Telangana: ఇంటర్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. 35 మార్కులతో పాసైతే..

దీనివల్ల ప్రస్తుతం ఇంటర్ రెండో ఏడాది పరీక్షలు రాస్తున్న ప్రతి ఒక్కరికీ ఎంసెట్‌కు అర్హత లభిస్తుంది. వాస్తవానికి ఇంటర్‌లో కనీసం 40 మార్కులు వస్తేనే ఎంసెట్ ద్వారా ఇంజనీరింగ్ సీటు సంపాదించే వీలుంది.
కేవలం 49 శాతం మంది విద్యార్థులే..
కరోనా నేపథ్యంలో గత రెండేళ్లుగా ఈ నిబంధనను సడలించారు. టెన్త్ పరీక్షలు లేకుండానే గతేడాది ఇంటర్ ఫస్టియర్‌కు విద్యార్థులు ప్రమోట్ అయ్యారు. వీరికి గత మార్చిలో కూడా ఫస్టియర్ పరీక్షలు నిర్వహించలేదు. అయితే, ఆ తర్వాత అక్టోబర్‌లో వీళ్లందరికీ పరీక్షలు పెట్టారు. కానీ, కేవలం 49 శాతం మంది విద్యార్థులే ఉత్తీర్ణులయ్యారు. దీనిపై విద్యార్థుల్లో తీవ్ర ఆందోళనలు నెలకొన్నాయి. ఆన్‌లైన్ క్లాసులు అర్థం కాకపోవడంతో తాము పరీక్షలు సరిగా రాయలేకపోయామని నిస్సహాయత వ్యక్తం చేశారు.
JEE Main 2022: పరీక్ష షెడ్యూల్ విడుదల.. ఇలా ప్రిపేర్ అయితే విజయం మీదే..
35 మార్కులతో ఉత్తీర్ణులైతే..
కొంతమంది విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడటంతో ప్రభుత్వం ఫస్టియర్ విద్యార్థులందరినీ కనీస మార్కులతో పాస్ చేసింది. ప్రస్తుతం వీళ్లు ఏప్రిల్‌లో సెకండియర్ పరీక్షలు రాయాల్సి ఉంది. ఫస్టియర్ అనుభవాలను పరిగణనలోనికి తీసుకుంటే, ఎక్కువ మంది 40 మార్కులు సాధించడం కష్టమనే అంచనాలు తెరమీదకొస్తున్నాయి. దీంతో 35 మార్కులతో ఉత్తీర్ణులైతే ఎంసెట్ ద్వారా సీటు పొందే అవకాశం కల్పించాలని తాజాగా నిర్ణయించారు. త్వరలో ఉన్నత విద్యామండలి దీనిపై చర్చించి నిర్ణయం ప్రకటించే వీ లుంది. ఇదే క్రమంలో జూన్ ఆఖరులోగా ఎంసెట్ తేదీలను ఖరారు చేయాలని భావిస్తోంది.
EAMCET 2022: జూన్ లో ఎంసెట్!.. సత్తా చాటేలా.. ప్రిపరేషన్ సాగించండిలా..
AP Inter Exams : ఏపీ ఇంటర్ పరీక్షల తేదీలు మార్పు.. కొత్త తేదీలు ఇవే.. ప్రాక్టికల్స్ మాత్రం..
ఇంటర్ పరీక్షల తేదీలు మార్పులు..
ఇంటర్ పరీక్షల తేదీలు మారాయి. ఇందుకు సంబంధించిన కొత్త తేదీలతో ఇంటర్ బోర్డు మార్చి 2న కాలపట్టిక విడుదల చేసింది. మారిన షెడ్యూల్ ప్రకారం ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్ష ఏప్రిల్ 22 నుంచి, సెకండియర్ 23 నుంచి మొదలవుతుంది. ప్రాక్టికల్ పరీక్షల తేదీల్లో ఎలాంటి మార్పు లేదని తెలంగాణ ఇంటర్ బోర్డు పేర్కొంది. మార్చి 23 నుంచి ఏప్రిల్ 8 వరకూ ప్రాక్టికల్స్ ఉంటాయని తెలిపింది. ఏప్రిల్ 21 నుంచి ఇంటర్ పరీక్షల నిర్వహణకు సంబంధించి ఫిబ్రవరి నెలలో షెడ్యూల్డ్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే, 21న జేఈఈ మెయిన్ పరీక్ష కూడా ఉండటంతో ఇంటర్ పరీక్షల తేదీలను మార్చాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు.
ఫస్టియర్ |
సెకండియర్ |
||
తేదీ |
పరీక్ష |
తేదీ |
పరీక్ష |
22–4–22 |
సెకండ్ లాంగ్వేజ్–1 |
23–4–22 |
సెకండ్ లాంగ్వేజ్–2 |
25–4–22 |
ఇంగ్లిష్ పేపర్–1 |
26–4–22 |
ఇంగ్లిష్ పేపర్–2 |
27–4–22 |
28–4–22 |
||
బోటనీ, పొలిటికల్ సైన్స్ |
బోటనీ, పొలిటికల్ సైన్స్ |
||
29–4–22 |
30–4–22 |
||
జువాలజీ, హిస్టరీ |
జువాలజీ, హిస్టరీ |
||
02–5–22 |
ఫిజిక్స్, ఎకనమిక్స్ |
05–5–22 |
ఫిజిక్స్, ఎకనమిక్స్ |
06–5–22 |
కెమిస్ట్రీ, కామర్స్ |
07–5–22 |
కెమిస్ట్రీ, కామర్స్ |
09–5–22 |
పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, మ్యాథ్స్ బ్రిడ్జి కోర్సు (బైపీసీ విద్యార్థులకు) |
10–5–22 |
పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, మ్యాథ్స్ బ్రిడ్జి కోర్సు (బైపీసీ విద్యార్థులకు) |
11–5–22 |
జాగ్రఫీ |
12–5–22 |
జాగ్రఫీ |
|
మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్–1 |
మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్–2 |