పిట్లం(జుక్కల్): ప్రభుత్వం తమ సమస్యలు తీర్చకపోవడంతో సెప్టెంబర్ 11 నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్లు సెప్టెంబర్ 5న స్థానిక తహసీల్దార్ రాంమోహన్‌రావ్‌కు అంగన్‌వాడి టీచర్లు వినతి పత్రం అందజేశారు.
సమ్మెలోకి అంగన్‌వాడి టీచర్లు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు సమ్మె చేయబోతున్నామని తెలిపారు. అంగన్‌వాడి టీచర్లకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, ఉద్యోగభద్రత కల్పించాలని కోరారు. ప్రధానమైన డిమాండ్లతో ఉన్నతాధికారులకు అనేక సార్లు వినతి పత్రాలు కూడా ఇచ్చామని, అయినా సమస్యలు పరిష్కరించకపోవడంతో సమ్మెకు పూనుకోబోతున్నట్లు వివరించారు. టీచర్లు కుమ్మరి రాధ, అనురాధ, రాజమణి, తదితరులు పాల్గొన్నారు.