Skip to main content

పంద్రాగస్టు నుంచి బడుల్లో ‘తొలిమెట్టు’

పాఠశాల విద్యాశాఖ ఆగస్టు 15 నుంచి ప్రాథమిక పాఠశాలల్లో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది.
first step program for school students
పంద్రాగస్టు నుంచి బడుల్లో ‘తొలిమెట్టు’

ఇటీవల నిర్వహించిన జాతీయ సర్వేలో విద్యార్థుల సామర్థ్యాలు సన్నగిల్లినట్టు తేలడం, కనీస పరిజ్ఞానం కన్నా తక్కువ ఉన్నారని గుర్తించడంతో ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేయాలని ప్రతిపాదించారు. ‘తొలిమెట్టు’ పేరుతో నిర్వహించే ఈ కార్యక్రమంలో మౌ లిక అక్షరాస్యత, గణిత సామర్థ్యాల సాధనకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. లెక్కల్లో బేసిక్స్‌తో పాటు, కొత్త విధానంలో చేసేలా ప్రత్యేక మెళకువలు నేర్ప నున్నారు. సొంతంగా చదవడం, రాయడం నేర్పిస్తారు. కూడికలు, తీసివేతలు, భాగహారాలు, గుణకారాలు, పూర్వసంఖ్యా భావనలు, ఆకారాలు, పరిమాణా లు, కొలతలు తదితర గణితాంశాలపై శిక్షణ ఇస్తారు. దీనిపై సెంట్రల్‌ స్క్వేర్‌ ఫౌండేషన్‌ సహకారంతో తేలంగాణ రాష్ట్రస్థాయిలో ఏర్పాటు చేసిన రిసోర్స్‌ పర్సన్‌కు ఇప్పటికే ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఆగస్టు 15న తల్లిదండ్రులను కూడా పాఠ శాలలకు ఆహ్వానించి కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. జూలై 26 నుంచి 28 వరకు జిల్లాలో, జూలై 30 నుంచి ఆగస్టు 11వరకు మండల, క్షేత్రస్థాయిల్లో ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తారు. ఇందుకు సంబంధించిన సమగ్ర వివరాలతో తెలంగాణ‌ పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక షెడ్యూల్‌ను పాఠశాలలకు పంపింది. 

చదవండి: 

Published date : 23 Jul 2022 01:31PM

Photo Stories