Skip to main content

స్మార్ట్ టెక్నాలజీలో నైపుణ్యశిక్షణ: మంత్రి కేటీఆర్

సాక్షి, హైదరాబాద్: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలోని అన్ని రకాల డొమైన్లలోనూ స్మార్ట్ టెక్నాలజీ ఆధారిత పరిష్కారాల దిశగా ఆవిష్కణలు జరుగుతున్నాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు.
రాష్ట్రంలోని యువత కూడా స్మార్ట్ టెక్నాలజీలో నైపుణ్యం సాధించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కూల్ అండ్ నాలెడ్‌‌జ (టాస్క్), తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (టీఎస్‌సీహెచ్‌ఈ) సంయుక్త భాగస్వామ్యంలో చేపట్టిన నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని కేటీఆర్ గురువారం ప్రారంభించారు. ‘మార్చ్ టు మిలియన్’పేరిట చేపట్టిన నైపుణ్య శిక్షణలో భాగంగా 2021 నాటికి రాష్ట్రంలోని 30 వేల మంది యువతకు ఆధునిక ఐటీ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)లో నైపుణ్య శిక్షణ ఇస్తామన్నారు. మైక్రోసాఫ్ట్, నాస్కామ్ ఫ్యూచర్ స్కిల్స్ సంస్థలు ఈ శిక్షణలో భాగస్వాములుగా ఉంటాయని ఆయన వెల్లడించారు.

టెక్నాలజీ విప్లవంలో భాగస్వామ్యం..: జయేశ్ రంజన్
ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా జరుగుతున్న టెక్నాలజీ విప్లవంలో రాష్ట్ర విద్యార్థులు భాగస్వాములు కావాలని ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్ పిలుపునిచ్చారు. నైపుణ్య శిక్షణలో భాగంగా ఏఐ, మెషీన్ లెర్నింగ్, డేటా సైన్స్ వంటి ఆధునిక ఐటీ టెక్నాలజీలోని కాన్సెప్ట్‌లపై శిక్షణ ఉంటుందన్నారు. ఈ నెల 23 నుంచి ఈ శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయని చెప్పారు. సైన్స్, హ్యుమానిటీస్ తేడా లేకుండా అన్ని రకాల కేటగిరీల విద్యార్థులు ఈ శిక్షణ పొందడానికి అర్హులని టాస్క్ సీఈఓ శ్రీకాంత్ సిన్హా వెల్లడించారు. కోవిడ్ సమయంలో ఈ తరహా శిక్షణ కార్యక్రమాలు విద్యార్థులకు భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలను పెంచుతాయని ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి చెప్పారు.
Published date : 13 Nov 2020 04:16PM

Photo Stories