Skip to main content

Telangana Government Jobs: ప్ర‌భుత్వ ఉద్యోగ నియామకాలకు రెడీ.. మూడు నోటిఫికేషన్లు.. 4 పరీక్షలు..

సాక్షి, హైదరాబాద్‌: ఉద్యోగ ఖాళీల భర్తీకి ప్రభుత్వం అనుమతిచ్చిన వెంటనే వడివడిగా నోటిఫికేషన్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ స్పష్టం చేసింది.
టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ బి.జనార్ధన్‌రెడ్డి
టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ బి.జనార్ధన్‌రెడ్డి

ఈ దిశగా పకడ్భందీ ఏర్పాట్లు సైతం చేసుకుంటున్నట్లు వివరించింది. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ బి.జనార్ధన్‌రెడ్డి, సభ్యులు రమావత్‌ ధన్‌సింగ్, బండి లింగారెడ్డి, కోట్ల అరుణకుమారి, కారెం రవీందర్‌రెడ్డి, అరవెల్లి చంద్రశేఖర్‌రావు, ఆర్‌.సత్యనారాయణ, కార్యదర్శి అనితా రామచంద్రన్ మార్చి 15వ తేదీన(మంగళవారం) గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను కలిశారు. ఈ సందర్భంగా టీఎస్‌పీఎస్సీ 2020–21 వార్షిక నివేదికను సమర్పించారు. ఉద్యోగ నియామకాలకు సంబంధించి తీసుకుంటున్న చర్యలను గవర్నర్‌కు కమిషన్‌ చైర్మన్‌ జనార్థన్‌రెడ్డి వివరించారు. 

టీఎస్‌పీఎస్సీ స్టడీ మెటీరియల్

తెలంగాణ పోలీసు ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

మూడు నోటిఫికేషన్లు.. 
ఏప్రిల్‌ 2020 నుంచి మార్చి 2021 వరకు టీఎస్‌పీఎస్సీ 149 ఖాళీల భర్తీకి 3 నోటిఫికేషన్లు జారీ చేసింది. మొత్తంగా 119 ఖాళీల భర్తీకిగాను 4 పరీక్షలు నిర్వహించింది. మొత్తం 10630 మంది అభ్యర్థులు ఈ పరీక్షలు రాశారు. పెండింగ్‌లో ఉన్న నోటిఫికేషన్ల తాలూకు చర్యలు తీసుకుని 2370 మంది అభ్యర్థులను ఎంపిక చేసింది. శాఖాపరమైన పరీక్షలకు 1,26,381 మంది అభ్యర్థులు హాజరు కాగా, 53,886 మంది అర్హత సాధించారు.

టీఎస్‌పీఎస్సీ ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

తెలంగాణ డీఎస్సీ/టెట్‌ స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ 2022 సమావేశాల్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కీలక ప్రకటన చేసిన విష‌యం తెల్సిందే. ఊహించినట్లుగానే భారీగా కొలువుల భర్తీ ప్రకటనను స్వయంగా వెల్లడించారు. మొత్తం 91,142 ఉద్యోగాలకు భర్తీ ప్రక్రియ ప్రారంభం అని ప్రకటించారు.

➤ 11,103 కాంట్రాక్ట్‌ ఉద్యోగుల రైగ్యులరైజేషన్‌

➤ గ్రూప్‌-1 పోస్టులు:  503

➤ గ్రూప్‌-2 పోస్టులు : 582

➤ గ్రూప్‌-3 పోస్టులు: 1,373

➤ గ్రూప్‌-4 పోస్టులు : 9,168  

టీఎస్‌పీఎస్సీ ప‌రీక్ష‌ల ఆన్‌లైన్ టెస్టుల కోసం క్లిక్ చేయండి

➤ జిల్లా స్థాయిల : 39, 829 పోస్టులు.
➤ హైదారాబాద్‌ ☛  5,268
➤ నిజామాబాద్‌ ☛  1,976 
➤ మేడ్చల్‌ మల్కజ్‌గిరి ☛ 1,769
➤ రంగారెడ్డి ☛ 1,561
➤ కరీంనగర్‌ ☛ 1,465
➤ నల్లగొండ  ☛1,398
➤ కామారెడ్డి ☛ 1,340
➤ ఖమ్మం ☛ 1,340
➤ భద్రాద్రి కొత్తగూడెం☛ 1,316
➤ నాగర్‌ కర్నూలు☛1,257
➤ సంగారెడ్డి☛1,243
➤ మహబూబ్‌నగర్‌☛ 1,213
➤ ఆదిలాబాద్‌☛ 1,193
➤ సిద్దిపేట☛ 1,178
➤ మహబూబాబాద్‌☛ 1, 172
➤ హన్మకొండ ☛ 1,157
➤ మెదక్‌ ☛ 1,149
➤ జగిత్యాల☛ 1, 063
➤ మంచిర్యాల ☛ 1, 025
➤ యాదాద్రి-భువనగిరి☛ 1,010 
➤ జయశంకర్‌ భూపాలపల్లి ☛ 918
➤ నిర్మల్‌ ☛876
➤ వరంగల్‌ ☛842
➤ కొమురంభీం ఆసీఫాబాద్‌ ☛ 825
➤ పెద్దపల్లి ☛800
➤జనగాం ☛760
➤ నారాయణ్‌పేట ☛ 741
➤వికారాబాద్‌ ☛738
➤ సూర్యాపేట ☛719
➤ ములుగు ☛ 696
➤ జోగులాంబ గద్వాల ☛ 662
➤ రాజన్న సిరిసిల్ల ☛ 601
➤ వనపర్తి ☛556

టీఎస్‌పీఎస్సీ గ్రూప్స్ ప్రీవియ‌స్‌పేప‌ర్స్‌ కోసం క్లిక్ చేయండి

☛ జోనల్‌ లెవల్‌లో 18, 866 పోస్టులు

☛ మల్టీజోనల్‌లో 13, 170 ఉద్యోగాల ఖాళీ

☛ ఇతర కేటగిరీ, వర్సిటీల్లో 8, 174 పోస్టులు..

80,039 పోస్టులకు నుంచే నోటిఫికేషన్లు..
నిరుద్యోగుల జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించడంతో పాటు మొత్తం ఖాళీలలో.. 11, 103 కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేస్తున్నట్లు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు సీఎం కేసీఆర్‌. అలాగే మిగిలిన వాటిల్లో  80,039 పోస్టులకు ఇవాళ్టి(మార్చి 9, 2022) నుంచే నోటిఫికేషన్లు జారీ అవుతాయని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. అంతేకాదు ఉద్యోగ గరిష్ట వయోపరిమితిని పదేళ్లకు పెంచుతున్నట్లు తెలిపారు.

పోటీప‌రీక్ష‌ల బిట్స్‌ కోసం క్లిక్ చేయండి

అత్యధికంగా హోం శాఖలోనే..
మొత్తం 80,039 ఖాళీల్లో..  అత్యధికంగా హోం శాఖలో 18,334 ఖాళీలు ఉన్నాయి. తర్వాతి  సెకండరీ ఎడ్యుకేషన్‌లో 13,086 ఖాళీలు, ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖలో 12,775 ఖాళీలు ఉన్నాయి. 

అత్యల్పంగా ఈ శాఖ‌లోనే..
ఉన్నత విద్యలో 7, 878, బీసీల సంక్షేమం 4, 311, రెవెన్యూలో 3, 560, షెడ్యూల్‌ కాస్ట్స్‌ డెవలప్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌లో 2, 879, ఇరిగేషన్‌లో 2, 692, ఫైనాన్స్‌లో 1, 146, అత్యల్పంగా లెజిస్లేచర్‌లో 25, విద్యుత్‌ శాఖలో 16 ఖాళీలు ఉన్నాయి. 

కాంట్రాక్ట్ ఉద్యోగులే..
కాంట్రాక్ట్ ఉద్యోగాలు వద్దన్నందుకు రాష్ట్రంలోని పలు పార్టీలు కోర్టుకు వెళ్లాయని చెప్పారు సీఎం కేసీఆర్‌. ఉద్యోగి కన్నా కాంట్రాక్ట్ ఉద్యోగులే ఎక్కువ పనిచేస్తుంటార‌ని, అయినప్ప‌టికీ వారి జీతాలు మాత్రం తక్కువగా ఉంటున్నాయ‌ని చెప్పారు.కాంట్రాక్ట్ పేరుతో శ్రమదోపిడి ఉండకూడ‌ద‌నేది త‌మ‌ అభిలాష అని ఆయన అన్నారు. అందుకే 11,103 కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యుల‌రైజ్ చేస్తున్న‌ట్లు తెలిపారు. ఇక ఉద్యోగ క్యాలెండర్ విడుద‌ల చేస్తామ‌ని చెప్పారు. క్ర‌మంగా ఉద్యోగాల భ‌ర్తీ ఉంటుంద‌ని చెప్పారు. 

1.12 లక్షల కొత్త పోస్టులు..
రాష్ట్రంలో ఇప్ప‌టికే తాము 1.56 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇచ్చామని, 1.12 లక్షల కొత్త పోస్టులు మంజూరు చేశామ‌ని చెప్పుకొచ్చారు. తెలంగాణ‌లో 1,33,940 ఉద్యోగాలు భర్తీ అయ్యాయని చెప్పారు.

వ‌యోప‌రిమితి ఇలా..
☞ ఓసీ అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితి 44 ఏళ్లు
☞ ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థుల వయోపరిమితి 49 ఏళ్లు
☞ దివ్యాంగ అభ్యర్థుల వయోపరిమితి 54 ఏళ్లు
☞ ఎక్స్‌ సర్వీస్‌మెన్లకు వయోపరిమితి 47 ఏళ్లు
☞ హోంశాఖలో వయోపరిమితి మినహాయింపు లేదు

Published date : 16 Mar 2022 07:32PM

Photo Stories