ప్రవేశ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి త్వరలో ప్రత్యేక యాప్: పోఖ్రియాల్
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతున్నప్పటికీ విద్యార్థులకు నష్టం వాటిల్లకుండా అవసరమైన అన్ని రకాల ప్రత్యామ్నాయాలు చేపట్టామని కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ వెల్లడించారు.
దేశవ్యాప్తంగా 25 కోట్ల మంది విద్యార్థులకు ఉపయోగపడేలా ఆన్‌లైన్/డిజిటల్/రేడియో పాఠాలను అందుబాటులోకి తెచ్చామన్నారు. కరోనా పరిస్థితుల్లో విద్యారంగంలో చేపట్టిన చర్యలను వివరిస్తూ రమేశ్ పోఖ్రియాల్ ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఆ వివరాలు..
ప్ర: కరోనా నేపథ్యంలో విద్యార్థుల చదువులకు ఆటంకం కలగకుండా ఏం చర్యలు తీసుకున్నారు?
జ: కరోనా కారణంగా ఎదురైన సవాళ్లను అధిగమించేందుకు ఉపాధ్యాయులకు ఆన్‌లైన్‌లో శిక్షణనిచ్చాం. వృత్తిపరమైన అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాం. స్కూళ్లు మూతబడినప్పటికీ మల్టీమోడల్ విధానంలో విద్యను దీక్ష, స్వయం, కమ్యూనిటీ రేడియోల ద్వారా అందుబాటులోకి తెచ్చాం. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా పీఎం ఈ-విద్యతోపాటు డిజిటల్/ ఆన్‌లైన్/రేడియో వంటి అన్ని ప్రత్యామ్నాయాలను అందుబాటులోకి తెచ్చాం. ఈ మల్టీ యాక్సెస్ విధానం 25 కోట్ల మంది విద్యార్థులకు ఉపయోగకరంగా మారింది. అలాగే టీవీ (వన్ క్లాస్ వన్ ఛానల్), కమ్యూనిటీ రేడియో, సీబీఎస్‌ఈ శిక్షా వాణి, పోడ్‌కాస్ట్ ద్వారా నేర్చుకునేలా చర్యలు చేపట్టాం.
ఆన్‌లైన్ సౌలభ్యంలేని గ్రామాల్లో విద్యార్థుల బోధన మాటేమిటి?
ఆన్‌లైన్ సదుపాయం లేని విద్యార్థుల కోసం స్వయంప్రభ టీవీ చానల్‌తోపాటు రేడియో చానల్‌ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చాం.
12వ తరగతి/ఇంటర్‌లో ప్రత్యక్ష విద్యా బోధన లేకుండా విద్యార్థులు పోటీ పరీక్షలకు ఎలా సిద్ధమవుతారని భావిస్తున్నారు?
వారి కోసం ఇప్పటికే నేషనల్ టెస్ట్ అభ్యాస్‌ను అందుబాటులోకి తెచ్చాం. జేఈఈ మెయిన్, నీట్ వంటి పరీక్షల మాక్ టెస్టుల కోసం మొబైల్ యాప్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) త్వరలోనే అందుబాటులోకి తెస్తోంది. దాన్ని విద్యార్థులు ఉచితంగా పొందవచ్చు.
జేఈఈ అడ్వాన్స్ డ్‌ను ఎన్నిసార్లు నిర్వహిస్తారు?
జేఈఈ అడ్వాన్స్ డ్‌ను ఒక్కసారే నిర్వహిస్తాం.

Published date : 28 Dec 2020 02:28PM