Ankit: విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలి
గోవిందరావుపేట మండల పరిధిలోని కర్లపల్లి గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలను అక్టోబర్ 3న సాయంత్రం పీఓ ఆకస్మికంగా సందర్శించారు. ఆ సమయంలో విద్యార్థులు స్టడీ అవర్స్‌లో ఉండగా ఉపాధ్యాయులు సమయానికి వస్తున్నారా.. మెరుగైన భోజనం పెడుతున్నారని అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పదో తరగతి విద్యార్థుల తరగతి గదులను పరిశీలించారు. రోజువారీగా విద్యార్థులు డైరీ విధానాన్ని, గత సంవత్సరం పదో తరగతి విద్యార్థుల ఫలితాలను వార్డెన్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ ఏడాది పదో తరగతి చదివే విద్యార్థులు 100శాతం ఉత్తీర్ణత సాధించే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు.
చదవండి: Telangana Central Tribal University: తెలంగాణకు గిరిజన యూనివర్సిటీ!
పాఠశాల ఆవరణను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు రోగాలు రాకుండా పాఠశాల సిబ్బంది ఉపాధ్యాయులు శ్రద్ధ వహించాలన్నారు. జీసీసీ నుంచి వచ్చే వస్తువుల క్వాలిటీపై ఆరా తీశారు. నాణ్యమైన కూరగాయలను వండి వడ్డించాలని వార్డెన్‌ను ఆదేశించారు. పాఠశాలలో వాటర్ ప్లాంట్ మరమ్మతులో ఉన్న విషయాన్ని తెలుసుకొని వార్డెన్‌ను మందలించారు. వెంటనే సంబంధిత గణాంక అధికారి రాజ్ కుమార్‌కు ఫోన్ చేసి మరమ్మతులు చేయించాలని ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఏఎన్‌ఎంను అడిగి తెలుసుకున్నారు. విష జ్వరాలు సోకితే వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లి మెరుగైన వైద్యం అందేలా చూడాలన్నారు.