Dibyanu: ‘సాక్షి’ స్పెల్‌బీలో మెరిసిన మౌంట్‌బాసిల్ విద్యార్థి
Sakshi Education
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాఠశాల స్థాయిలో చదువుతున్న విద్యార్థులకు ఇంగ్లిష్‌పై మక్కువ పెంచేలా ‘సాక్షి’ మీడియా గ్రూప్ ఆధ్వర్యలో గత నెల వివిధ స్థాయిల్లో నిర్వహించిన స్పెల్‌బీ పోటీల్లో జిల్లా నుంచి వేల సంఖ్యలో విద్యార్థులు పాల్గొని పరీక్ష రాశారు.

ఈ మేరకు రాష్ట్రస్థాయిలో జరిగిన స్పెల్ బీ పరీక్షకు జిల్లాకేంద్రంలోని మౌంట్‌బాసిల్ పాఠశాలలో 4వ తరగతి దచవుతున్న విద్యార్థిని దిబ్యాను సత్తాచాటారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని రవినారాయణ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థినికి కాంస్య పతకం, నగదు బహుమతి అందజేశారు.
చదవండి: Kudala Srinivas: ఏకంగా నాలుగు ఉద్యోగాలు సాధించిన యువకుడు
ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం విద్యార్థిని ఆమె తల్లిదండ్రులను శాలువాతో సన్మానించారు. అనంతరం పాఠశాల డైరెక్టర్ శిరీష మాట్లాడుతూ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు సబ్జెక్టు విషయాలతోపాటు పోటీ పరీక్షలో సత్తా చాటే విధంగా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ చంద్రకళా వెంకటయ్య, డైరెక్టర్స్ పూజితా మోహన్‌రెడ్డి, శిరీష ప్రవీణ్, సుశాంత్‌కృష్ణ, ప్రిన్సిపాల్ సోమశేఖర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
![]() ![]() |
![]() ![]() |
Published date : 27 Jan 2025 08:49AM