Telangana Contract Jobs & Outsourcing Jobs 2023 : కాలేజీల్లో 2,858 కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. పోస్టుల వివరాలు ఇవే..
Sakshi Education
సాక్షి ఎడ్యుకేషన్ : తెలంగాణలోని నిరుద్యోగులకు ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. ఈ సారి రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్ధతిన పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
మొత్తం 2,858 పోస్టులకు గానూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో కాంట్రాక్ట్ పద్ధతిన 527 మంది లెక్చరర్లను, 341 మందిని ఔట్ సోర్సింగ్ పద్ధతిన, 50 మంది టీఎస్‌కేసీ ఫుల్ టైమ్ మెంటర్లను హోనరేరియం కింద, 1,940 మందిని గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల పూర్తి వివరాలు ఇవే..
పోస్టు | ఖాళీలు |
లెక్చరర్లు | 527 |
టీఎస్‌కేసీ ఫుల్ టైమ్ మెంటర్లు | 50 |
గెస్ట్ ఫ్యాకల్టీ | 1,940 |
సీనియర్ అసిస్టెంట్ | 29 |
డాటా ఎంట్రీ ఆపరేటర్ | 31 |
స్టోర్ కీపర్ | 40 |
జూనియర్ స్టెనో | 01 |
రికార్డు అసిస్టెంట్ | 38 |
మ్యూజియం కీపర్ | 07 |
హెర్బేరియం కీపర్ | 30 |
మెకానిక్ | 08 |
ఆఫీసు సబార్డినేట్ | 157 |
మొత్తం | 2,858 |
Published date : 26 Oct 2023 09:15AM