రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఏప్రిల్ 7 నుంచి 14 వరకూ 1–9 తరగతుల విద్యార్థులకు సమేటివ్ అసెస్‌మెంట్ నిర్వహించాలని తేలంగాణ పాఠశాల విద్యాశాఖ మార్చి 30న ఆదేశాలు జారీ చేసింది.
1 – 9 తరగతులకు సమేటివ్ టెస్ట్ తేదీలు విడుదల
తరగతులవారీగా పరీక్ష సమయాన్ని కేటాయిస్తూ సమగ్ర కాలపట్టికను విడుదల చేసింది. 5వ తరగతిలోపు విద్యార్థులకు ఉదయం, మిగతా వారికి మధ్యాహ్నం పరీక్షలు నిర్వహిం చాలని పేర్కొంది. ఫలితాలను ఏప్రిల్ 21న వెల్లడించి, 23న విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేయాలని సూచించింది.