Skip to main content

మనకు ఎముకలు ఎన్ని?

Tenth Classశిశువు పుట్టినపుడు 300 ప్రత్యేకమైన ఎముకలు ఉంటాయి. శిశువు పెరుగుతున్న కొలదీ కొన్ని ఎముకలు కలిసిపోతాయి. యువకుడైన వ్యక్తి అస్థిపంజరాన్ని పరిశీలించినపుడు 206 ఎముకలు ఉంటాయని తెలుసుకోవచ్చు.

కపాలం అనేక ఎముకలతో తయారైంది. ఇది మెదడును సంరక్షిస్తుంది. వెన్నెముక 24 వేరువేరు ఎముకలతో తయారైంది. ఇందులో 7 మెడ దగ్గర, 12 వీపు దగ్గర, 5 ఉదరం వెనుక భాగంలో ఉంటాయి. వీటిని వెన్నుపూసలు అని కూడా అంటారు.

ఛాతీ చుట్టూ 12 జతల ఎముకలు రక్షణ కవచంలా ఉంటాయి. వీటిలో ఎక్కువ ఎముకలు ఛాతీమధ్యలో ఉండే శ్వాస ఎముకలు కలపబడివుంటాయి.

చేతులు, కాళ్ల ఎముకలు పొడవుగానూ, దృఢంగానూ ఉంటాయి. మణికట్టు, చేతులలో 8 ఎముకలు ఉంటాయి. చేతివేళ్లలో 15 ఎముకలు ఉంటాయి. కాళ్లకు ఉండే ఎముకలు చేతి ఎముకల కంటే దృఢంగా ఉంటాయి. శరీరంలోకెల్లా పెద్దదైనది, బలమైనది తుంటి ఎముక, ఎముకలలో ముఖ్యంగా క్యాల్షియం, ఫాస్పరస్ ఉంటాయి. మనిషి తగిన ఆహారం తీసుకుంటూ జీవితాంతం ఎముకలను దృఢంగా, బలంగా ఉంచుకోవాలి.
Published date : 13 Nov 2013 10:21AM

Photo Stories