Skip to main content

వృత్తి విద్యాకోర్సుల్లో అమ్మాయిలు తగ్గిపోతున్నారు

న్యూఢిల్లీ: వృత్తి విద్యా కోర్సుల్లో చేరే అమ్మాయిల సంఖ్య ఏడాదికేడాది తగ్గిపోతోందని ఆల్‌ ఇండియా సర్వే ఆన్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ (ఏఐఎస్‌హెచ్‌ఈ) 2019–20లో వెల్లడైంది.
2015–16 నుంచి 2019–20 విద్యా సంవత్సరాన్ని పోల్చి చూస్తే ఉన్నత విద్యలో చేరే విద్యార్థినుల సంఖ్య 18 శాతం పెరిగిందని ఆ సర్వేలో వెల్లడైనట్టు గురువారం కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ నివేదికని విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 1,019 యూనివర్సిటీలు, 39,955 కాలేజీలు, 9,599 విద్యా సంస్థలు ఈ సర్వేలో పాల్గొన్నాయి. పీజీ స్థాయిలో ఉన్నత విద్యతో పోల్చి చూస్తే వృత్తి విద్యా కోర్సుల్లో చేరే అమ్మాయిల సంఖ్య తక్కువగా ఉంది. ‘‘గత అయిదేళ్ల కాలంలో బీసీఏ, బీబీఏ, బీటెక్, బీఈ, ఎల్‌ఎల్‌బీలలో చేరే అమ్మాయిలు తగ్గిపోతున్నారు’’అని ఆ నివేదిక వివరించింది.
Published date : 11 Jun 2021 01:01PM

Photo Stories