బి) మణిపూర్
సి) సిక్కిం
డి) మేఘాలయ
- View Answer
- సమాధానం: సి
12. టాక్స్ అడ్మినిస్ట్రేటర్సకు సంబంధించి ‘రజస్వ గ్యాన్ సంఘం’ కాన్ఫరెన్స్ ను 2016లో ఏ నగరంలో నిర్వహించనున్నారు?
ఎ) కోల్‌కతా
బి) న్యూఢిల్లీ
సి) హైదరాబాద్
డి) విజయవాడ
- View Answer
- సమాధానం: బి
13. వాయు నాణ్యత సూచీ సమాచారాన్ని అందించడానికి (Rajvayu) మొబైల్ యాప్ ప్రారంభించిన రాష్ట్రం ఏది?
ఎ) రాజస్థాన్
బి) ఉత్తరప్రదేశ్
సి) మధ్యప్రదేశ్
డి) ఛత్తీస్‌గఢ్
- View Answer
- సమాధానం: ఎ
14. ‘బి.పి. స్టాటిస్టికల్ రివ్యూ ఆఫ్ వరల్డ్ ఎనర్జీ’ ప్రకారం ప్రపంచంలో అతి పెద్ద చమురు వినియోగదారుగా ఏ దేశం ఉంది?
ఎ) ఇండియా
బి) చైనా
సి) అమెరికా
డి) దక్షిణ కొరియా
- View Answer
- సమాధానం: సి
15. కేంద్ర ప్రభుత్వం ఏ పథకం ద్వారా 28.5 లక్షల హెక్టార్ల విస్తీర్ణాన్ని నీటి పారుదల సౌకర్యం పరిధిలోకి తీసుకురావాలనే లక్ష్యం పెట్టుకున్నట్లు 2016-17 బడ్జెట్లో ప్రకటించింది?
ఎ) ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన
బి) ప్రధానమంత్రి క్రిషి సింఛయ్ యోజన
సి) వాల్మీకి అంబేడ్కర్ ఆవాస్ యోజన
డి) మేక్ ఇన్ ఇండియా
- View Answer
- సమాధానం: బి
16. 2016-17 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం.. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన కింద 2019 నాటికి ఎన్ని ఆవాసాలకు రవాణా సౌకర్యం కల్పించనున్నట్లు ప్రకటించింది?
ఎ) 65000
బి) 67000
సి) 68000
డి) 68525
- View Answer
- సమాధానం: ఎ
17. ఒక ఆర్థిక వ్యవస్థ ఉత్పాదక సామర్థ్యం అవసరమైన ఉపాధి కల్పనకు సరిపోయినంతగా లేనప్పుడు ఏ రకమైన నిరుద్యోగం ఏర్పడుతుంది?
ఎ) ప్రచ్ఛన్న నిరుద్యోగం
బి) బహిర్గత నిరుద్యోగం
సి) నిర్మాణాత్మక నిరుద్యోగం
డి) చక్రీయ నిరుద్యోగం
- View Answer
- సమాధానం: సి
18.కోశ విధానాన్ని ఎవరు రూపొందిస్తారు?
ఎ) కేంద్ర బ్యాంకు
బి) సెబీ
సి) నీతి ఆయోగ్
డి) ఆర్థిక మంత్రిత్వ శాఖ
- View Answer
- సమాధానం: డి
19. కింది వాటిలో స్పెషల్ డ్రాయింగ్ రైట్స్‌ను మంజూరు చేసేది ఏది?
ఎ) ప్రపంచ బ్యాంక్
బి) ఐ.ఎం.ఎఫ్.
సి) రిజర్వ్ బ్యాంక్
డి) ఆసియా అభివృద్ధి బ్యాంక్
- View Answer
- సమాధానం: బి
20. దేశంలో ద్రవ్య సరఫరాను నియంత్రించేది?
ఎ) రిజర్వ్ బ్యాంక్
బి) ఆర్థిక మంత్రిత్వ శాఖ
సి) ఐక్యరాజ్య సమితి
డి) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
- View Answer
- సమాధానం: ఎ
21.పి.ఎ. శామ్యూల్ సన్ ఏ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు?
ఎ) రివీల్డ్ ప్రిఫరెన్స్
బి) సాపేక్ష ప్రయోజనం
సి) నిరపేక్ష ప్రయోజనం
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: ఎ
22. జాతీయాదాయ గణనలో కింద పేర్కొన్న ఏ అంశాన్ని పరిగణనలోకి తీసుకోరు?
ఎ) ఐ.టి. రంగ ఎగుమతులు
బి) సంస్థ అమ్మకాలు
సి) భూమి అమ్మకం
డి) ఉద్యోగుల వేతనాలు
- View Answer
- సమాధానం: సి
23. సాంకేతిక ఆర్థిక సహకారానికి సంబంధించి ఏర్పాటు చేసిన ‘టీమ్-9’లో భారత్‌తో పాటు ఏ దేశాలు ఉన్నాయి?
ఎ) ఆసియా- పసిఫిక్
బి) పశ్చిమ ఆఫ్రికా
సి) తూర్పు ఆసియా
డి) సార్క్
- View Answer
- సమాధానం: బి
24. కింది వాటిలో గోల్డ్‌మన్ శాచ్.. 2050 నాటికి ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలుగా ఉంటాయని పేర్కొన్న దేశాల సరైన వరసక్రమం ఏది?
ఎ) అమెరికా, చైనా, బ్రెజిల్, ఇండియా, మెక్సికో
బి) అమెరికా, మెక్సికో, చైనా, ఇండియా, బ్రెజిల్
సి) చైనా, అమెరికా, బ్రెజిల్, ఇండియా, మెక్సికో
డి) చైనా, అమెరికా, ఇండియా, బ్రెజిల్, మెక్సికో
- View Answer
- సమాధానం: డి
25. కింద పేర్కొన్న వారిలో పేదరిక తీవ్రత అంచనాలతో సంబంధం లేనివారెవరు?
ఎ) దండేకర్, రథ్
బి) మిన్హాస్
సి) రాజ్‌కృష్ణ
డి) పి.కె. బర్దన్
- View Answer
- సమాధానం: సి
26. ‘సాఫ్ట్ కరెన్సీ’ అంటే ఏమిటి?
ఎ) అంతర్జాతీయ మార్కెట్లో సరఫరా, డిమాండ్ తక్కువగా ఉండేది
బి) అంతర్జాతీయ మార్కెట్లో సరఫరా కంటే డిమాండ్ ఎక్కువగా ఉండేది
సి) అంతర్జాతీయ మార్కెట్లో సరఫరా కంటే డిమాండ్ తక్కువగా ఉండేది
డి) అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పెరుగుతూ ఉండేది
- View Answer
- సమాధానం: సి
27.యూరో కరెన్సీ ఎప్పటి నుంచి చెలామణిలోకి వచ్చింది?
ఎ) 1999 జనవరి 1
బి) 2002 జనవరి 1
సి) 2005 జనవరి 1
డి) 2008 జనవరి 1
- View Answer
- సమాధానం: ఎ
28.వృద్ధి నమూనాలతో మొదటిసారిగా ద్రవ్యాన్ని ఎవరు ప్రవేశపెట్టారు?
ఎ) రాబిన్సన్
బి) డోమార్
సి) హారడ్
డి) పైన పేర్కొన్న వారెవరూ కాదు
- View Answer
- సమాధానం: డి
29. మొదటిసారిగా ‘వ్యయ పన్ను’ను సూచించింది ఎవరు?
ఎ) ఆర్థర్ లూయీస్
బి) ఎన్. కాల్డర్
సి) జె.హిక్స్
డి) డాల్టన్
- View Answer
- సమాధానం: బి
30. ధరలు పెరిగినప్పుడు ప్రభుత్వ రుణానికి సంబంధించి ప్రత్యక్ష వాస్తవిక భారం అనేది..?
ఎ) తగ్గుతుంది
బి) పెరుగుతుంది
సి) అనిశ్చితం
డి) మార్పు ఉండదు
- View Answer
- సమాధానం: ఎ
31.కింద పేర్కొన్న ఏ పరిస్థితుల్లో పన్ను రేట్లను పెంచాలి?
ఎ) ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం తక్కువగా ఉన్నప్పుడు
బి) ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం ఎక్కువగా ఉన్నప్పుడు
సి) ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వంలో మార్పు లేనప్పుడు
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: బి
32. జీరో బేస్డ్ బడ్జెటింగ్ కింది వాటిలో దేనికి ప్రాధాన్యం ఇస్తుంది?
ఎ) పన్నురేటు పెంపు
బి) పన్నురేటు తగ్గింపు
సి) వ్యయచరిత్రతో సంబంధం లేకుండా బడ్జెట్ రూపకల్పన
డి) అపరిమిత లోటు బడ్జెట్
- View Answer
- సమాధానం: సి
33. ఒక సంవత్సర కాలంలో మార్కెట్ ధరల వద్ద జాతీయాదాయం కింది వాటిలో దేనికి సమానం?
ఎ) ఉత్పత్తి కారకాల చెల్లింపుల మొత్తం + పరోక్ష పన్నులు - సబ్సిడీలు
బి) ఉత్పత్తి కారకాలకు చెల్లింపుల మొత్తం - పరోక్ష పన్నులు + సబ్సిడీలు
సి) వేతనం, వడ్డీ మొత్తం
డి) దేశంలో తయారైన వస్తువులు, సేవల మొత్తం విలువ
- View Answer
- సమాధానం: ఎ
34. ద్రవ్యోల్బణ విరామాన్ని సవరించడానికి కింద పేర్కొన్న ఏ కోశపరమైన చర్య అవసరం?
ఎ) ప్రభుత్వ రుణం పెంచడం
బి) పన్నుల పెంపు
సి) ప్రభుత్వ వ్యయం తగ్గింపు
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
35. వ్యాపార చక్రాల్లో భాగంగా వాస్తవ జీడీపీ పెరుగుదలను ఏ దశగా పేర్కొనవచ్చు?
ఎ) విస్తరణ
బి) ఆర్థిక మాంద్యం
సి) తిరోగమనం
డి) స్టాగ్ఫ్లేషన్
- View Answer
- సమాధానం: ఎ
36. ఆర్థిక వ్యవస్థలో స్థూల ఆర్థిక సమతౌల్యం ప్రారంభమైనప్పుడు కింద పేర్కొన్న ఏ పరిస్థితుల్లో పన్నులు గణనీయంగా తగ్గిస్తారు?
ఎ) విస్తరణ, ద్రవ్యోల్బణం ఉన్నప్పుడు
బి) స్టాగ్ఫ్లేషన్ ఉన్నప్పుడు
సి) విస్తరణ, ప్రతిద్రవ్యోల్బణం ఉన్నప్పుడు
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: ఎ
37. ద్రవ్య డిమాండ్ కింద పేర్కొన్న ఏ పరిస్థితుల్లో తగ్గుతుంది?
ఎ) జీడీపీ డిఫ్లేటర్ పెరిగినప్పుడు
బి) వాస్తవిక జీడీపీ పెరిగినప్పుడు
సి) వాస్తవిక వడ్డీ రేటు పెరిగినప్పుడు
డి) ప్రతిద్రవ్యోల్బణం వెంటనే రాబోతుందనే ప్రజల అంచనా ఉన్నప్పుడు
- View Answer
- సమాధానం: సి
38.వాస్తవ నిరుద్యోగితా రేటు, సహజ నిరుద్యోగితా రేటు కంటే తక్కువగా ఉన్నప్పుడు ఏ పరిణామం చోటుచేసుకుంటుంది?
ఎ) ద్రవ్యోల్బణ రేటు పెరుగుతుంది
బి) వేతనాలు తగ్గుతాయి
సి) ఫిలిప్స్ రేఖ ఎడమవైపు కదులుతుంది
డి) సహజ నిరుద్యోగితా రేటు తగ్గుతుంది
- View Answer
- సమాధానం: ఎ
39.ఆర్థికవేత్తల అభిప్రాయంలో దీర్ఘకాలిక ఫిలిప్స్ రేఖ ఎలా ఉంటుంది?
ఎ) పైకి వాలి ఉంటుంది
బి) కిందకు వాలి ఉంటుంది
సి) సమాంతరంగా ఉంటుంది
డి) లంబంగా ఉంటుంది
- View Answer
- సమాధానం: డి
40. లాఫర్ రేఖ వేటి మధ్య సంబంధాన్ని తెలుపుతుంది?
ఎ) పన్ను రేట్లు, ఆదాయం
బి) పన్నురేట్లు, ఉపాధి
సి) పన్నురేట్లు, పన్ను రాబడి
డి) పన్నురేట్లు, ప్రభుత్వ వ్యయం
- View Answer
- సమాధానం: సి
41. ఆర్థిక సమైక్యతకు సంబంధించి కింది వాటిలో దేన్ని అధిక స్థాయిగా భావిస్తారు?
ఎ) కామన్ మార్కెట్
బి) స్వేచ్ఛా వాణిజ్య ప్రాంతం
సి) కస్టమ్స్ యూనియన్
డి) ఎకనామిక్ యూనియన్
- View Answer
- సమాధానం: డి
42. ‘సరఫరా వైపు’ అనే పదాన్ని మొదటిసారిగా ఎవరు ఉపయోగించారు?
ఎ) హెర్బర్ట్ స్టీన్
బి) ఆడమ్ స్మిత్
సి) ఫిషర్
డి) మార్షల్ ఎడ్జ్ వర్త్
- View Answer
- సమాధానం: ఎ
43.‘బగ్లిహార్ డ్యామ్’ ఏ నదిపై నిర్మించారు?
ఎ) మూసీ
బి) గోదావరి
సి) చీనాబ్
డి) పెన్నా
- View Answer
- సమాధానం: సి
44. Reverse Mortgage పథకాన్ని ఎవరి ప్రయోజనార్థం రూపొందించారు?
ఎ) మహిళలు
బి) సీనియర్ సిటిజన్లు
సి) విదేశాల్లో పనిచేసేవారు
డి) అసంఘటిత రంగ కార్మికులు
- View Answer
- సమాధానం: బి
45. ఎన్నో పంచవర్ష ప్రణాళికలో చిన్న తరహా, కుటీర పరిశ్రమల అభివృద్ధికి స్వయం ప్రతిపత్తి ఉన్న బోర్డులను ఏర్పాటు చేశారు?
ఎ) 1వ
బి) 4వ
సి) 5వ
డి) 7వ
- View Answer
- సమాధానం: ఎ
46. ‘బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్’ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
ఎ) 1844
బి) 1824
సి) 1694
డి) 1876
- View Answer
- సమాధానం: సి
47. కింది వాటిలో బ్యాంకింగ్ రంగంలో వినియోగదారుల సేవలకు సంబంధించి ఏర్పాటు చేసిన కమిటీ ఏది?
ఎ) పూరి కమిటీ
బి) ఘోష్ కమిటీ
సి) ఆర్.కె. తల్వర్ కమిటీ
డి) ఎస్. చక్రవర్తి కమిటీ
- View Answer
- సమాధానం: డి
48. 1774లో కింద పేర్కొన్న ఏ ప్రాంతంలో ‘కోల్ మైనింగ్’ ప్రారంభించారు?
ఎ) ధన్‌బాద్
బి) రాంచీ
సి) రాణిగంజ్
డి) కొత్తగూడెం
- View Answer
- సమాధానం: సి