Skip to main content

అమెరికాలో డెంటల్ స్టడీ, నర్సింగ్, పబ్లిక్ హెల్త్

డెంటల్‌స్టడీ: అమెరికాలో డెంటల్‌స్టడీ గ్రాడ్యుయేట్‌స్థాయిలో మాత్రమే ప్రారంభమవుతుంది. డెంటిస్ట్‌లుగా (దంతవైద్యులుగా) ప్రాక్టీస్ చేసుకునేందుకు లెసైన్స్‌కి నేరుగా అర్హతనిచ్చే అండర్ గ్రాడ్యుయేట్ డెంటిస్ట్రీ కోర్సులేవీ యు.ఎస్‌లో లేవు. యు.ఎస్.లో డెంటిస్ట్రీలో మొట్టమొదటి ప్రొఫెషనల్ డిగ్రీ డి.డి.ఎస్. (డాక్టర్ ఆఫ్ డెంటల్ సర్జరీ) లేదా డి.ఎం.డి. (డాక్టర్ ఆఫ్ డెంటల్ మెడిసిన్). నాలుగేళ్ళ కోర్సులో రెండేళ్ళు మెడికల్ సెన్సైస్ అధ్యయనం, రెండేళ్ళు క్లినికల్ ఓరియెంటేషన్ ఉంటాయి. అడ్మిషన్ అంత సులభం కాదు. అమెరికాలో ఒక కాలేజీలో, లేదా యూనివర్సిటీలో కనీసం రెండేళ్ళయినా చదవకుండా విదేశీ విద్యార్థులు యు.ఎస్. డెంటల్ స్కూళ్లలో ప్రవేశం పొందగలగడం అసాధ్యం. అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో మంచి అకడమిక్ రికార్డు, ఆంగ్లంలో ఫ్లూయెన్సీ, డెంటల్ అడ్మిషన్ టెస్ట్(https://www.ada.org /dat.aspx)లో మంచి స్కోరు దీనికి ముఖ్యమైన అప్లికేషన్ రిక్వయిర్‌మెంట్లు. ఇతర దేశాలలో శిక్షణ పొందిన డెంటిస్ట్‌లు యు.ఎస్.లో చదవాలనుకున్నప్పుడు వారు నేషనల్ బోర్డ్ డెంటల్ ఎగ్జామినేషన్‌లో ఉత్తీర్ణులు కావలసి ఉంటుంది.(https://www.ada.org/2289.aspx)కొన్ని స్పెషలైజేషన్ల విషయంలో అయితే విదేశీ డెంటిస్ట్‌లు తమ ప్రొఫెషనల్ స్టడీస్‌లో రెండు సంవత్సరాలైనా ఒక యు.ఎస్. యూనివర్శిటీలో పూర్తిచేసి కమిషన్ ఆన్ డెంటల్ అక్రిడేషన్ గుర్తింపు పొందిన స్కూలు నుంచి డి.డి.ఎస్. లేదా డి.ఎం.డి. డిగ్రీని సంపాదించవలసి ఉంటుంది.

నర్సింగ్: అమెరికాలో ఒక నర్సింగ్ స్కూల్‌లో చేసే డిగ్రీకి తమ స్వదేశంలో ఎంతవరకు గుర్తింపు, ఆమోదం ఉన్నాయనేది విదేశీ విద్యార్థులు ముందుగా సరి చూసుకోవలసిన విషయం. అలాగే ఒక నర్సింగ్ స్కూల్‌కి ఆయా రాష్ట్రాలలోని స్టేట్ బోర్డ్ ఆఫ్ నర్సింగ్ ఆమోదం ఉన్నదా లేదా అన్నది కూడా తెలుసుకోవాలి. అక్కడ రిజిస్టర్డ్ నర్స్ (ఆర్.ఎన్) అవ్వాలంటే రెండు మూడేళ్ళ డిప్లొమా, రెండేళ్ళ అసోసియేట్ డిగ్రీ ఇన్ నర్సింగ్ (ఎ.డి.ఎన్) లేదా నాలుగేళ్ళ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ నర్సింగ్ (బి.ఎస్.ఎన్) చేయవలసి ఉంటుంది. నర్సింగ్‌లో గ్రాడ్యుయేట్ ప్రోగ్రాములు చేసిన వారికి మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ నర్సింగ్ (ఎం.ఎస్.ఎన్), ఆ తర్వాత డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ ఇన్ నర్సింగ్ (పిహెచ్.డి.), లేదా డాక్టర్ ఆఫ్ నర్సింగ్ ప్రాక్టీస్ (డి.ఎన్.పి) డిగ్రీలు వస్తాయి. ది కమిషన్ ఆఫ్ నర్సింగ్ ఎడ్యుకేషన్, ది నేషనల్ లీగ్ ఫర్ నర్సింగ్ అక్రేడిటింగ్ కమిషన్లు అమెరికాలో బాకాలారియేట్ నర్సింగ్ ప్రోగ్రాములకి గుర్తింపునిచ్చే అక్రేడిటింగ్ ఏజెన్సీలు. ఇతర దేశాలలోని నర్సింగ్ స్కూల్స్ నుంచి వెళ్ళిన గ్రాడ్యుయేట్లు యు.ఎస్.లోని స్కూల్‌లో చేరడానికి ముందే సి.జి.ఎఫ్.ఎన్.ఎస్. పరీక్ష (కమిషన్ ఆన్ గ్రాడ్యుయేట్స్ ఆఫ్ ఫారిన్ నర్సింగ్ స్కూల్ ఎగ్జామ్ - (https://www.cgfns.org/), ఎన్.సి.ఎల్.ఇ.ఎక్స్. - ఆర్‌ఎన్ పరీక్ష (నేషనల్ కౌన్సిల్ ఆఫ్ లైసేన్స్యూర్ ఎగ్జాం ఫర్ రిజిస్టర్డ్ నర్సెస్) పాసై ఉండాలి. (https://www.ncsbn.org/2013_NCLEX_RN_Test_ Plan.pdf). ఇవి పాసై ఉండకపోతే విదేశీ విద్యార్థులు స్కూలు నుంచి వైదొలగాలి లేదా సెలవు తీసుకుని పరీక్షలు పూర్తిచేసి రావాలి.

పబ్లిక్ హెల్త్: యు.ఎస్.లో పబ్లిక్ హెల్త్‌కి సంబంధించిన డిగ్రీలలో మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (ఎం.పి.హెచ్.), మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ పబ్లిక్ హెల్త్ (ఎం.ఎస్.పి.హెచ్.), ఆ తర్వాత డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (పిహెచ్.డి), డాక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (డి.ఆర్.పి.హెచ్.). అడ్మినిస్ట్రేషన్, ఎపిడెమియాలజీ, ఎన్విరాన్‌మెంటల్ హెల్త్, బయో స్టాటిస్టిక్స్, హెల్త్ పాలసీ, బిహేవియరల్ హెల్త్ కొన్ని స్పెషలైజేషన్లు, పబ్లిక్ హెల్త్‌కి సంబంధించిన అడ్మిషన్ వివరాలను అసోసియేషన్ ఆఫ్‌స్కూల్స్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వెబ్‌సైట్ నుంచి పొందవచ్చు. (www.asph.org).

- మాగంటి నవలా రచయిత, యుఎస్ కాన్సులేట్ పూర్వ మీడియా  అడ్వయిజర్

Published date : 15 Nov 2012 03:52PM

Photo Stories