కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా మొదటి చైర్మన్ ఎవరు?
1. కింది వాటిలో 1956 పారిశ్రామిక తీర్మాన లక్ష్యం కానిది ఏది?
1) సహకార రంగ అభివృద్ధి
2) ప్రభుత్వ రంగ విస్తరణ
3) భారీ, యంత్ర తయారీ పరిశ్రమల అభివృద్ధి
4) వందశాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల అనుమతి
- View Answer
- సమాధానం: 4
2. ప్రస్తుతం సింగిల్ బ్రాండ్ రిటైలింగ్ ట్రేడింగ్‌లో అనుమతించే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి శాతం?
1) 49
2) 74
3) 80
4) 100
- View Answer
- సమాధానం: 4
3. కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా మొదటి చైర్మన్ ఎవరు?
1) ధనేంద్ర కుమార్
2) రతిన్ రాయ్
3) అరవింద్ సుబ్రమణియన్
4) వై.వి. రెడ్డి
- View Answer
- సమాధానం: 1
4. కింది ఏ పారిశ్రామిక తీర్మానం మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు పునాది వేసింది?
1) 1948
2) 1956
3) 1980
4) 1990
- View Answer
- సమాధానం: 1
5. 1948 పారిశ్రామిక తీర్మానం ద్వారా పరిశ్రమలను ఎన్ని కేటగిరీలుగా విభజించారు?
1) 2
2) 3
3) 4
4) 5
- View Answer
- సమాధానం: 3
6. 1956 పారిశ్రామిక తీర్మానంలో షెడ్యూల్ - అ లో ఉన్న పరిశ్రమల సంఖ్య?
1) 14
2) 15
3) 16
4) 17
- View Answer
- సమాధానం: 4
7. 1980 పారిశ్రామిక తీర్మానంలో ముఖ్యాంశం కానిది ఏది?
1) ఆర్థిక ఫెడరలిజం
2) న్యూక్లియస్ సంస్థలు
3) చిన్న పరిశ్రమల పెట్టుబడి పరిమితి పెంపు
4) ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ
- View Answer
- సమాధానం: 4
8. లెసైన్సుల విస్తృత ఏకీకరణ పథకాన్ని ప్రవేశపెట్టిన సంవత్సరం?
1) 1984
2) 1991
3) 1997
4) 2017
- View Answer
- సమాధానం: 1
9. 1977లో పారిశ్రామిక తీర్మానం ప్రకటించే సమయంలో భారత ప్రధాని ఎవరు?
1) ఇందిరా గాంధీ
2) రాజీవ్ గాంధీ
3) మొరార్జీ దేశాయ్
4) వి.పి. సింగ్
- View Answer
- సమాధానం: 3
10. భారత ఆర్థిక రాజ్యాంగం, ‘ది బైబిల్ ఆఫ్ స్టేట్ కాపిటలిజం’గా కింది ఏ పారిశ్రామిక తీర్మానాన్ని పేర్కొనవచ్చు?
1) 1948
2) 1956
3) 1977
4) 1990
- View Answer
- సమాధానం: 2
11. సరళీకృత పారిశ్రామిక విధానాన్ని 1991లో ఎప్పుడు ప్రకటించారు?
1) జూలై 24
2) ఆగస్టు 2
3) సెప్టెంబర్ 25
4) డిసెంబర్ 15
- View Answer
- సమాధానం: 1
12.పరిశ్రమల అభివృద్ధి, నియంత్రణ చట్టం రూపొందించిన సంవత్సరం?
1) 1948
2) 1950
3) 1951
4) 1962
- View Answer
- సమాధానం: 3
13. కింది ఏ పరిశ్రమలను 1993లో లెసైన్సింగ్ జాబితా నుంచి తొలగించారు?
1) జింక్, కాపర్ మైనింగ్
2) అణు శక్తి
3) రైల్వేలు
4) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: 1
14. దేశంలో మొదటి కార్మిక శాఖ మంత్రి?
1) వల్లభ్‌భాయ్ పటేల్
2) బాబు జగ్జీవన్ రామ్
3) మొరార్జీ దేశాయ్
4) ఇందిరా గాంధీ
- View Answer
- సమాధానం: 2
15. ప్రైవేటీకరణను మొదటగా ప్రతిపాదించిన వారు?
1) నెహ్రూ
2) పీటర్ డ్రక్కర్
3) రొనాల్డ్ రీగన్
4) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: 2
16. 1991 పారిశ్రామిక తీర్మానం ద్వారా కింది ఏ రంగానికి సంబంధించి విధానాల రూపకల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చింది?
1) విదేశీ పెట్టుబడి
2) ఎం.ఆర్.టి.పి. చట్టం
3) పారిశ్రామిక లెసైన్సింగ్
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
17. ప్రస్తుతం చమురు అన్వేషణలో ఎంత శాతం ఎఫ్.డి.ఐ.లను అనుమతిస్తున్నారు?
1) 48
2) 51
3) 74
4) 100
- View Answer
- సమాధానం: 4
18. మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ ప్రవేశపెట్టిన సంవత్సరం?
1) 2001
2) 2002
3) 2005
4) 2007
- View Answer
- సమాధానం: 2
19. 1964లో ఏర్పాటైన ఏక స్వామ్య పరిశీలనా సంఘం అధ్యక్షుడు?
1) కె.సి. దాస్‌గుప్తా
2) కె.సి. పంత్
3) మహాలనోబిస్
4) పైవేవీకావు
- View Answer
- సమాధానం: 1
20. 1956 పారిశ్రామిక తీర్మానం ద్వారా పరిశ్రమలను ఎన్ని షెడ్యూళ్లుగా విభజించారు?
1) 1
2) 2
3) 3
4) 4
- View Answer
- సమాధానం: 3
21. 1990 మే 31న కింది ఏ ప్రభుత్వం పారిశ్రామిక విధానాన్ని ప్రకటించింది?
1) జనతా
2) జనతాదళ్
3) బి.జె.పి.
4) కాంగ్రెస్
- View Answer
- సమాధానం: 2
22. ఫెరా స్థానంలో ఫెమాను కింది ఏ సంవత్సరం నుంచి ప్రవేశపెట్టారు?
1) 1998
2) 2001
3) 2005
4) 2007
- View Answer
- సమాధానం: 1
23. కనీస వేతనాల చట్టాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు?
1) 1948
2) 1956
3) 1971
4) 1980
- View Answer
- సమాధానం: 1
24. 1970లో కింది ఏ కమిటీ సిఫార్సులతో ప్రభుత్వం పారిశ్రామిక విధానాన్ని ప్రకటించింది?
1) ఖాన్
2) దేవేంద్ర కుమార్
3) దత్
4) మాంటెక్‌సింగ్ అహ్లూవాలియా
- View Answer
- సమాధానం: 3
25. అవస్థాపిత శక్తిని అభిలషణీయ పరిమాణంలో వినియోగించుకోవాలని కింది ఏ పారిశ్రామిక తీర్మానం లక్ష్యంగా తీసుకుంది?
1) 1956
2) 1980
3) 1990
4) 1991
- View Answer
- సమాధానం: 2
26. ప్రత్యామ్నాయ వస్తువుల మాదిరి దగ్గర పోలికలున్న వస్తువులన్నిటికీ ఒకే జాబితా కింద లెసైన్స్‌ను మంజూరు చేసే విధానం?
1) బ్రాడ్ బాండింగ్ ఆఫ్ ఇండస్ట్రియల్ లెసైన్స్
2) ఆర్థిక ఫెడరలిజం
3) సరళీకరణ
4) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: 1
27.పర్యావరణ సమతౌల్యం గురించి మొదటగా ప్రస్తావించిన పారిశ్రామిక తీర్మానం?
1) 1948
2) 1956
3) 1980
4) 1977
- View Answer
- సమాధానం: 3
28. 1991 బడ్జెట్ ప్రసంగంలో ప్రపంచ ఆర్థిక వేదికపై భారత్‌ను అజేయ శక్తిగా నిలబెట్టాలనే ఆలోచనలు నిజం చేసుకొనే క్షణం ఆసన్నమైందని పేర్కొన్నవారు?
1) ప్రణబ్ ముఖర్జీ
2) మన్మోహన్ సింగ్
3) అరుణ్ జైట్లీ
4) స్వరణ్ సింగ్
- View Answer
- సమాధానం: 2
29. 1948 పారిశ్రామిక తీర్మానాన్ని అమలు పరచడానికి కింది ఏ చట్టాన్ని తీసుకొచ్చారు?
1) పారిశ్రామిక వివాదాల చట్టం
2) ఎం.ఆర్.టి.పి. చట్టం
3) పరిశ్రమల అభివృద్ధి, నియంత్రణ చట్టం
4) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: 3
30. ఆర్థిక నియంత్రణలో సమగ్రమైన మార్పులను సూచించిన పారిశ్రామిక తీర్మానం?
1) 1948
2) 1977
3) 1990
4) 1991
- View Answer
- సమాధానం: 4
31. 1990 పారిశ్రామిక తీర్మానం ద్వారా ఏర్పాటైన సంస్థ?
1) IDBI
2) SIDBI
3) ICICI
4) IFCI
- View Answer
- సమాధానం: 2
32. భారత మాజీ ప్రధానుల్లో ఎవరు మొదటిసారి ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ ప్రైవేటీకరణ అంశాన్ని ప్రస్తావించారు?
1) ఇందిరా గాంధీ
2) మొరార్జీ దేశాయ్
3) వాజ్‌పేయి
4) రాజీవ్ గాంధీ
- View Answer
- సమాధానం: 4