Skip to main content

స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సుల అధ్యయనానికి కమిటీ

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నిర్వహిస్తున్న కోర్సులను అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది.
ఈ కమిటీ ఎనిమిది వారాల్లో ప్రభుత్వానికి నివేదిక ఇస్తుందని స్కిల్ డెవలప్‌మెంట్, ట్రైనింగ్ (స్కిల్స్) డిపార్టుమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ జి.అనంతరాము ఫిబ్రవరి 25 (మంగళవారం)నఓ ప్రకటనలో తెలిపారు. కమిటీకి చైర్మన్‌గా పరిశ్రమల శాఖ మంత్రి వ్యవహరిస్తారు.
Published date : 26 Feb 2020 03:21PM

Photo Stories