జి.ఆర్.ఇ.కి సెల్ఫ్ ప్రిపరేషన్
‘‘జి.ఆర్.ఇ’ అని క్లుప్తంగా మన విద్యార్థుల నోళ్లలో నిత్యం నానుతుండే ‘గ్రాడ్యుయేట్ రికార్డ్ ఎగ్జామినేషన్’లో ఉత్తమమైన స్కోర్లు సంపాదిస్తేనే మనవాళ్లకి యు.ఎస్. యూనివర్సిటీలలో ఇంజనీరింగ్ (ఎం.ఎస్) సీట్లు దొరుకుతాయి. ఎం.బి.ఏ. అడ్మిషన్లకి జి.ఆర్.ఇ. స్కోర్లని ఆమోదించే యు.ఎస్. బిజినెస్ స్కూల్స్ సంఖ్య కూడా ఇప్పుడు పెరగడంతో జి.ఆర్.ఇ.కి మన విద్యార్థులలో డిమాండ్ ఇంకా ఎక్కువైంది. (హార్వర్డ్, స్టాన్‌ఫర్డ్, డార్ట్‌మౌత్, కొలంబియా బిజినెస్ స్కూల్ లాంటి అగ్రశ్రేణి యు.ఎస్. విద్యా సంస్థలు కూడా ఇప్పుడు ఎం.బి.ఏ. అడ్మిషన్లకి జి.ఆర్.ఇ.ని ఆమోదిస్తున్నాయి.) కాగా ఇంటర్నెట్ సదుపాయాల విస్తృతి వల్ల, ఇంకా టెక్నాలజీని సునాయాసంగా అందిపుచ్చుకునే ‘నెట్‌శావీ’ జనరేషన్ పెరగడం వల్ల జి.ఆర్.ఇ.కి తమకు తాముగా ప్రిపేర్ అవ్వాలనుకునే విద్యార్థుల సంఖ్య ఇప్పుడు ఎక్కువగానే ఉంటోంది. ఇక్కడ ఇస్తున్న కొన్ని ‘టిప్స్’ అటువంటివారికి చాలావరకు ఉపయోగపడతాయి. అయితే నిన్నటి ‘హలో అమెరికా’లో చెప్పినట్టుగా ఒక క్రమపద్ధతిలో బాగా హార్డ్‌వర్క్ చెయ్యగలిగిన వారు మాత్రమే జి.ఆర్.ఇ. లాంటి అడ్మిషన్ టెస్టులకి సొంతంగా ప్రిపేర్ అయ్యే ప్రయత్నం చెయ్యాలి. మిగతావారు ఉత్తమమైన కోచింగ్ సెంటర్లని ఎంచుకుని వాటిలో శిక్షణ పొందడమే మంచిది. పట్టుదలగా స్వయంశిక్షణ పొందాలనుకుంటే మాత్రం ఈ ‘టిప్స్’ని పరిశీలించవచ్చు.
1. ఈ టెస్టు గురించి మొదట వీలైనంత సమాచారం తెలుసుకోండి. ఇది వరకు అమలులో ఉన్న జి.ఆర్.ఇ. పరీక్షా విధానం స్థానంతో గత ఏడాది ఆగస్టు నుంచి ‘జి.ఆర్.ఇ. రివైజ్డ్ జనరల్ టెస్టు’ని ప్రవేశ పెట్టారు. పునర్వ్యవస్థీకరించిన ఈ పరీక్షలో మీ వెర్బల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ రీజనింగ్; క్రిటికల్ థింకింగ్, అనలిటికల్ రైటింగ్ స్కిల్స్‌ని అంచనా వేస్తారు. టెస్టు టైము దాదాపు మూడు గంటల నలభై అయిదు నిమిషాలు. 160కి పైగా దేశాలలో దాదాపు 700 టెస్ట్ సెంటర్లలో జి.ఆర్.ఇ. పరీక్షకి హాజరయ్యే అవకాశం ఉంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఏడాది పొడుగునా అందుబాటులో ఉంటుంది.
2. ఇ.టి.ఎస్. (ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్) జి.ఆర్.ఇ.ని నిర్వహిస్తుంది. సొంతగా టెస్టుకి ప్రిపేర్ అయ్యేవారి కోసం ఇ.టి.ఎస్. నుంచి ఉచితంగా కొన్ని సమాచార వనరులను, డబ్బు చెల్లింపుతో మరికొన్ని వనరులను పొందే వీలుంది. ఉచిత వనరులలో ‘మాథ్ రివ్యూ’ ఒకటి. ఇది 99 పేజీల పి.డి.ఎఫ్. డాక్యుమెంటు. ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జి.ఆర్.ఇ. రివైజ్డ్ టెస్టులో వచ్చే కాన్సెప్టులు ఇందులో ఉంటాయి.(https://www.ets.org/s/gre/pdf/gre_math_review.pdf). తొమ్మిది పేజీల ‘మాథ్ కన్వెన్షన్స్’ కూడా ఫ్రీ డౌన్‌లోడ్‌కి అందుబాటులో ఉంది.
(https://www.ets.org/s/gre/pdf/gre_math_conventions.pdf)
3. టెస్ట్‌కి సొంతగా ప్రిపేర్ అయ్యేవాళ్ళకి వరప్రసాదంలా టెస్ట్ పద్ధతుల్ని, ఎక్కువ స్కోర్లు సంపాదించడానికి ఉపయోగపడే ‘టిప్స్’ని విశదీకరించే 22 నిమిషాల వీడియోని ఏడు డాలర్లకి ఇ.టి.ఎస్. అందుబాటులోకి తెచ్చింది. ఈ వెబ్ లింక్‌లో దాని వివరాలు చూడవచ్చు.
https://store.ets.org/store/ets/en_US/DisplayCategoryProductListPage/categoryID.3551800/84202900
4. పైన ఇచ్చిన వెబ్ లింక్‌లోనే ‘డి అఫిషియల్ గైడ్ టు జి.ఆర్.ఇ రివైజ్డ్ జనరల్ టెస్ట్, సెకండ్ ఎడిషన్’ ఈ-బుక్‌గాను, లేదా పేపర్ బ్యాక్ పుస్తకంగాను, లేదా సి.డి.గాను 35 డాలర్లకి లభిస్తుంది. ఇది విస్తృతీకరణ పొందిన తాజాఎడిషన్. జి.ఆర్.ఇ టెస్టుని నిర్వహించే వారి నుంచే వచ్చిన ఈ గైడ్‌లో ప్రాక్టీస్ టెస్టులు, వందలాది (సాధికారికమైన) టెస్ట్ ప్రశ్నలు, జవాబులు, వాటికి వివరణలు, టెస్టు ఎలా తీసుకోవాలనే సూక్ష్మాలు, శాంపుల్ ‘ఎస్సే’లపై వ్యాఖ్యానాలు ఉండి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.
5. ‘స్కోర్లెట్ నౌ’ అనేది మీ రైటింగ్ స్కిల్స్‌ని మెరుగుపరచి మిమ్మల్ని జి.ఆర్.ఇ పరీక్షలో అనలిటికల్ రైటింగ్‌కి సమాయత్తం చేసే ఒక మంచి ఆన్-లైన్ సదుపాయం. ఇక్కడ ఇస్తున్న వెబ్‌లింకు నుంచి 13 డాలర్ల మొత్తం చెల్లించడం ద్వారా దీనికి ‘యాక్సెస్’ పొందవచ్చు.
https://www.dxrgroup.com/cgi-bin/scoreitnow/index.p
6. 5. టెస్టుకి రిజిస్టర్ చేసుకోవాలన్నా, టెస్ట్ సెంటర్ల వివరాలు మొదలైన సమాచారం కావాలన్నా ఈ వెబ్ లింక్‌ని అనుసరించండి https://www.ets.org/gre/subject/register