Good News: ఇంటర్ పబ్లిక్ పరీక్షల ఫీజు గడువు పొడిగింపు.. చివరి తేదీ ఇదే
కరోనా నేపథ్యంలో జనవరి 30వ తేదీ వరకు సెలవులు ప్రకటించిన నేపథ్యంలో.. ఇంటర్ బోర్డ్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువును పెంచింది. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఫిబ్రవరి 4 తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చని తెలిపింది. అలాగే రూ.200 ఫైన్‌తో ఫిబ్రవరి 10 తేదీ వరకు...రూ 1000 అపరాధ రుసుముతో ఫిబ్రవరి 17వ తేదీ వరకు, రూ. 2000 ఫైన్‌లో ఫిబ్రవరి 24వ వరకు ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు.
టీ–శాట్ ద్వారా ఇంటర్ సిలబస్..
తెలంగాణ ఇంటర్ విద్యార్థుల ఆన్ లైన్ తరగతుల కోసం అవసరమైన ఏర్పాట్లు చేశారు.ఇకపై ఈ తరహా మెకానిజం ఎప్పటికీ అందుబాటులో ఉంటుందని అధికారులు అంటున్నారు. కరోనా నేపథ్యంలో విద్యాసంస్థలు తరచూ మూతపడుతున్నాయి. దీని ప్రభావం విద్యార్థుల చదువులపై పడుతోంది. అంతిమంగా సిలబస్ పూర్తవ్వలేదని, ఫెయిల్ అయిన విద్యార్థులు పాస్ చేయాలంటూ పట్టుపడుతున్నారు. ఈ సమస్య రాకుండా టీ–శాట్ ద్వారా పక్కా ప్రణాళిక ప్రకారం బోధన అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు షెడ్యూల్డ్ కూడా ప్రకటించారు. ప్రత్యక్ష బోధనకు హాజరవ్వకున్నా విద్యార్థులు దీనిద్వారా సిలబస్ పూర్తి చేసుకునే వీలుందని భావిస్తున్నారు.