Skip to main content

Government Jobs: ఉద్యోగ ఖాళీల భర్తీకి.. ఎనీ టైం రెడీ..! ఈ ఐదు సంక్షేమ శాఖల్లో ఏకంగా..

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ నియామకాల సందడి జోరందుకుంది. ఆర్థిక శాఖ అనుమతులు రావాల్సి ఉంది.
Telangana Government Jobs
Telangana Government Jobs Notification

ప్రస్తుతం శాఖలవారీగా ఉద్యోగ ఖాళీల ఫైళ్లు ఆర్థిక శాఖ వద్ద ఉన్నాయి. విడతలవారీగా ఈ ఫైళ్లను ఆర్థిక శాఖ ఆమోదిస్తూ వస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 27 ప్రధాన ప్రభుత్వ శాఖల్లో 80 వేల ఉద్యోగాలున్నట్లు ప్రభుత్వం ప్రకటించగా.... ఇందులో పోలీసు, వైద్య, ఆరోగ్యంతోపాటు మరో రెండు శాఖల్లో మొత్తంగా 30 వేల ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఆ తర్వాత విద్యాశాఖలో అత్యధికంగా 7 వేల పోస్టులున్నాయి. ఇవి కాకుండా అత్యధిక ఖాళీలున్నవి సంక్షేమ శాఖల్లోనే. ఐదు సంక్షేమ శాఖల పరిధిలో ఏకంగా 13,527 ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. మొత్తంగా 27 శాఖల్లో ఉన్న ఖాళీల సంఖ్యలో కేవలం 8 శాఖల్లోనే అత్యధిక ఉద్యోగ ఖాళీలున్నట్లు స్పష్టమవుతోంది. సంక్షేమ శాఖల పరిధిలో ఉన్న ఖాళీల్లో అత్యధికం బోధన కేటగిరీకి సంబంధించినవే. సంక్షేమ శాఖల పరిధిలో విరివిగా గురుకుల విద్యాసంస్థలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. డిమాండ్‌కు తగినట్లుగా ఈ విద్యా సంస్థలను అప్‌గ్రేడ్‌ చేస్తూ వచి్చంది. దీంతో బోధనా సిబ్బందిని నియమించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. బోధన, బోధనేతర సిబ్బంధితోపాటు సంక్షేమ శాఖ ప్రధాన కార్యాలయాల్లో అరకొర ఖాళీలను సైతం భర్తీ చేయనుంది.

Government Jobs: గుడ్‌న్యూస్‌.. 30,453 ఉద్యోగాల‌కు అనుమతి.. ముందుగా ఈ శాఖ‌ల్లోనే పోస్టులు భ‌ర్తీ..

సంక్షేమ శాఖ ఖాళీలు
ఎస్సీ 2,879
ఎస్టీ 2,399
బీసీ 4,311
మైనార్టీ 1,825
మహిళా, శిశు 895
కార్మిక‌ 1,221

Government Jobs: ప్ర‌భుత్వ‌ ఉద్యోగాల‌కు కొత్త రోస్టర్ ఇదే.. ఈ మేర‌కే ఉద్యోగాల భ‌ర్తీ

 

Published date : 26 Mar 2022 03:03PM

Photo Stories