BC గురుకుల 6,7,8 తరగతుల ఖాళీల భర్తీ ప్రవేశ పరీక్షా ఫలితాలు విడుదల
Sakshi Education
Telangana: BC గురుకుల పరీక్షా ఫలితాలు విడుదల
BC Gurukula Entrance Test Results Released
మహాత్మా జ్యోతిబాఫూలే బిసి గురుకుల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 6,7,8 తరగతుల భర్తీ కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలు బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, బిసి సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఐఎఎస్ గురువారం విడుదల చేశారు. పరీక్ష ఫలితాలు https://mjptbcwreis.telangana.gov.in వెబ్ సైట్లో చూసుకోవచ్చని సంస్థ కార్యదర్శి డాక్టర్ మల్లయ్య బట్టు తెలిపారు. గడువు తేదీ లోగా కేటాయించిన స్కూల్లో రిపోర్ట్ చేయాలని ఆయన సూచించారు.