Skip to main content

ప్రత్యేక పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు సిద్ధం

సాక్షి, హైదరాబాద్: తైవాన్ భాగస్వామ్యంతో ప్రత్యేక పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
రాష్ట్రంలో పర్యటిస్తున్న తైవాన్‌ ఆర్థిక, సాంస్కృతిక కమిటీ (టెక్క్‌), తైవాన్‌ విదేశీ వాణిజ్యాభివృద్ధి మండలి (తైత్ర), ఇన్వెస్ట్‌ ఇండియా సంయుక్త ప్రతినిధి బృందం మంత్రి కేటీఆర్‌తో బుధవారం భేటీ అయింది. రాష్ట్రంలోని వ్యాపార అనుకూలతలు, మౌలిక వసతుల నేపథ్యంలో అనేక దేశాలు భారీ పెట్టుబడులతో వస్తున్న విషయాన్ని కేటీఆర్‌ ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో తైవాన్‌ పారిశ్రామిక పెట్టుబడులకూ తెలంగాణ ప్రాధాన్యత ఇస్తుందన్నారు. తైవాన్‌ కంపెనీల పెట్టుబడులను ఆకర్షించేందుకు గతంలో తాను తైవాన్‌లో పర్యటించిన విషయాన్ని టెక్క్‌ డైరెక్టర్‌ జనరల్‌ బెన్‌వాంగ్‌కు కేటీఆర్‌ వివరించారు.

చ‌ద‌వండి: తెలంగాణ మోడల్‌ స్కూల్‌ టీచర్లకు పీఆర్సీ వర్తింపు

చ‌ద‌వండి: రేపటి నుంచి.. వైద్య కళాశాలలు ప్రారంభం
Published date : 29 Jul 2021 04:47PM

Photo Stories