Skip to main content

ఎఫ్-1లు యు.ఎస్. బయటకు వెళ్లి రావాలంటే?

ఇండియా నుంచి అమెరికాకు ఎఫ్-1 విద్యార్థిగా వెళ్లి అక్కడ చదువుకుంటూ మధ్యలో 5 నెలలు, అంతకంటె తక్కువ కాలానికి ఇండియా వచ్చి వెళ్లేవారు మొదట తమ ఇండియా ప్రయాణానికి ముందుగా ఈ విషయాన్ని స్కూలు అధికారితో చర్చించాలి. మీ ట్రావెల్ సమాచారాన్ని పొందుపరిచిన కరెంట్ (తాజా) సెవిస్ ఐ20 ఫామ్‌ని మీ దగ్గర పెట్టుకోవాలి. అది తాజా సమాచారంతో ఉందని మీ స్కూలు అధికారి కూడా నిర్థారించుకోవాలి.

ఐదు నెలల కంటె తక్కువ కాలానికి ఇండియాలో ఉన్న తర్వాత తిరిగి అమెరికాలో ప్రవేశించేటప్పుడు మీరు మీ తాజా సెవిస్ ఐ20 ఫామ్‌ని, మీ రీ-ఎంట్రీ తర్వాత కనీసం 6 నెలల కాలానికి చెల్లుబాటు (వాలిడిటీ) గల పాస్‌పోర్టుని మీ దగ్గర ఉంచుకోవాలి. ఇండియా సహా కొన్ని దేశాల వారికి ఒక ఒప్పందం కింద అమెరికాలో మీ ఎంట్రీ తేదీ వరకు కాల పరిమితి ఉన్న పాస్ పోర్టు ఉన్నా సరిపోతుంది (ఇండియా సహా అనేక దేశాల పౌరులు తమ పాస్‌పోర్టులను అమెరికాలో రెన్యూ చేసుకునే వీలుంది).

ఇండియాలో ఐదు నెలలు, అంతకు తక్కువ కాలం బస చేశాక మళ్లీ యు.ఎస్.లో ప్రవేశించేటప్పుడు చెల్లుబాటు స్థితిలో (వాలిడ్)గా ఉన్న మీ ప్రస్తుత వీసా, లేదా మీరు అమెరికాకు పొరుగున ఉన్న ఒక దేశాన్ని లేదా సమీప దీవిని 30 రోజుల కంటె తక్కువగా సందర్శించిన ఆధారాలు మీ దగ్గర ఉండాలి. అలాగే మీ ట్యూషన్ ఫీజు, లివింగ్ ఖర్చులకు సరిపడా ఫండ్స్ మీ దగ్గర ఉన్నట్టు తెలిపే ఆర్థిక వనరుల ఆధారాలు కూడా మీ వెంట పెట్టుకోవాలి.

యు.ఎస్. బయటకు ఎప్పుడు వెళ్లకూడదు?: మీరు యు.ఎస్.లో స్టూడెంట్ స్టేటస్‌ని కొనసాగించింనంత కాలం ఎక్స్‌పయిర్ అయిపోయిన ఎఫ్-1 వీసా మీద మీరు అమెరికాలో ఉండవచ్చు. అయితే మీ వీసా గడువు తీరిపోయి (ఎక్స్‌పయిర్ అయి), మీ రికార్డు టెర్మినేట్ (రద్దు) అయివుంటే మీరు యాక్టివ్ స్టేటస్‌లో ఉన్నారని మళ్లీ సెవిస్ రికార్డు తెలిపేవరకు మీరు అమెరికా వెలుపలకు ప్రయాణించకుండా ఉండడం మేలు.

అలా కాక - సెవిస్ కార్డులోకి యాక్టివ్ స్టేటస్ సమాచారం రాకముందే మీరు అమెరికా బయటకు వెళితే మీరు అక్కడ మీ వీసాను రెన్యూ చేసుకుని మళ్లీ అమెరికాకు చేరుకోవడం సాధ్యపడకపోవచ్చు.

Published date : 14 Feb 2013 01:36PM

Photo Stories