Skip to main content

యు.ఎస్.లో మెడిసిన్‌కి ఎలా ప్రిపేర్ అవ్వాలి?

నేనిప్పుడు టెన్త్ గ్రేడ్‌లో ఉన్నాను. యు.ఎస్.లో మెడిసిన్ చెయ్యాలంటే ఏ కోర్సులకు ప్రిపేర్ అవ్వాలి?

టెన్త్ గ్రేడ్‌లో ఉండగానే ఈ విషయాలు ఆలోచిస్తున్న షైనీని ముందుగా అభినందించాలి. అమెరికాలో ఏ కోర్సు చెయ్యాలన్నా చాలా ముందుగా ప్లాన్ చేసుకోవాలని మొదటి నుంచీ చెబుతూనే వస్తున్నాను. అయినా చాలామంది ఆలస్యంగా ఆలోచన చేసి, ఇంకా ఆలస్యంగా ప్రాసెస్ మొదలుపెట్టి

ఇబ్బందుల్లో పడడం తరచు చూస్తూనే ఉన్నాను. ఇటువంటివారందరికీ షైనీ ఆదర్శం. షైనీ లాంటి వారు ఇప్పటికే ‘హలో అమెరికా’ లో దీనిపై నేను రాసిన కొన్ని వివరాలను ఇక్కడ ఇస్తున్న వెబ్‌లింగ్ ని అనుసరించి ‘సాక్షి’ ఆర్కైవ్స్‌లో ముందుగా చదవాలి.

https://www.sakshi.com/Main/ Dailydetails.aspx? Newsid=52159& Categoryid=30& subcatid=0ఇక ఆ

తర్వాత గమనించవలసిన ముఖ్యమైన అంశాలేమిటంటే-యు.ఎస్.మెడికల్ స్కూల్స్‌లో ప్రవేశం లభించడం విదేశీ విద్యార్థులకు చాలా కష్టం. అలాగే బాగా సంపన్న విద్యార్థులైతే తప్ప అమెరికాలోని మెడికల్ స్కూల్స్‌లో ఖర్చుని తట్టుకోలేరు. విదేశీ విద్యార్థులకు అక్కడ మెడికల్ స్కూల్‌లో ఫండింగ్ అవకాశాలు కూడా ఉండవు. అసోసియేషన్ ఆఫ్ అమెరికన్ మెడికల్ కాలేజెస్ అంచనా ప్రకారం 2011 లో యు.ఎస్. మెడికల్ స్కూల్స్‌కి అప్లయ్ చేసిన విదేశీ

విద్యార్థులలో దాదాపు 88 శాతం మంది అడ్మిషన్లు పొందలేకపోయారు. విదేశీ విద్యార్థులకు ఒక్కో యు.ఎస్. మెడికల్ స్కూల్‌లో ఎలాంటి అవకాశాలున్నదీ తెలుసుకోవాలంటే ‘నేషనల్ ఆసోసియేషన్ ఆఫ్ అడ్వైజర్స్ ఫర్ ది హెల్త్

ప్రొఫెషన్స్’ వెబ్ సైట్ (https://www.naahp.org/) చూడవచ్చు. ఇక మెడికల్ స్కూల్ అడ్మిషన్ టెస్ట్ (ఎం-కాట్) వివరాలను

https://www.aamc.org/ students/applying/mcat/ వద్ద క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. విదేశీ విద్యార్థులకు ఇంగ్లిష్ ఫ్లూయెన్సీ టెస్ట్

వివరాలను https://www.ets.org/toefl వద్ద చూడవచ్చు. ఇక షైనీ లాంటి ముందుచూపున్న విద్యార్థులు ఇంకొక కీలకమైన అంశం మీద శ్రద్ధ చూపాలి. విదేశీ విద్యార్థులను చేర్చుకునే అతికొద్ది యు.ఎస్. స్కూల్స్ కూడా యు.ఎస్‌లో బాచిలర్స్ డిగ్రీ చేసిన వారిని లేదా కనీసం యు.ఎస్.లో ఒక ఏడాది కోర్సు వర్క్ చేసినవారిని మాత్రమే పరిగణన లోకి తీసుకుంటాయి.

ఆ కోర్సు వర్క్ విజ్ఞానశాస్త్రాలలో చేసి ఉండాలని యు.ఎస్ మెడికల్ స్కూల్స్ ఆశిస్తాయి. ఇప్పటికే యు.ఎస్ వెలుపల అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ

పూర్తిచేసినవారు లేదా చేస్తున్నవారు అమెరికాలోని ఒక విద్యాసంస్థలో ఒక ఏడాది కోర్సు వర్క్‌కి ప్లాన్ చేసుకుంటే మంచిది. దానివల్ల ఆ తర్వాత యు.ఎస్.

మెడికల్ స్కూల్ అడ్మిషన్‌కి అవసరమైన ఒక ముఖ్యమైన ముందస్తు అవసరాన్ని విదేశీ విద్యార్థులు పరిపూర్తి చెయ్యగలుగుతారు. ఎం.డి./పిహెచ్.డి. ఉమ్మడి ప్రోగ్రామ్‌లు కూడా యు.ఎస్.మెడికల్ స్కూల్స్‌లో అందుబాటులో ఉన్నాయి. వీటి లో ప్రవేశం పొందగలిగిన వారికి మాత్రం ఫండింగ్ లభించడం కష్టం కాదు.

విదేశీ విద్యార్థులు కొందరు ఈ మార్గాన్ని అనుసరిస్తారు. యు.ఎస్. లో కొన్ని విద్యాసంస్థలు మొదట ఒక అండర్ గ్రాడ్యుయేట్ ప్రీ-మెడికల్ కోర్సుని, ఆ

తర్వాత దాని నుంచే కొనసాగించే గ్రాడ్యుయేట్ ఎం.డి. ప్రోగ్రామ్‌ని మొత్తం ఆరు నుంచి ఎనిమిదేళ్ళ కాలానికి ఆఫర్ చేస్తాయి. ఈ ఆప్షన్‌ని కూడా

పరిశీలించవచ్చు. అయితే ఇదంతా కూడా లక్షల డాలర్లని యు.ఎస్. మెడికల్ స్కూల్స్‌కి చెల్లించగల స్థోమత ఉన్నవారికి మాత్రమే అనేది కొంత

నిరుత్సాహం కలిగించినా తెలుసుకుని తీరవలసిన ఒక వాస్తవం!

Published date : 25 Mar 2013 01:57PM

Photo Stories