Skip to main content

TS 10th Supplementary Exam Time Table 2025 : ప‌దో త‌ర‌గ‌తి సప్లిమెంటరీ పరీక్షల తేదీలు ఇవే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఇటీవ‌ల రెగ్యులర్ టెన్త్ ప‌బ్లిక్ పరీక్షల ఫలితాలను తెలంగాణ‌ సీఎం రేవంత్‌రెడ్డి విడుద‌ల చేసిన విష‌యం తెల్సిందే.
Telangana 10th Supplementary Exams Time Table

ఈసారి టెన్త్‌ ఫలితాల్లో 92.78 శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది. అయితే పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు తెలంగాణ ఎస్‌ఎస్‌సీ బోర్డు మరో అవకాశం కల్పించింది. ప‌దో త‌ర‌గ‌తి సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. మొత్తం 5 లక్షలకు పైగా విద్యార్థులు పరీక్షలు రాయగా, అందులో 4,60,519 మంది (92.78 శాతం) విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అయితే పరీక్షల్లో ఫెయిల్‌ అయిన విద్యార్థులు నిరాశ చెందాల్సిన పనిలేదు. 

టెన్త్  సప్లిమెంటరీ ప‌రీక్ష‌ల తేదీలు ఇవే..
2025 జూన్‌ 3న ప్రథమ, 4న ద్వితీయ భాష, 5న ఆంగ్లం, 6న గణితం, 9న భౌతికశాస్త్రం, 10న జీవశాస్త్రం, 11న సాంఘికశాస్త్రం పరీక్షలు జరుగుతాయి. 12, 13 తేదీల్లో ఓరియంటల్‌ లాంగ్వేజ్‌ పరీక్షలు ఉంటాయి.ఈ ప‌రీక్ష‌లు జూన్ 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డు ప్రకటించింది. 

పరీక్షలకు ద‌ర‌ఖాస్తు చేసుకోవాలనుకునే విద్యార్థులు మే 16 లోగా...

టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలకు ద‌ర‌ఖాస్తు చేసుకోవాలనుకునే విద్యార్థులు మే 16 లోగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇక రీకౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌ కోసం మే 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం సబ్జెక్టుకు రూ.500 చొప్పున చెల్లించి రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. అదే రీవెరిఫికేషన్‌ కోసం అప్లై చేయాలంటే ఒక్కో సబ్జెక్టుకు రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. 

➤☛ UPSC Civils All India 11th Ranker Sai Shivani : తెలుగు రాష్ట్రాల్లో.. UPSC సివిల్స్‌లో 1st Rank.. TSPSC గ్రూప్‌-1 టాప్ ర్యాంక్ కొట్టానిలా.. | నా స‌క్సెస్ సీక్రెట్‌.. ఫార్ములా ఇదే..

Published date : 02 May 2025 04:14PM

Photo Stories