విస్తరిస్తున్న నానో టెక్నాలజీ కోర్సులు!
అమెరికాలో అవకాశాలు వికసిస్తున్న టాప్ మేజర్స్ జాబితాలోకి ఎక్కిన నానో టెక్నాలజీ మిగతా రంగాలతో పోల్చితే యంగ్‌సైన్స్ అని చెప్పాలి. యు.ఎస్‌లో మొట్టమొదటి నానో గ్రాడ్యుయేట్ ప్రోగ్రాములను 2004లో యూనివర్సిటీ ఆఫ్ ఆల్బనీ సనీ న్యూయార్కు ప్రారంభించింది. డ్రైక్సేల్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ ఫ్లోరిడాలాంటివి నానో-టెక్ కోర్సుల్ని తర్వాతి కాలంలో మొదలుపెట్టాయి. అతి సూక్ష్మ ఇంజనీరింగ్ ప్రక్రియలతో అద్భుతాలు సృష్టించే నానో టెక్నాలజీలో ఒకటి నుంచి వందవరకు ఉండే నానోమీటర్ స్కేలు మీద వస్తువులను చూసి, కొలిచి రూపాంతరం చేస్తారు. ఒక నానో మీటర్ అంటే ఒక మీటర్‌లో నూరు కోట్ల వంతు అని చెబితే ఇది ఎంతటి సూక్ష్మ సాంకేతిక పరిజ్ఞానమో అర్థమవుతుంది.
(ఒక హ్యూమన్ హెయిర్ లక్ష నానో మీటర్ల వెడల్పు ఉంటుంది.) నానో టెక్నాలజీ వల్ల భవిష్యత్తులో భవనాలు, వంతెనలను అతి తక్కువ బరువు ఉండే మిక్కిలి పటిష్టమైన పదార్థాలతో నిర్మించడం సాధ్యమవుతుంది. ఈ సైన్సుతో విషప్రభావం గల ఔషధాలను శరీరంలోని ఇతర భాగాలకు ఏమాత్రం హాని జరగకుండా నేరుగా ట్యూమర్స్‌లోకి పంపించవచ్చు. మరింత గట్టిగా ఉండే కృత్రిమ దంతాలకు జీవం పోసే ఈ సైన్సు డెంటిస్ట్రీ రంగానికి కూడా ఒక వరం అవుతుంది. దీర్ఘకాలం పనిచేసే బ్యాటరీలు, సోలార్ ప్యానల్స్, గీతల్ని నిరోధించే కారు పెయింట్లు, గుర్రాలు మరింత వేగంగా పరుగెత్తడానికి వీలు కల్పించే గోల్ఫ్ మైదానాల హై-టెక్ ఉపరితలాలు లాంటి వెయ్యికి పైగా కొత్త నానో అన్వేషణలు ఇప్పటికే యు.ఎస్. మార్కెట్లలో హల్‌చల్ చేస్తున్నాయి.
నానో-టెక్ కోర్సులకి యు.ఎస్‌లో అంకురార్పణ చేసిన యూనివర్సిటీ ఎట్ ఆల్బనీ మొదట 10 మంది విద్యార్థులతో నానో సైన్స్, నానో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ప్రోగ్రాములను మొదలుపెట్టి ఇప్పుడు వీటిలో 140 మందిని చేర్చుకునే స్థాయికి చేరుకుంది. ఈ యూనివర్సిటీలోని కాలేజ్ ఆఫ్ నానోస్కేల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (సి.ఎన్.ఎస్.ఇ.) నానోస్కేల్ ఇంజనీరింగ్‌లో ఎం.ఎస్.ని; పిహెచ్.డి /ఎం.డి. (డాక్టర్ ఆఫ్ మెడిసిన్)ని; నానోస్కేల్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌లో ఎం.ఎస్./ఎం.బి.ఏ.ని ఆఫర్ చేస్తోంది. ఇక్కడ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాములలో చేరడానికి ఫిజికల్, కెమికల్, బయలాజికల్, కంప్యూటర్ సైన్సులు; మేథమేటిక్స్, ఇంజనీరింగ్‌లలో బాకాలారియేట్ డిగ్రీ; జి.ఆర్.ఇ. జనరల్ టెస్ట్, టోఫెల్ ఐ.ఇ.ఎల్.టి.ఎస్ అవసరం. ఫాల్ అడ్మిషన్లకి ఫిబ్రవరి ఒకటిలోగా, స్ప్రింగ్ అడ్మిషన్లకి డిసెంబరు ఒకటిలోగా దరఖాస్తు చెయ్యాలి. విదేశీ విద్యార్థులకు వర్తించే అడ్మిషన్ రిక్వైర్‌మెంట్లకోసం ఇక్కడ ఇస్తున్న వెబ్ లింక్‌లోకి వెళ్ల వచ్చు.
https://cnse.albany.edu /PioneeringAcademics/GraduatePrograms/Admissions.aspx ఇక్కడ నానో -ఎం.బి.ఏ. డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ కూడా ఉంది. ఆ వివరాలకు https://cnse.albany.edu/ PioneeringAcademics/ GraduatePrograms/NanoMBA.aspx లింక్ చూడండి. నానో-టెక్ కోర్సులకి యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియా, యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినా ఎట్ చాపెల్ హిల్, ఫ్రూడ్ యూనివర్సిటీ కూడా యూనివర్సిటీ ఆఫ్ ఆల్బనీతో టాప్ యూనివర్సిటీల జాబితాలో ఉన్నాయి. ఇవికాక పోస్ట్-గ్రాడ్యుయేట్ నానో-టెక్ కోర్సులని ఆఫర్ చేస్తున్న మరికొన్ని ముఖ్యమైన యు.ఎస్. యూనివర్సిటీల పేర్లు- విద్యార్థులు గూగుల్ సెర్చ్ సౌలభ్యం కోసం ఇక్కడ చూడవచ్చు; ఆరెగాన్ స్టేట్ యూనివర్సిటీ/నార్త్ డకోటా స్టేట్ యూనివర్సిటీ/యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా (బెర్కిలీ, లాస్ ఏజిలిస్, శాన్‌డియాగో క్యాంపస్‌లు)/ ఆరిజోనా స్టేట్ యూనివర్సిటీ/ యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా/కార్నెల్ యూనివర్సిటీ/జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ/ యూనివర్సిటీ ఆఫ్ కనెక్టికట్/ రైస్ యూనివర్సిటీ/ప్లారిడాస్టేట్ యూని వర్సిటీ/లూజియానా టెక్ యూ నివర్సిటీ/ఫ్లోరిడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ/నార్త్ వెస్ట్రన్ పాలిటెక్నిక్ యూనివర్సిటీ/డార్ట్‌మౌత్ కాలేజ్/యూనివర్సిటీ ఆఫ్ డెన్వర్ / సౌత్ డకోటా స్కూల్ ఆఫ్ మైన్స్ అండ్ టెక్నాలజీ/ యూనివర్సిటీ ఆఫ్ న్యూమెక్సికో.
------------------------------------------------
2001 డీఎస్సీ ఉపాధ్యాయులు హాజరుకావాలి
వైవీయూ, న్యూస్‌లైన్ : డీఎస్సీ 2001లో వివిధ కేటగిరీలలో నియమించబడిన వారు సర్వీసు రెగ్యులరైజేషన్ నిమిత్తం ఈనెల 3వ తేదీన తన కార్యాలయంలో హాజరుకావాలని డీఈఓ అంజయ్య ఒక ప్రకటనలో తెలిపారు.
సర్వీసు వివరాల వెరిఫికేషన్ కోసం హాజరైన వారు, హాజరుకాని వారి వివరాలను కడప డీఈఓ.కాంలో ఉంచినట్లు ఆయన తెలిపారు. సర్వీసు వెరిఫికేషన్‌కు హాజరు కానివారు రెగ్యులరైజేషన్ ఫారం నింపి సర్వీసు రిజిష్టర్‌తో డిసెంబర్ 3న హాజరుకావాలని ఆయన సూచించారు.
---------------------------
కొత్తగా 40 డైట్ కళాశాలలు
పీలేరు(చిత్తూరు జిల్లా) న్యూస్‌లైన్: ఈ ఏడాది కడప జోన్‌లో కొత్తగా 40 నుంచి 50 డైట్ కళాశాలలు వచ్చే అవకాశం ఉందని కడప ఆర్‌జేడీ రమణకుమార్ తెలిపారు. బుధవారం ఆయన పీలేరు ఎమ్మార్సీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం 40 ైడైట్ కళాశాలలు ఉన్నాయని తెలిపారు. ఒక్కో కళాశాలలో 50 సీట్లు ఉంటాయని, ఇందులో 10 సీట్లు మాత్రమే మేనేజ్‌మెంట్ కోటా వుంటుందన్నారు. నవంబర్ 26వ తేదీ నుంచి డిసెంబర్ 3 వరకు డైట్ సెట్ ఆన్‌లైన్ కౌన్సెలింగ్ జరుగుతోందని చెప్పారు. ఈ ఏడాది జోన్ పరిధిలో టెన్త్ పరీక్షలకు 1.40 లక్షల మంది విద్యార్థులు హాజరవుతున్నారని తెలిపారు. తాము పంపిణీ చేసిన మెటీరియల్ చదివితే ఉత్తీర్ణత సాధిస్తారని, అయితే మంచి మార్కులు రావాలంటే పాఠ్యపుస్తకాలను చదవాలని సూచించారు.
గత ఏడాది టెన్త్ ఫలితాల్లో వైఎస్సార్ జిల్లా తొలి స్థానంలో నిలిచిందని, చిత్తూరు జిల్లా నాలుగో స్థానంతోనే సరిపెట్టుకుందన్నారు. అన్ని పాఠశాలల్లో మరుగు దొడ్ల నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన చేపట్టామన్నారు. జోన్ పరిధిలో 1700 మంది పీఈటీలను విద్యావలంటీర్లుగా తీసుకుంటున్నామని చెప్పారు. 100 మంది విద్యార్థులున్న ప్రతి యూపీ స్కూల్‌కు పీఈటీని నియమిస్తామన్నారు. పీలేరు మండలంలో కామాటంపల్లె ప్రాథమిక పాఠశాలను అకస్మికంగా తనిఖీచేశారు. పాఠశాల నిర్వహణ, విద్యార్థుల నిలకడ సక్రమంగా వుండేలా చర్యలు తీసుకోవాలని ఆదే శించారు. ఆయన వెంట ఆర్‌ఐపీఈ భానుమూర్తిరాజు, ఎంఈవో ఏటీ. రమణారెడ్డి, పీడీ ముత్యాలయ్యశెట్టి తదితరులు ఉన్నారు.
----------------------------
డిసెంబర్ 6 నుంచి సైన్స్ ఫేర్
వైవీయూ, న్యూస్‌లైన్ : డిసెంబర్ 6 నుంచి 8వ తేదీ వరకు అనంతపురం జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రాష్ట్రస్థాయి సైన్స్‌ఫేర్‌ను నిర్వహించనున్నట్లు డీఈఓ కె.అంజయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లాస్థాయిలో మొదటి బహుమతి పొందిన విద్యార్థులు ఈ పోటీలకు హాజరుకావాలన్నారు. ఒక ప్రదర్శనకు ఇద్దరు విద్యార్థులు, ఒక గైడ్ టీచర్‌ను మాత్రమే అనుమతిస్తామన్నారు. పూర్తి వివరాలకు 9246940687కు సంప్రదించాలని వివరించారు.
-----------------------
వచ్చే ఏడాది కేయూలో ఎంపీఈడీ కోర్సు
వరంగల్ స్పోర్ట్స్, న్యూస్‌లైన్: కేయూలో (2013-2014) వచ్చే విద్యా సంవత్సరానికి ఎంపీఈడీ కోర్స్‌ను ప్రారంభిస్తామని కాకతీయ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ బి.వెంకటరత్నం అన్నారు. క్రీడా కాంప్లెక్స్ నిర్మాణం పనులు కూడా ప్రారంభమయ్యాయన్నారు. కేయూ క్రీడా మైదానం లో ఇంటర్ కాలేజియేట్ ఖోఖో, వాలీబాల్ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ము ఖ్య అతిథిగా ఆయన మాట్లాడారు. ములుగు లో పీజీ, కళాశాలతో పాటుగా స్పోర్ట్స్ సెంట ర్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. యూనివర్శిటీ పో టీల్లో కొన్ని ఈవెంట్స్‌లో మాత్రమే పతకాలు వస్తున్నాయి.
మరిన్ని క్రీడాంశాల్లో పతకాల సాధనకు కృషి చేయాలన్నారు. కేయూ రిజిస్ట్రార్ సాయిలు మాట్లాడుతూ క్రీడల్లో పా ల్గొనడం ద్వారా వ్యక్తి వికాసం పెంపొందుతుందన్నారు. స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ దిగంబరరావు మాట్లాడుతూ చదువుతోపాటు క్రీ డానైపుణ్యతను పెంపొందించుకోవడం ద్వా రా భవిష్యత్‌లో ఉత్తమ ఫలితాలను సాధించవచ్చన్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా అంతర్జాతీయ ఖోఖో క్రీడాకారుడు జి.మధుకర్ మాట్లాడుతూ ఎంచుకున్న రంగంలో లక్ష్య సాధనతో కృషిచేస్తే సాధించలేనిది ఏమిలేదన్నారు. టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా క్టర్ రాధారపు శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ కే యూ పరిధిలోని వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లా నుంచి వచ్చిన వివిధ కళాశాలల జట్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయన్నారు.
ఈ పోటీలు ఈ నెల 29 వరకు జరుగుతాయ ని చెప్పారు. అనంతరం స్పోర్ట్స్ బోర్డ్ మాజీ సెక్రటరీ సక్రియాను ఘనంగా సన్మానిం చారు. కేయూ వ్యాయామ కళాశాల ప్రిన్సిపా ల్ డాక్టర్ మోయిజ్ అహ్మద్, యూనివర్సిటీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ కె.దామోదర్‌రావు, కేయూ పీఆర్‌ఓ కృష్ణమాచారి, పీడీలు పింగిలి రమేష్‌రెడ్డి, కేశబోయిన మధు, జే.సోమన్న, ఏటీబీటీ ప్రసాద్, పి.భాస్కర్, భాలశౌరి, అశోక్, రవి, వై.సురేందర్, రమేష్, బి.ప్రభాకర్, మధు, కిషన్ పాల్గొన్నారు.