Skip to main content

Inter Breaking News: ఫెయిలయిన ఇంటర్‌ ఫస్టియర్‌ విద్యార్థులంతా పాస్‌.. సెకండ్‌ ఇయర్‌లోనైనా..

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్‌ ఫస్టియర్‌ ఫలితాలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Sabitha indra reddy
Sabitha indra reddy

ఇటీవలే ప్రకటించిన ఇంటర్‌ ఫస్టియర్‌ ఫలితాల్లో ఫెయిలయిన విద్యార్థులను పాస్‌ చేస్తున్నట్లు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఇంటర్‌ ఫస్టియర్‌ ఫలితాలపై  నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆమె మాట్లాడారు. ఫస్టియర్‌లో ఫెయిలయిన విద్యార్థులందరిని కనీస శాతం(35శాతం) మార్కులతో పాస్‌ చేస్తున్నట్లు తెలిపారు. అందరిని పాస్‌ చేయడం ఇదే చివరిసారని.. భవిష్యత్తులో ఇలాంటి నిర్ణయాలు ఉండబోవని పేర్కొన్నారు. 

మిగిలిన 51 శాతం మంది..
ప్రెస్‌మీట్‌లో సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ''కోవిడ్‌తో విద్యావ్యవస్థ ఇబ్బందులు ఎదుర్కొంది. కోవిడ్‌ సంక్షభం కారణంగా మూడో తరగతి నుంచి పీజీ వరకు ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించాం. విద్యార్థుల భవిష్యత్తు కోసమే ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు నిర్వహించాం. అన్ని అంశాలు ఆలోచించిన తర్వాతే పరీక్షలు పెట్టాం. తాజాగా ప్రకటించిన ఇంటర్‌ ఫస్టియర్‌ ఫలితాల్లో 49 శాతం మంది విద్యార్థులు పాసవ్వగా..మిగిలిన 51 శాతం మంది ఫెయిలయ్యారు. అయితే ఫెయిలయిన వారిలో ఎక్కువగా ప్రభుత్వ ఇంటర్మీడియట్‌ కళాశాలలో చదివిన విద్యార్థులే ఉన్నారు. ఫస్టియర్‌ ఫలితాలపై ప్రభుత్వాన్ని, సీఎంను టార్గెట్‌ చేయడం సరికాదు. 

ఇంటర్ సెకండ్‌ ఇయర్‌లోనైనా..
ఫలితాలపై ఇంటర్‌ బోర్డులో ఎలాంటి లోపాలు జరగలేదు. వాల్యుయేషన్‌ పకడ్బందీగా నిర్వహించారు. విద్యార్థుల తల్లిదండ్రులు, విపక్షాలు బాధ్యతగా వ్యవహరిస్తే మంచిది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఫెయిలయిన విద్యార్థులందరికి కనీస 35 మార్కులు ఇచ్చి పాస్‌ చేస్తున్నాం. ఇంటర్ సెకండ్‌ ఇయర్‌లోనైనా విద్యార్థులు కష్టపడి చదివి మంచి మార్కులు సాధించాలని కోరుకుంటున్నా. ఇలాగే ఆందోళనలు చేస్తే ఇంటర్‌ సెకండియర్‌లో కూడా ప్రభుత్వమే పాస్‌ చేస్తుందని ఆశించడం మంచి పద్దతి కాదు'' అని మంత్రి సబితా విజ్ఞప్తి చేశారు.

తెలుగు రాష్ట్రాల్లో మే లో ఇంట‌ర్ ప‌రీక్ష‌లు...

Inter Exams Dates


తెలంగాణ‌లో ఇంట‌ర్ ప‌రీక్ష‌లు మే 2 నుంచి 20వ తేదీ వ‌ర‌కు, అలాగే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మే 5వ తేదీ నుంచి 22వ తేదీ వ‌ర‌కు ఇంట‌ర్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించే అవ‌కాశం ఉంది. తెలుగు రాష్ట్రాల ఇంట‌ర్ అధికారులు ఇప్ప‌టికే ప‌రీక్ష నిర్వ‌హ‌ణ ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇంట‌ర్ ప‌రీక్ష‌ల స‌మ‌గ్ర స‌మాచారం కోసం క్లిక్ చేయండి

Inter 1st Year Exams: ఇకపై డొంక తిరుగుడు ప్రశ్నలుండవ్‌..ఏ ప్రశ్నలైనా దీని నుంచే..

Inter Exams Latest News: ఈసారి 70 శాతం సిల‌బ‌స్‌తోనే ఇంట‌ర్ ప‌రీక్ష‌లు..ఈ నిబంధ‌న‌లు త‌ప్ప‌నిస‌రి

Published date : 08 Jan 2022 02:49PM

Photo Stories