సాక్షి, అమరావతి: కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీల్లో) బోధన సిబ్బంది పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువును జూన్ 8 వరకు పొడిగించారు.
కేజీబీవీల్లో పోస్టుల దరఖాస్తుకు చివరి తేదీ ఇదే..
కాంట్రాక్టు పద్ధతిలో భర్తీచేయనున్న ఈ పోస్టులకు దరఖాస్తులు సాంకేతిక సమస్య కారణంగా ఆలస్యం అవుతున్నాయి. ఈ క్రమంలో అభ్యర్థుల అభ్యర్థన మేరకు దరఖాస్తు గడువును పెంచినట్టు సమగ్ర శిక్ష కార్యాలయం జూన్ 6న ఒక ప్రకటనలో తెలిపింది.