Skip to main content

కుందేలు ప్రత్యేకతలు ఏమిటి?

Tenth Classకుందేలు జాతికి చెందిన జంతువులు మొట్టమొదట ఉత్తర అమెరికాలో జీవించాయి. తర్వాత ఇవి ప్రపంచమంతటా నివాసం ఏర్పరచుకున్నాయి. ప్రస్తుతం కుందేళ్లు దాదాపు 50 జాతులు వరకు ఉన్నాయి.

కుందేలు చాలా బలహీనమైనది, ఇది పిరికి జంతువు, చిన్న చిన్న శబ్దాలకే ఉలిక్కిపడి పారిపోతుంటుంది.

కుందేలు శరీరం కుచ్చు వంటి వెంట్రుకలతో నిండివుండి సుతిమెత్తగా ఉంటుంది. దీనికి పెద్దచెవులు ఉంటాయి. చిన్న చిన్న శబ్దాలను కూడా సులువుగా గ్రహించడానికి ఈ పెద్దపెద్ద చెవులు బాగా ఉపయోగపడతాయి. విశాలమైన వీటి బాహ్య చెవి ఎక్కువ శబ్దాలను గ్రహించగలుగుతుంది. గ్రహించిన శబ్దాలను లోపలి చెవిలోనికి ప్రసరింపజేస్తుంది. అందువల్ల శబ్దం వినగానే కుందేలు పారిపోతుంది. కుందేళ్లకు ముందరి కాళ్లు పొట్టిగా, వెనక కాళ్లు పొడవుగా ఉంటాయి. అందువల్ల ఇవి వేగంగా పరుగెత్తగలవు. కుందేళ్లు గంటకు 65 కిలోమీటర్ల వేగంతో పరుగెత్తగలవు.

ఇవిగడ్డి, గరిక, ఆకులు, దుంపలు, కూరగాయలను ఇష్టంగా తింటాయి. కుందేళ్లకు సంతానోత్పత్తి శక్తి ఎక్కువ. కుందేలు 40 రోజులలోనే కుందేలు పిల్లలకు జన్మనిస్తుంది. కుందేలు సగటున ఏడాదికి 10 నుండి 12 పిల్లలకు జన్మనిస్తుంది.
Published date : 13 Nov 2013 11:00AM

Photo Stories