Board Exams 2025 Paper Leakage Warning : పేపర్ లీకేజీలో హెచ్చరిక.. ఈసారి బోర్డు పరీక్షలో కీలక మార్పులు..!!

సాక్షి ఎడ్యుకేషన్: రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచే టెన్త్ ప్రీ ఫైనల్ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. అయితే, ఈసారి పదో తరగతి బోర్డు పరీక్షలకు అధికారులు పటిష్ఠ చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. గతంలో ఎన్నోసార్లు క్వశ్చన్ పేపర్ లీకేజ్ కారణంగా ఉపాధ్యాయులకు, అధికారులకు ఇది తలనొప్పిగా మారింది. ఈసారి ఎలాంటి ఆటంకాలు, అవకతవకలకు చాన్స్ లేకుండా ఉండేలా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈమెరకు పరీక్షల సమయంలో కొన్ని కఠిన నియమాలను ప్రవేశ పెడుతున్నారు. అంతేకాకుండా, ప్రశ్న పత్రాల లీక్ విషయంలో కూడా ప్రత్యేక చర్యలు తీసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
వచ్చే నెల.. మార్చి 21 నుంచి టెన్త్ పబ్లిక్ పరీక్షలు జరుగుతాయి. ప్రతీసారి ఎన్ని విధాలుగా సెక్యురిటీ ప్లాన్ చేసినా సరే ఏదో విధంగా పేపర్ లీకేజీ జరుగుతూనే ఉంది. ఇది కాస్త కొన్ని నెలలపాటు తలనొప్పిగా మారుతుంది. అంతేకాకుండా, ప్రతీ సారి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే ఆలోచనలు అధికారులకు మరింత పెద్ద పరీక్షగా మారింది. అందుకే, ఎలాంటి తప్పులు జరగకుండా ఉండేందుకు ఈసారి డిజిటల్ సేఫ్టీని ఉపయోగిస్తున్నారు బోర్డు అధికారులు.
పేపర్ సెక్యూరిటీకి కోడ్..
ప్రతీ ఏటా వరుసగా వింటూ ఉండే వార్త పేపర్ లీకేజీ. ఈ సమస్యల కారణంగా అధికారులే కాదు, విద్యార్థులు కూడా గందరగోళానికి గురవుతున్నారు. అయితే, ఈసారి అధికారులు తీసుకున్న పఠిష్టమైన చర్యల్లో భాగంగా, పేపర్‌లకు సెక్యూరిటీ కోడ్‌ను కేటాయించారు. ఇలా చేస్తే, ఆ పేపర్లను చూసేందుకు ఖచ్చితంగా కోడ్ కావాల్సి ఉంటుంది. ఆ కోడ్‌తోనే పేపర్‌ను పరిశీలించవచ్చు. పరీక్షల కోసం రూపొందించిన అన్ని ప్రశ్నాపత్రాల్లో ఈ సీక్రెట్ సెక్యూరిటీ కోడ్‌ను ముద్రించేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టనుంది.
గంటలోనే..
ఒకవేళ, విద్యాశాఖ ప్రయత్నంలో భాగంగా నిర్వహించే సెక్యూరిటీ కోడ్‌ను కూడా ఎవరన్న ఉల్లంగిస్తే, మరోసారి పేపర్‌ను లీక్ చేస్తే వారిని కేవలం గంటలోనే పట్టుకోవచ్చన్నారు. ఎలాంటి చర్యలకు పాల్పడినా కూడా వెంటనే పట్టుకునే వీలు ఉండేలా చర్యలు చేపడుతున్నారు అధికారులు.
టీచర్లకు హెచ్చరిక..
గతంలో ప్రశ్న పత్రాల పేపర్ లీక్ విషయంలో ఎక్కువశాతం టీచర్ల (ఇన్విజిలేటర్లు) చేయ్యి ఉందని వారికి ఇది ఒక హెచ్చరిక అని విద్యాశాఖ పేర్కొంది. ఈసారి మాత్రం ఎలాంటి తావులేకుండా, ఇన్విజిలేటర్లు కూడా వారికి కేటాయించిన పనిని సక్రమంగా నియమ నిబంధలను పాటిస్తూ చేయాలని ఆదేశించారు.
Tenth Class Exams 2025: పదో తరగతి వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ
గతంలో కొందరు ఇన్విజిలేటర్లు పదో తరగతి పేపర్లను లీక్ చేయడం, వాట్సాప్‌లో షేర్ చేయడం వంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి, మరోసారి ఈ చర్యలకు పాల్పడితే మాత్రం కేవలం కొన్ని రోజుల సస్పెన్షన్‌తో సరిపెట్టకుండా, శాశ్వతంగా వారిని వారి ఉద్యోగం నుంచి తొలగిస్తామని, హెచ్చరిక జారీ చేసింది విద్యాశాఖ..
జరిగిన.. జరగనున్న మార్పులు..
- విద్యార్థులకు గత విద్యాసంవత్సరం వరకు బోర్డు పరీక్షల ఫలితాలను గ్రేడ్ రూపంలో ఉండేది. కాని, ఈసారి నుంచి ఇందులో మార్పు చేస్తూ.. గ్రేడింగ్ విధానం కాకుండా, మార్కుల విధానాన్ని కొనసాగించాలని తేల్చింది విద్యాశాఖ. అంటే, బోర్డు పరీక్షలలో విద్యార్థులకు ఉండే ఏ, బీ, సీ గ్రేడింగ్‌ను కాస్త.. వారికి పరీక్షలో వచ్చే మార్కులను ప్రకటిస్తారు.
- గత విద్యాసంవత్సరంలో బోర్డు పరీక్షకు ప్రతీ విద్యార్థికి పేపర్లు ఇచ్చేవారు. అంటే, ఒక పేపర్ పూర్తి చేసుకున్న తరువాత మరో పేపర్‌ను కేటాయించడం ఉండేది. పరీక్ష పూర్తి చేసుకున్న తరువాత అన్ని పేపర్లను సమకూర్చి, దారం కట్టేవారు. కాని, ఈసారి చేసిన మార్పు ఏంటంటే.. పేపర్ల విధానాన్ని తొలగించి, బుక్‌లెట్ విధానానికి నాంది పలకనున్నారు. దీంతో, విద్యార్థులు వారి పరీక్ష పూర్తి అయ్యినా ఎలాంటి దారం కట్టాల్సిన అవసరం లేదు. కేవలం, ఆ బుక్‌లెట్‌లో పరీక్ష రాసి, ముగిసిన వెంటనే ఆ బుక్‌ను ఇన్విజిలేటర్‌కు ఇవ్వాల్సి ఉంటుంది.
- విద్యార్థులకు ఇప్పటివరకు పరీక్షలో 2 విభాగాల్లో మార్కులు అందించే వారు. అంటే, 20 మార్కులు ఇంటర్నల్స్ అయితే, మరో భాగం 80 మార్కుల రాత పరీక్ష. కాని, వచ్చే సంవత్సరం అనగా, 2025-26 విద్యాసంవత్సరం నుంచి ఈ విధాన్ని తొలగించి, పూర్తిగా 100 మార్కుల పేపర్ రాసే విధానాన్ని రూపోందించనుంది విద్యాశాఖ.
విద్యార్థులు పరీక్ష కోసం ఏమాత్రం భయాందోళనకు గురికాకుండా, నిశ్చింతగా పరీక్షలకు సిద్ధమవ్వాలన్నారు అధికారులు. పరీక్షల సమయంలో తమ ఆరోగ్యం కూడా చూసుకుంటూ పరీక్షలకు ప్రిపేర్ అవ్వాలని. ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రిపరేషన్ కొనసాగించి, పేపర్ కూడా బాగా రాయాలని ప్రోత్సాహించారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- Tenth Students
- telangana state board exams 2025
- tenth board exams key points
- Telangana Education Department
- key changes in board exams 2025
- tenth students alert
- tenth question paper
- tenth question paper leakage
- tenth question paper leakage warning
- education department warning
- tenth paper leak issue serious action
- serious warning
- education department key changes in board exams
- key changes in telangana board exams
- key changes in telangana 10th class examination 2025
- changes in board exam mark system
- safety methods for question papers of ts tenth board 2025
- Education News
- Sakshi Education News