Skip to main content

విజిటర్‌గా వెళ్ళి విద్యార్థిగా మారవచ్చా?

ఇండియాలోని యు.ఎస్ కాన్సులేట్ నుంచి మీరు బి-1/బి-2 (బిజినెస్/విజిటర్) వీసా తీసుకుని అమెరికాలో ప్రవేశించేటప్పుడు అక్కడ మీకు ఐ-94 ఇస్తారు. మీరు ఏ పని మీద యు.ఎస్. చేరుకున్నారో, అక్కడ ఎంతకాలం (ఏ డేట్ వరకు) ఉండవచ్చో అందులో స్పష్టంగా ఉంటుంది. మీరు చదువుకోవడానికి కాకుండా మరొక ఉద్దేశంతో అమెరికా చేరుకున్నట్టు దాని వల్ల క్లియర్‌గా తెలుస్తుంది.

అక్కడికి వెళ్లి తర్వాత మీరు మీ ఐ-94 గడువు తీరేలోగా బి-1/బి-2 నుంచి ఎఫ్-1 కి మారేందుకు అక్కడే యు.ఎస్.సి.ఐ.ఎస్.కి అప్లయ్ చేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం ఉండదు. అయితే ఇండియాలో మీరు వీసా కోసం వెళ్ళినప్పుడు అక్కడ (అమెరికాకు విజిటర్‌గా వెళ్ళడం గురించి) మీరు మొదట డిక్లేర్ చేసిన మీ ఉద్ధేశానికి అమెరికా వచ్చిన తర్వాత మారిన (స్టూడెంట్‌గా మారాలనుకున్న) మీ ఉద్దేశానికి మధ్య వ్యత్యాసాన్ని గమనించిన యు.ఎస్.సి.ఐ.ఎస్. మీకు ఎఫ్-1 స్టేటస్ ఇచ్చే అవకాశం నా అభిప్రాయం ప్రకారం ఒక్క శాతం కూడా ఉండదు.

అమెరికా చేరుకున్న తర్వాత మాత్రమే నాకు ఇక్కడ చదువుకోవాలనే ఉద్దేశం ఏర్పడిందని మీరు చెప్పుకోవాలనుకున్నా యు.ఎస్. సి.ఐ.ఎస్. దీని కోసం మిమ్మల్నే మీ ఇంటర్వ్యూ చెయ్యదు. మీరు సబ్మిట్ చేసిన మీ డాక్యుమెంట్లని బట్టే నిర్ణయం తీసుకుంటుంది.

ఒకప్పుడు విజిటర్స్ వీసాల మీద వెళ్ళిన వారు అక్కడే స్టూడెంట్ వీసాలకి మారడం అడపాదడపా జరుగుతుండేది. అయితే ఇప్పటి పరిస్థితులలో అది కుదరదు. కుదిరేటట్టయితే అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులు ఏడాదిన్నర ముందుగానే ప్రాసెస్ స్టార్ట్ చెయ్యడం, అహోరాత్రులు కష్టపడి చోఫెల్, జి.ఆర్.ఇ.ల్లో మంచి స్కోర్లు తెచ్చుకోవడం, ఆర్దిక వలరులు సమకూర్చుకోవడం, వీసా ఇంటర్వ్యూలకి ప్రిపేర్ అవ్వడం ఎందుకు? విజిటర్స్‌వీసా మీద వెళ్ళి అక్కడే యూనివర్సిటీలలో చేరిపోవచ్చు కదా? బి-1/బి-2ల మీద వెళ్లి ఎఫ్-1కి మారాలని చూసే వారిని ఇండియాలోని యు.ఎస్ కాన్సులేట్‌లలో సూడెంట్ వీసా ప్రాసెస్‌ని షార్ట్‌కట్‌లో తప్పించుకోవాలని చూసే వారుగా కూడా భావించవచ్చు. స్టూడెంట్ వీసా ప్రయత్నంలో పడి అక్కడ మీ ఐ-94 గడుపు తీరిపోయి మీరు అవుటాఫ్ స్టేటర్ అవ్వకుండా ముందు జాగ్రత్త పడండి.

మీరు మరి కొన్ని బ్యాంకులకు కూడా వెళ్లి నిబంధనలను గురించి మరింత వివరంగా తెలుసుకోండి. నేను ఒక బ్యాంక్ వెబ్‌సైట్‌లోకి వెళ్ళి వివరాలని పరిశీలించాను. విదేశీ విద్యాకు ఇచ్చే రుణాలకు ‘‘పేరెంట్స్ టు బి జాయింట్ బారోయర్స్, టాంజిబుల్ (దృఢమైన) కొలేటరల్ సెక్యూరిటీ ఆఫ్ సూటబుల్ వాల్యూ యాక్సెప్టబుల్ టు ది బ్యాంక్...’’ అని ఉన్నదేగాని వ్యవసాయ భూములకు ఇవ్వరని లేదు. అన్ని జాతీయ బ్యాంకులకు ఒకే మాదిరి నిబంధలలు ఉంటాయి కనుక వ్యవసాయ భూములకు ఇవ్వకూడదనే నిబంధన ఉన్నదని నేనుకోను. ఎటొచ్చీ మీ అగ్రికల్చరల్ లాండ్ కి మీ లోన్‌కి తగినంత వాల్యూ ఉండాలి.

అలాగే, మీ అకాడమిక్ రికార్డు, అడ్మిషన్ టెస్టు స్కోర్లు, మీరు ఎంచుకునే యూనివర్సిటీని బట్టి యు.ఎస్.లో మీకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ లభించే అవకాశాలేమిటో కూడా తెలుసుకోండి. అక్కడ చేరిన తర్వాత కొంత కాలానికి సి.పి.టిత., ఒ.పి.టి. ఆప్షన్లతో మీరు కొంత ఆదాయం పొందే అవకాశాలు ఉంటాయి. అయితే ముందుగా అమెరికాలో చదవడానికి అవసరమైన ఆర్థిక వనరులు లేకుండా మీకు కాన్సులేట్‌లు వీసా ఇవ్వలేదు. నిరుత్సాహ పడకుండా మీ ప్రయత్నాన్ని కొనసాగించండి. మరికొని బ్యాంకుల్ని కూడా అప్రోచ్ అవ్వండి.

యు.ఎస్‌లో ఉన్నత విద్య అనేది ఖర్చుతో కూడుకుని ఉన్నది కావడం వల్ల సాధారణంగా మందస్తుగా ఆర్థిక వనరులు సమకూర్చుకోవడం అవసరం. అడ్మిషన్ వచ్చిన తర్వాత కూడా సొంతగా ఆర్థిక వెసులుబాటు లేనివారికి జాతీయ బ్యాంకుల విద్యారుణాలు ఉపయోగపడవచ్చు. రోటరీ అంబాసిడోరియల్ స్కాలర్షిప్స్, జె.ఎన్. టాటా ఎండోమెంట్, ఐ.టి.సి. స్కాలర్షిప్స్, కె.జి. మహీంద్ర స్కాలర్షిప్ లాంటివి ఉన్నప్పటికీ అటువంటి వాటిలో కొన్ని అసాధారణ ప్రతిభావంతులకి, లేదా ఆ సంస్థలు ఎంపిక చేసిన రంగాలలో చదివే వారికి, లేదా కొన్ని నిర్ణీత విద్యా సంస్థలకు వెళ్ళేవారికి మాత్రమే లభిస్తాయి. కాంపిటీషన్‌కూడా ఎక్కువే. పైగా ఫీజు చెల్లించబోయే దశలో ప్రయత్నం మొదలు పెడితే సమయం చాలదు.

Published date : 15 Dec 2012 04:29PM

Photo Stories