Skip to main content

వెటరినరీ అడ్మిషన్స్: ఒన్, టు, త్రీ...స్టెప్స్

ఎంత గ్లోబలైజ్ అయినా, కంప్యూరైజేషన్ ఎంతగా విస్తరించినా వ్యవసాయం, గ్రామీమ పరిశ్రమలే ఇండియాకి జీవనాడి. పొలాలు దున్నే పశుగణం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ, చేపల వేట, ఆక్వా కల్చర్, గొర్రెల పెంపకం లాంటివి లేకుంటే ఇక్కడ కంప్యూటర్‌లకి పనే ఉండదు.

భారతీయ సైన్యంలో కూడా జంతువుల సేవలకు విశేష ప్రాధాన్యం ఉంది. ఇది చాలా మందికి లోతుగా తెలియని మరొక పార్శ్వం. టాంకులు, ట్రక్కులు, విమానాలు, హెలికాఫ్టర్లు వెళ్ళలేని కీలక హిమాలయ సరిహద్దు శిఖరాల్లో సైనికులకి ఆహారం, ఆయుధాలు గుర్రాలు, కంచర గాడిదల (మ్యూల్స్) మీదనే చేరవేస్తారు. బాబూగర్ (యు.పి.), హిస్సార్ (హర్యానా)లోని ‘ఈక్వైన్ బ్రీడింగ్ స్టెడ్’లు వెటరినరీ వైద్య శాస్త్రజ్ఞులు పర్యవేక్షణలో ఆర్మీకి అవసరమైన మేలురకం అశ్వ,గార్దభ జాతుల్ని నిరంతరం అభివృద్ది చేస్తుంటాయి. బరువులు మోయడానికి పేరు పొందిన గార్దభాల్లో మగ వాటిని ఆడ గుర్రాలతో జత కట్టి బాగా శక్తివంతమైన మ్యూల్స్‌ని రూపొందిస్తారు.

ఆర్మీ డాగ్స్ అయితే సరిహద్దులలో గార్డు డ్యూటీలు చెయ్యడంతో పాటు లాండ్‌మైన్స్‌ని వాసన పట్టి సైనికుల్ని కాపాడతాయి. మంచు పెళ్లల కింద చిక్కుకున్న పోల్జర్స్‌ని రక్షిస్తాయి. వ్యవసాయరంగంలో జంతుజాలంతో పనిచేసే వెటరినేరియన్లు దేశాభివృద్ధిలో ఎలా కీలక పాత్ర వహిస్తున్నారో ఆర్మీలోని వెటరినరీ డాక్టర్లు, సైంటిస్టులు కూడా దేశానికి అంతగా సేవ చేస్తున్నారు. కార్గిల్ యుద్ధలంఓ సైతం ‘ఆర్మీ వెటరినరీ కోర్ ’ పాత్ర ఎవరికీ తీసిపోదు. భారతీయ సైనికులలో మాంసాహారులైన లక్షలాది మందికి ‘ఆరీ రీమౌంట్ అండ్ వెటరినరీ కోర్’ కి చెందిన వెటరినేరియన్లు సర్టిపై చేసిన తర్వాత మాత్రమే సురక్షితమైన మాంసాహారం అందుతుందనేది కూడా మనలో చాలా మందికి అంతగా తెలియని విషయమే.

దేశ వ్యవసాయ, సైనిక రంగాలకి ఇంతగా ప్రయోజనే చేకూర్చుతున్న వెటరినేరియన్లు అమెరికా లాంటి చోట పై చదువులు చదివి ఈ రంగంలో ఆధునిక విజ్ఞానాన్ని సంపాదించి రాగలిగితే అది ఇండియాకి ఎంతో ప్రయోజనం చేకూర్చుతుంది. యు.ఎస్.లో వెటరినరీ మ8డిసిన్ చదవాలనుకున్న మన విద్యార్థులు మొదటగా అక్కడ ప్రీ-రిక్వయిర్డ్ (ముందుగా చదివి ఉండవలసిన ఆవశ్యకత ఉన్నా) సైన్స్/మాథ్స్ రంగాలలో బాచిలర్స్ డిగ్రీ చేసి ఉండాలి. తర్వాత అమెరికాలోని 28 గుర్తింపు పొందిన వెటరినరీ మెడిసిన్ స్కూల్స్‌లో ఏదో ఒక దానిలో సీటు సంపాదించాలి. పోటీ చాలా తీవ్రంగా ఉంటుంది. అక్కడ జనరల్ మెడిసిన్‌లో సీటు-- అది ఎంత కష్టమైన- దీని ముందు అదే తేలికే అనిపిస్తుంది.

యు.ఎస్‌లో వెటరినరీ స్కూల్స్ సంఖ్య చాలా తక్కువ. పైగా అందులో ఎక్కువ భాగం రాష్ట్రాల ఆర్థిక సహాయంతో నడుస్తుంటాయి కనుక ఆయా రాష్ట్రాల విద్యార్థులకు మొదటి ఫ్రిఫరెన్సు ఉంటుంది. తర్వాత ప్రాధాన్యం యు.ఎస్. సిటిజన్స్‌కి, పర్మనెంట్ రెసిడెంట్లకి. మిగిలిన కొద్ది సీట్లనే విదేశీ విద్యార్థులు పంచుకోవాలి. కొన్ని అమెరికన్ వెటరినరీ స్కూల్స్ ఫారిన్ స్టూడెంట్స్‌కి అసలు సీట్లే ఆఫర్ చెయ్యవు. ఎక్కడ సీట్లు ఉన్నదీ అయా వెట్ స్కూళ్ళ వెబ్ సైట్‌లలో చూసుకోవాలి. మంచి అండర్ గ్రాడ్యుయేట్ అకాడమిక్ రికార్డు, వెటరినరీ యాప్టిట్యూడ్ టెస్టు (వివరాలకు www.aavmc.org) ఎం-కాట్, జి.ఆర్.ఇ.ల్లో మంచి స్కోర్లు, ఇంగ్లిష్ ప్రొషిషియెన్సీ అవసరం, నాలుగేళ్ళు చదివాక డి.వి.ఎం, లేదా వి.ఎం.డి. గా పేర్కొనే డాక్టర్ ఆఫ్ వెటరినరీ మెడిసిన్ లభిస్తుంది.

మన ‘వెట్’లు అక్కడ యానిమల్ సైన్స్‌లలో గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌ల కోసం ప్రయత్నిస్తే కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది. వీరు వెటరినరీ డాక్టర్లు కాలేక పోయినా యూనివర్సిటీ రిసెర్చ్, టీచింగ్, ప్రభుత్వ రంగం, వ్యవసాయ పరిశ్రమలు, పరిశోధనలలో మంచి అవకాశాలు పొంద గలుగుతారు.

డి.వి.ఎం. చేసినవారు యు.ఎస్‌లో ప్రాక్టీస్ చెయ్యడానికి అమెరికన్ వెటరినరీ మెడికల్ అసోసియేషన్ (ఎ.వి.ఎం.ఏ.) నుంచి లెసైన్స్ పొందాలి. ఎ.వి.ఎం.ఏ అప్రువ్డ్ స్కూల్ నుంచి గ్రాడ్యుయేట్ కాని వారు ఇ.సి. ఎఫ్.వి.జి. (ఎడ్యుకేషనల్ కమిషన్ ఫర్ ఫారిన్ వెటరినరీ గ్రాడ్యుయేట్స్) ఆధ్వర్యంలోని 4-అంచెల క్వాలిఫయింగ్ ప్రోగ్రాంని పూర్తి చేయాలి. దాని తర్వాత మళ్ళీ నార్త్ అమెరికన్ వెటరినరీ లెసైన్సింగ్ ఎగ్జామినేషన్ (ఎన్.ఎ.వి.ఎల్.ఇ.)ని కూడా క్లియర్ చెయ్యాలి.

Published date : 21 Nov 2012 06:13PM

Photo Stories