Anganwadi Worker Salary Hike : అంగన్‌వాడీ ఉద్యోగులకు జీతాలు పెంచిన ప్రభుత్వం.. అలాగే 14,236 పోస్టుల భర్తీకి...

ఇందులో భాగంగా మినీ అంగన్‌వాడీ టీచర్లను అంగన్‌వాడీ టీచర్‌గా ప్రమోట్ చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3,989 మంది మినీ అంగన్‌వాడీ టీచర్లు ఇకపై అంగన్‌వాడీ టీచర్లుగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన తాజా ఉత్తర్వులతో రాష్ట్రంలో ఇకపై మినీ, మెయిన్ అంగన్‌వాడీ అనే తేడా ఉండదు. గతంలో మినీ అంగన్‌వాడీలకు రూ.7800 జీతం మాత్రమే ఇస్తుండగా.., తాజా నిర్ణయంతో వారికి రూ.13,650 జీతం అందనుంది. పెంచిన వేతనం ఏప్రిల్ నెల నుంచి అకౌంట్లలో జమ కానుంది.
కొత్తగా అంగన్‌వాడీ జాబ్స్‌కు..
జీతాలు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3,989 అంగన్‌వాడీ టీచర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కొత్తగా 14,236 పోస్టులతో...
తెలంగాణ ప్రభుత్వం మహిళా, శిశు సంక్షేమ విభాగంలో భారీ నియామక ప్రక్రియకు ఆమోదం తెలిపిన విషయం తెల్సిందే. ఈ ప్రక్రియ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 6,399 ఆంగన్‌వాడీ టీచర్లు, 7,837 అంగన్‌వాడీ సహాయకుల ఖాళీలను భర్తీ చేయనుంది. అలాగే మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఈ నియామక ప్రక్రియకు ఆమోదం తెలిపే ఫైల్‌పై సంతకం చేశారు. తెలంగాణలో మొదటి సారిగా ఇంత పెద్ద ఎత్తులో ఆంగన్‌వాడీ పోస్టుల కోసం నియామక ప్రక్రియ చేపట్టబడుతోంది.ఈ 14,236 పోస్టుల భర్తీతో రాష్ట్రంలో అంగన్‌వాడీ కేంద్రాల పనితీరు మరింతగా మెరుగుపడి, మహిళలు, పిల్లల సంక్షేమానికి అనుకూలంగా మారుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
అంగన్‌వాడీ టీచర్ల ఉద్యోగాలకు నోటిఫికేషను త్వరగా విడుదల చేయాలంటూ... ఈ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు మంత్రి సీతక్క కోరుతున్నారు.
Tags
- anganwadi workers salary hike announcement
- ts anganwadi workers salary hike announcement
- telangana anganwadi recruitment 2025
- ts anganwadi jobs news notification 2025
- ts anganwadi employees salary hikes
- ts anganwadi teacher salary hikes
- ts anganwadi teacher salary hikes news in telugu
- ts anganwadi salary increase news today
- ts anganwadi salary increase news today telugu
- ts anganwadi teacher salary hike news telugu
- ts anganwadi teacher jobs notification 2025