రేపటి నుంచి టీఎస్ పాలిసెట్ - 2020 ప్రత్యేక కౌన్సెలింగ్
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: పాలిటెక్నిక్ కాలేజీల్లో డిప్లొమా కోర్సుల్లో మిగిలిన సీట్లలో ప్రవేశాల కోసం అక్టోబర్ 8 నుంచి ప్రత్యేక విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ప్రవేశాల కమిటీ తెలిపింది.
ఇప్పటివరకు ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకాని వారు ఈ నెల 8న (htt pr://tspolycet. nic.in) రిజిస్టర్ చేసుకొని, ఫీజు చెల్లించి, వెరిఫికేషన్‌కు స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించింది. ఆ తర్వాత 9,10 తేదీల్లో ఆప్షన్లు ఇచ్చుకోవాలని, 12న సీట్లను కేటాయిస్తామని, 12 నుంచి 14 వరకు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించి కాలేజీల్లో రిపోర్టు చేయాలని వివరించింది. 13న స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు జారీచేస్తామని, 20 నాటికి స్పాట్ అడ్మిషన్లు పూర్తి చేస్తామని పేర్కొంది.
Published date : 07 Oct 2020 01:49PM