TS Inter Board : తెలంగాణ ఇంటర్ బోర్డ్ కీలక ఆదేశాలు.. ఇలా చేస్తే కఠిన చర్యలు తప్పవ్..
ఒక వేళ సర్టిఫికేట్లలను జారీ చేయకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
నారాయణ కాలేజీకి ప్రభుత్వం షోకాజు నోటీసులు జారీ..
రామంతాపూర్ నారాయణ కాలేజీలో విద్యార్థి సాయి నారాయణ ఇంటర్ సెకండ్ ఇయర్ పూర్తి చేసుకున్నాడు. సాయి తన తండ్రి, విద్యార్థి సంఘం నాయకుడు సందీప్‌తో కలిసి కాలేజ్‌కు వచ్చాడు. టీసీ ఇవ్వాలంటే డ్యూ ఉన్న రూ. 16 వేల ఫీజు చెల్లించాలని ప్రిన్సిపాల్ సుధాకర్ చెప్పాడు. ఈ క్రమంలో విద్యార్థి నేత నారాయణ , ప్రిన్సిపాల్ మధ్య వాగ్వాదం తలెత్తింది. ఫీజు విషయంలో ప్రిన్సిపాల్ సుధాకర్ రెడ్డి వెనక్కి తగ్గకపోవడంతో విద్యార్థి నేత సందీప్ పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఈ ఘటనలో విద్యార్థి నాయకుడు సందీప్, అశోక్ రెడ్డి, ప్రిన్సిపాల్ సుధాకర్ రెడ్డికి గాయాలయ్యాయి. ఘటన పై హైదరాబాద్ నారాయణ కాలేజీకి తెలంగాణ ప్రభుత్వం షోకాజు నోటీసులు జారీ చేసింది. రామాంతాపూర్ నారాయణ కాలేజీ ఘటనపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది.