Inter Spot Admissions: గిరిజన గురుకులాల్లో ఇంటర్ స్పాట్ అడ్మిషన్లు
Sakshi Education
రాజేంద్రనగర్: రంగారెడ్డి, సంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పరిధిలోని గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ మొదటి విద్యా సంవత్సరం(2023–24)లో మిగిలిన సీట్ల భర్తీకి దరఖాస్తులు స్వీకరించనున్నామని రంగారెడ్డి, సంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్ (ప్రాంతీయ సమన్వయ అధికారి) పి.ఎస్.కళ్యాణి ఒక ప్రకటనలో తెలిపారు.
జూలై 10వ తేదీన బాలికల కోసం రాజేంద్రనగర్‌లోని రీజనల్ కో ఆర్డినేటర్ కార్యాలయంలో, 11వ తేదీన కొత్తూరు బాలుర కళాశాల నాదర్‌గుల్ వద్ద ఉదయం 11 గంటలకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నామన్నారు. అడ్మిషన్‌ల కోసం పదవ తరగతి మెమో, టీసీ, బోనొఫైడ్, కుల, ఆధాయ, ఫిజికల్ ఫిట్నెస్ ధ్రువీకరణ పత్రాలతో పాటు ఆధార్ కార్డు, ఎనిమిది పాస్ పోర్ట్‌సైజ్ ఫొటోలు తీసుకురావాలన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
చదవండి: టిఎస్ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | TIME TABLE 2023 | టైం టేబుల్ 2023 | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | న్యూస్ | ఏపీ ఇంటర్
Published date : 08 Jul 2023 05:48PM