వ్యవసాయ కోర్సులలో పెరుగుతున్న అడ్మిషన్‌లు
యు.ఎస్.లో అగ్రికల్చర్ సైన్స్ సంబంధిత కోర్సులైనా, ఇంజనీరింగ్, ఎం.బి.ఏ.లాంటి కోర్సులైనా విదేశీ విద్యార్థులకి కామన్ స్టెప్స్ కొన్ని ఉంటాయి. ఇంట్రస్ట్‌కి అనుగుణంగా ఉండే కోర్సుని ఎంచుకోవడం వెసులుబాటుకి తగిన యూనివర్శిటీని సెలెక్ట్ చేసుకోవడం ఆ ప్రాంతంలో మన విద్యార్థులు ఎవరైనా ఉన్నారా? బంధువులు ఎవరైనా ఉన్నారా? అక్కడి వాతావరణ పరిస్థితులు ఏమిటి? క్యాంపస్ బయట ఉండేట్లయితే అక్కడి అపార్ట్‌మెంట్ రెంటల్స్ ఎలా ఉన్నాయి? రవాణా సదుపాయాల పరిస్థితి ఏమిటి? ఆ యూనివర్శిటీ ర్యాకింగ్ ఏమిటి? ఫీజులు, లివింగ్ ఎక్స్‌పెన్స్ ఎలా ఉంటాయి? యూనివర్శిటీకి సెవిస్ గుర్తింపు అక్రెడిటేషన్ రీసెర్చ్, ఫీల్డ్‌డర్క్, హ్యాండ్-ఆన్ ప్రయోగాలకు వసతులు, ఇండియాకి తిరిగి వెళ్లాక యు.ఎస్.లో చేసిన కోర్సుకి అక్కడ గుర్తింపు, అవకాశాలు యు.ఎస్.లో ఎంచుకునే కోర్సుకి సంబంధించి భారత ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని ఇచ్చిన మార్గదర్శకాలు ఏమైనా ఉంటే, అవి. ఇవి, అగ్రికల్చర్ సైన్స్ రంగాలలో యు.ఎస్.లో అడ్మిషన్‌లకి ప్రయత్నించే స్టూడెంట్స్ పరిశీలించవలసిన అంశాలు.
అమెరికాలో అగ్రి సైన్స్‌లో గ్రాడ్యుయేట్ ప్రోగామ్ తర్వాత ఎం.ఏ., ఎం.ఎస్., పిహెచ్.డి. ఉంటాయి. ఎం.ఏ. డిగ్రీ ప్రోగ్రాం దాదాపు రెండేళ్లు ఉంటుంది. పీహెచ్‌డీకి బ్యాచిలర్స్ తర్వాత 5 నుంచి 8 ఏళ్లు పడుతుంది. అగ్రికల్చరల్ సైన్స్ ఫీల్డ్‌లో అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, ఆగ్రో ఫిజిక్స్, యానిమల్ సైన్స్, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, ఫుడ్ సైన్స్, వాటర్ మేనేజ్‌మెంట్, సాయిల్ సైన్స్‌లాంటివి దాదాపు అన్ని అగ్రిస్కూల్స్‌లోనూ ఉంటాయి. https://www.usief.org.in/ C…M> https://www.usief. org.in/ UsefulLinks.aspx AÌêVóS https://educationusa.state.gov/వెబ్ లింకులలో విద్యార్థులకు కావలసిన విలువైన సమాచారం దొరుకుతుంది. https://www.petersons.com/graduate-schools/searchresults.aspx?అనే ‘పీటర్సన్స్’ వెబ్ లింక్ ఓపెన్ చేసి అగ్రిసైన్స్‌లో ఎంచుకున్న బ్రాంచ్ పేరు సెర్చ్ బాక్స్‌లో టైప్ చేస్తే, అందుబాటులో ఉన్న స్కూల్స్ వివరాలు కనిసిస్తాయి. ‘అగ్రిరల్చరల్ సైన్స్’ అనేది సెర్చ్ చేస్తే అది 741 గ్రాడ్యుయేట్ స్కూల్స్‌లో ఉన్నట్టు సమాచారం వస్తుంది. వాటిలో మీరు ఎంచుకున్న స్కూల్ వివరాల్లోకి వెళ్లి అడ్మిషన్ ప్రొసీజర్స్‌ని మళ్లీ సెర్చ్ చేసుకోవాలి. ఆ రకంగా ఒక నమూనాగా ఫోర్ట్ కాలిన్స్‌లోని కొలరాడో స్టేట్‌యూనివర్శిటీని సెర్చ్‌చేస్తేhttps://graduateschool.colostate.edu/ prospective-students/apply/ international-materials-checklist.aspx విదేశీ విద్యార్థుల సౌలభ్యం కోసం ఆ యూనివర్శిటీ రూపొందించిన ‘ఇంటర్నేషనల్ అప్లికేషన్ మెటీరియల్ చెక్ లిస్టు’ కనిపిస్తుంది.
యు.ఎస్.లో వ్యవసాయ పరిశ్రమల రంగం ‘బూమ్’లో ఉంది. ఇందులో ఉపాధి అవకాశాలకు కొత్త కిటికీలు తెరుచుకుంటున్నాయి. అందువల్ల అక్కడ విద్యార్థులు అగ్రి కాలేజీలలో చేరడం ఎక్కువైంది. పన్ స్టేట్ యూనివర్శిటీలో అగ్రిసైన్స్‌లో అడ్మిషన్లు 40 శాతం వరకు పెరిగాయి. అగ్రిసైన్‌లోని అనేక ఉపవిభాగాలకు ఇప్పుడు ఏర్పడుతున్న ప్రాధాన్యతని చూస్తుంటే వ్యవసాయం, పాడి పశువులే అనుకునే రోజులు వెళ్లిపోయాయనక తప్పదు... అని వాషింగ్టన్‌లోని ఒక విద్యావేత్త వ్యాఖ్యానించారు.
ప్రపంచంలోని ఆకలిని నివారించడానికి 2050 నాటికి ప్రపంచ వ్యవసాయ ఉత్పాదనలో 70 శాతం పెరుగుదల ఉండాలని నిపుణులు చెబుతున్నారు. అగ్రిసైన్స్ రంగంలో విద్యార్థులకు ఉన్న భవిష్యత్ అవకాశాలకు ఇది సూచిక. అగ్రికల్చరల్ కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ లాంటి అత్యాధునిక విభాగాలు ఆవిర్భవిస్తున్న అగ్రిసైన్స్ రంగంలో కోర్సుల్ని ఎంచుకోవడంలో స్టూడెంట్స్ స్మార్‌్‌గా ఉండాలి. యు.ఎస్‌లో శరీర బరువు పెరిగే ‘ఒబేస్ పీపుల్’ ఎక్కువవుతున్నారు. ఈ సమస్యని నివారించడానికి అగ్రిసైన్స్‌లోని కొన్ని రంగాలు ఉపయోగపడడంతో రానున్న రోజులలో అగ్రి సైన్స్ విద్యార్థులకు ఇది ఆశావహమైన ఏరియా అవుతుందంటున్నారు!